గుమ్మడికాయ

దోస జాతి పంటలో జిగట కాండం ఎండు తెగులు (గమ్మీ స్టెమ్ బ్లిట్ అఫ్ క్యూకర్బిట్స్ )

Stagonosporopsis cucurbitacearum

శీలీంధ్రం

క్లుప్తంగా

  • గుండ్రని, లేత గోధుమ రంగునుండి ముదురు గోధుమ రంగు మచ్చలు ఆకులు, కాండంపైన గోధుమ రంగు కేన్కర్లు వేగంగా విస్తరిస్తాయి.
  • కాండం పైన గోధుమ రంగులో జిగురును స్రవించే కేన్కర్లు ఏర్పడతాయి.
  • జిగురు వంటి పదార్ధాని స్రవించే చిన్న చిన్న, నీటిలో నానినట్లున్న చుక్కలు పండ్లపైన ఏర్పడతాయి.

లో కూడా చూడవచ్చు

5 పంటలు
కాకరకాయ
దోసకాయ
పుచ్చకాయ
గుమ్మడికాయ
మరిన్ని

గుమ్మడికాయ

లక్షణాలు

మొలకలపైన గుండ్రని, నీటిలో నానినట్టు వున్న నల్లని లేదా గోధుమ రంగు మచ్చలు విత్తనాల ఆకులు మరియు కాండంపైన ఏర్పడతాయి. పెద్ద మొక్కలలో ఒక క్రమపద్ధతిలో లేని గుండ్రని లేత గోధుమ రంగు నుండి ముదురు గోధుమ రంగు మచ్చలు ఆకుపైన ఏర్పడతాయి. సాధారణంగా ఇవి ఆకుల అంచులపైన ముందుగా ఏర్పడతాయి. మొత్తం ఆకు ఎండిపోయేవరకు ఈ మచ్చలు చాలా వేగంగా పెరుగుతాయి. నాళాల కణజాలంలో కేన్కర్లు వృద్ధిచెందుతాయి. ఒక గోధుమ రంగు జిగురు వంటి పదార్ధం ఉత్పత్తి అవుతుంది. ఈ మచ్చలపైన తరుచుగా నల్లని చుక్కలు కనపడతాయి. కాండం చుట్టూ ఇవి పట్టీ లాగా ఏర్పడి మొలకలు మరియు లేత మొక్కలు చనిపోవచ్చు.పెద్ద మొక్కలలో ఈ తెగులు సంక్రమిస్తే, కాండం పైన వుబ్బివున్న కణజాలం మధ్యనుండి ఈ మచ్చలు మెల్లగా వృద్ధి చెందుతాయి. మధ్య సీజన్ దాటిన తర్వాత కాండం ఎండిపోయి పగుళ్ళు ఏర్పడతాయి. తెగులు సోకిన పండ్లపైన చిన్న చిన్న నీటిలో నానినట్టువున్న మచ్చలు ఏర్పడి హద్దులు లేకుండా విస్తరించి జిగురు వంటి పదార్ధాన్ని స్రవిస్తాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

సేంద్రియ పద్దతిలో పండించే పంటల్లో రెనౌట్రియా సఛాలినెన్సిస్ ను ఉపయోగించవచ్చు. బాసిల్లస్ సుబ్టిలిస్ స్ట్రైన్ QST 713 కూడా ఈ తెగులును నియంత్రించడంలో మంచి ప్రభావంతమైనది అని నిరూపించబడింది.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. క్లోరోతలోనిల్, మాంకోజెబ్ల్, మానేబ్, థియోఫనేట్ - మిథైల్ మరియు టేబుకోనజోల్ ఈ తెగులును ప్రభావవంతంగా నియంత్రిస్తాయి.

దీనికి కారణమేమిటి?

స్టాగోనోస్పోరోప్సిస్ కుకుబిటసేయరుమ్ అనే ఫంగస్ వలన ఈ లక్షణాలు కలుగుతాయి. ఈ తెగులు ఈ జాతిలో అనేక రకాల పంటలకు సంక్రమిస్తుంది. విత్తనాలద్వారా ఒక మొక్కనుండి ఇంకొక మొక్కకు ఈ ఫంగస్ సంక్రమిస్తుంది. వీటికి అతిధేయ మొక్కలు అందుబాటులో లేకపోతే ఒక సంవత్సరం వరకు లేదా అంతకకన్నా ఎక్కువ సమయం తెగులు సంక్రమించిన పంట అవశేషాలపై జీవిస్తుంది. వసంత ఋతువులో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా వున్నప్పుడు బీజాంశాలు ఉత్పత్తి అవుతాయి. ప్రధానంగా వీటివలన ఈ ఫంగస్ సంక్రమిస్తుంది. తేమ, 85 % కన్నా అధికంగా వున్న సాపేక్ష ఆర్ద్రత వర్షం మరియు 1 నుండి 10 గంటల వరకు ఆకులపై తేమవుండడం ఈ ఫంగస్ త్వరితంగా వ్యాప్తి చెందడానికి మరియు లక్షణాలు ఏర్పడడానికి అనుకూలంగా ఉంటాయి. వీటికి అనుకూలమైన ఉష్ణోగ్రత జాతుల పైన ఆధారపడి వుంటుంది. పుచ్చ పంట మరియు దోసకాయలో 24°C మరియు కర్బూజ పంటలో 18°C వీటికి అనుకూలమైన ఉష్ణోగ్రతగా ఉంటుంది. ఈ బీజాంశాలు పాత్ర రంధ్రాలు మరియు గాయాల అవసరం లేకుండా పైపొర ద్వారా నేరుగా లోపలకు ప్రవేశిస్తాయి. చారల దోసకాయ పెంకు పురుగులు, గాయాలు, మరియు తామర పురుగులు తినడంతో పాటు బూజు తెగులు వలన ఈ తెగులు త్వరితంగా వ్యాపిస్తుంది.


నివారణా చర్యలు

  • ధ్రువీకరించిన డీలర్లనుండి విత్తనాలను లేదా తెగులు లేని మొక్కలను కొనుగోలు చేయండి.
  • ద్వితీయ సంక్రమణ జరగకుండా ఉండడానికి పౌడరీ మైల్డ్యూ నిరోధక రకాలను వాడండి.
  • తెగులు లక్షణాలకు పొలాన్ని క్రమం తప్పకుండ గమనిస్తూ వుండండి.
  • రెండు సంవత్సరాలకు ఒకసారి పంట మార్పిడి చేయండి.
  • పంట వేయడానికి ముందే వైల్డ్ సిట్రన్, బల్సమ్ పియర్ లేదా వాటికవే వచ్చే కుకుర్బిట్స్ మొక్కలను పొలంలో నుండి తొలగించండి.
  • పంట కోతలు ముగిసిన వెంటనే పొలాన్ని బాగా దున్ని పంట అవశేషాలను పూడ్చిపెట్టండి.
  • కోస్తునప్పుడు పండ్లు గాయపడకుండా జాగ్రత్తలు తీసుకోండి.
  • నల్ల కుళ్ళు తెగులును నివారించడానికి 7–10°C ఉష్ణోగ్రత వద్ద పండ్లను నిల్వ చేయండి.
  • మొక్కలలో తేమను బాగా తగ్గించాలి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి