Physoderma maydis
శీలీంధ్రం
చిన్న చిన్న పసుపు నుండి గోధుమ రంగు చుక్కలు ఆకులపై, కాడలపై, పైతొడుగుపై మరియు పొట్టుపైన ఏర్పడతాయి. తెగులు తీవ్రత అధికమైనపుడు ఇవి పెద్దగా మారి ఇంకా అధిక సంఖ్యలో మచ్చలు ఏర్పడతాయి. ఇలా ఏర్పడిన మచ్చలు లేదా పట్టీలు ఆకులపైన అధిక మొత్తాన్ని ఆక్రమిస్తాయి. ఇవి పసుపు రంగు నుండి గోధుమ రంగులో ఉంటాయి. వీటి లక్షణాలు తుప్పు తెగులు లక్షణాలను పోలివుంటాయి. కానీ తుప్పు తెగులు లక్షణాలతో పోలిస్తే P. మేడిస్ మచ్చలు ఆకులపై, ముఖ్యంగా ఆకు కాడ వద్ద ఒక ప్రత్యేకమైన పట్టీలను ఏర్పరుస్తాయి. ఆకు ఈనెలకు బాగా దగ్గరగా ముదురు గోధుమ నుండి నలుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ తెగులు సోకిన మొక్కల ఆకుల ఈనెల వద్ద ఈ మచ్చలు చాకోలెట్ రంగులో నుండి ఎర్రటి గోధుమ రంగు లోకి లేదా ఊదారంగులోకి మారతాయి.
P. మేడిస్ ని నివారించడానికి ఎటువంటి జీవ చికిత్స అందుబాటులో లేదు. మీకు ఏమైనా తెలిస్తే దయచేసి మాకు కూడా తెలియ చేయండి.
వీలైనంత వరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. P. మేడిస్ ను నివారించడానికి ఎటువంటి రసాయనిక చికిత్స అందుబాటులో లేదు. ఈ తెగులు చెదురు మదురుగా రావడం వలన మరియు దిగుబడికి పెద్దగా నష్టం కలిగించకపోవడం వలన దీనికి అంతగా ప్రాధాన్యత లేదు.
సైడోడెర్మా మేడిస్ అనే ఫంగస్ వలన ఈ లక్షణాలు కలుగుతాయి. అనుకూల వాతావరణ పరిస్థితులలో ఈ ఫంగస్ పంట అవశేషాలు లేదా మట్టిలో 7 సంవత్సరాలవరకు జీవించి వుంటుంది. సాధారణంగా ఈ తెగులు ప్రతి సంవత్సరం మొక్కజొన్న పండించే పొలాలలో లేదా చాలా అధిక మొత్తంలో పంట అవశేషాలు వుండే పొలాలలో కనిపిస్తుంది. ఉదాహరణకు పొలాన్ని తక్కువగా దున్నే పద్దతులను అవలంభించే ప్రాంతాలలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. పొలంలో నీరు పెట్టినప్పుడు లేదా వర్షం పడినప్పుడు మొక్కజొన్న సుడులలో నీరు నిలువ ఉండిపోతుంది. దీని వలన ఈ తెగులు సాధారణంగా మొక్క సుడులలో ప్రారంభమౌతుంది. తరువాత గాలి మరియు నీటి తుంపరల వలన ఇది ఇతర మొక్కలకు వ్యాపిస్తుంది. అందువల్లనే ఈ తెగులు లక్షణాలు ముందుగా మొదలు ఆకుల కాడ భాగంలో కనిపిస్తాయి. ఈ తెగులు విస్తరించడానికి సరైన కాంతి మరియు ఉష్ణోగ్రత అవసరం ఉంటుంది. మొత్తంమీద చెప్పాలి అంటే ఈ తెగులు తీవ్రత అంత అధికంగా ఉండదు. దిగుబడిలో కూడా పెద్దగా నష్టం వాటిల్లదు.