చిక్కుడు

చిక్కుడులో చాక్లెట్ మచ్చ తెగులు

Botrytis fabae

శీలీంధ్రం

క్లుప్తంగా

  • ఆకులు,కాండం మరియు పూలపై విపరీతంగా సన్నటి ఎరుపు-గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి.
  • పెరిగేకొద్ది ఈ మచ్చలు కలిసిపోయి, ఆకు పైన చాక్లెట్ రంగు మచ్చలుగా ఏర్పడతాయి.
  • తెగులు తీవ్రత అధికంగా ఉంటే (కానీ అల అరుదుగా జరుగుతుంది) ఆకులు నల్లని రంగులోకి మారడం మరియు చాక్లెట్ పౌడర్‌తో కప్పివేయడం జరుగుతుంది.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

చిక్కుడు

లక్షణాలు

ఈ వ్యాధి చిక్కుడు పంటకు మాత్రమే సంక్రమిస్తుంది. ప్రధానంగా ఆకులపై, మరియు కాండం, పూలపై అనేక చిన్న చిన్న ఎరుపు-గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఇవి విస్తరించినప్పుడు, బూడిద రంగు, నిర్జీవమైన కేంద్రం చుట్టూ ఎర్రటి-గోధుమ రంగు అంచుతో ఈ మచ్చలు ఆకు ఈనెల మధ్యన చాక్లెట్ రంగు మచ్చలను ఏర్పరుస్తాయి. తెగులు తీవ్రత అధికంగా ఉంటే (కానీ అరుదుగా) ఆకులు నల్లని రంగులోకి మారడం మరియు చాక్లెట్ పౌడర్‌తో కప్పివేయడం జరుగుతుంది. ఇవి చాక్లెట్ పౌడర్‌తో దుమ్ము పట్టి ఉన్నాయనే అభిప్రాయాన్ని కలిగిస్తాయి. చివరికి, ఇది మొక్క ఎదుగుదల తగ్గడానికి లేదా కొంత భాగం లేదా మొత్తం చిగుర్లు చనిపోవడానికి దారితీస్తుంది. కొన్ని సందర్భాల్లో పూల మొగ్గలు విచ్చిన్నమవుతాయి. అయినప్పటికీ ఈ చిక్కుళ్లను తినవచ్చు కానీ కాయలు రంగు మారవచ్చు. ముందు రకం తెగులు దాడి అధిక నష్టానికి కారణమౌతుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

ఈ తెగులు నియంత్రణకు, ఇప్పటి వరకు ఎటువంటి ఆర్ధికంగా ఆచరణీయమైన నియంత్రణ పద్ధతి కనుగొనబడలేదు. ఏదేమైనా, పంట బలహీనపడకుండా లేదా ఏ విధమైన దాడికి గురవ్వకుండా జాగ్రత్త వహించాలి.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. నేటి వరకు చిక్కుడు చాక్లెట్ మచ్చల తెగులుకు వ్యతిరేకంగా ఆర్థికంగా ఆచరణీయమైన నియంత్రణ పద్ధతి కనుగొనబడలేదు. కొన్ని సందర్భాల్లో పూత సమయంలో పంటకు శిలీంద్ర నాశినులను పిచికారీ చేయడం ద్వారా దిగుబడి పరంగా కలిగే తీవ్రమైన నష్టాన్ని నివారించవచ్చు.

దీనికి కారణమేమిటి?

ఫాబాబీన్స్‌ పైన లక్షణాలు ప్రధానంగా బొట్రిటిస్ ఫాబే అనే ఫంగస్ వల్ల సంభవిస్తాయి, అయినప్పటికీ ఇతర జాతుల బొట్రిటిస్ వలన కూడా ఈ తెగులు సంభవించవచ్చు. మచ్చల మధ్యలో చనిపోయిన కణజాలంపై బీజాంశం ఏర్పడుతుంది మరియు ఆరోగ్యకరమైన మొక్కలకు సంక్రమణను వ్యాపింపచేస్తుంది. అనుకూలమైన పరిస్థితులలో ఈ బీజాంశం ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ కాలం ఆకు ఉపరితలంపై జీవించి ఉంటుంది. అధిక తేమ, తరచూ వర్షపాతం, ఆకులు అధిక సమయం తేమతో ఉండడం మరియు 15-22°C పరిధిలో ఉష్ణోగ్రతలు సంక్రమణకు అనుకూలం. ఆకు తేమ యొక్క బాష్పీభవన రేటును పెంచే ఏవైనా అంశాలు సంక్రమణను నిరోధిస్తాయి లేదా తగ్గిస్తాయి (గాలి, పొడి వాతావరణం). ఆమ్ల నేలలు, దట్టంగా విత్తనాలు నాటడం, పొటాషియం లేదా భాస్వరం లోపాలు లేదా నీరు నిలిచి ఉండడం వంటి పంటను బలహీనపరిచే ఇతర పరిస్థితులు కూడా వ్యాధికి లేదా దాని తీవ్రతకు అనుకూలంగా ఉంటాయి. శీతాకాలంలో నాటిన పంటలు, నీడ ప్రాంతాల్లో వేసిన పంటలకు కూడా ఈ తెగులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.


నివారణా చర్యలు

  • ధృవీకరించబడిన మూలాల నుండి ఆరోగ్యకరమైన విత్తనాలను ఉపయోగించండి.
  • నాటేటప్పుడు విత్తనాలు లేదా మొక్కలను బాగా దూరంగా నాటండి.
  • ఈలోపల ఫాబా చిక్కుడు వేసిన పొలాల్లో చిక్కుడు పంటను వేయకండి.
  • ఈ తెగులుకు అధిక స్థాయి నిరోధకత కలిగిన రకాలను వాడండి.
  • అవసరమైతే సున్నం వేసి నేల pH ను సరిచేయండి.
  • సమతుల్య ఎరువులను వాడండి.
  • అధిక మొత్తంలో నత్రజని ఎరువులు వాడకండి.
  • తెగులు సంకేతాల కోసం పొలాన్ని క్రమం తప్పకుండా పర్యవేక్షించండి.
  • పంట కోతల తర్వాత మొక్కల అవశేషాలను సేకరించి నాశనం చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి