Alternaria cucumerina
శీలీంధ్రం
ఈ లక్షణాలు ముందుగా మొక్కల మధ్య మరియు పైభాగంలో వున్న ముదురు ఆకుల పైన కనిపిస్తాయి. మధ్యలో తెల్లని రంగుతో చిన్న చిన్న గుండ్రని గోధుమరంగు మచ్చలు ఆకులపైన ఏర్పడతాయి. తరువాత ఇవి లేత గోధుమ రంగు లోకి మారి విస్తరిస్తూ కేంద్రీకృతమైన వలయాలను కనపరుస్తాయి. ఇవి కొద్దిగా లోపలకు నొక్కినట్టుగా ఉంటాయి. ఈ మచ్చలు వున్న ప్రాంతంలో చిన్న ఆకుల ఈనెలు ముదురు రంగులోకి మారి ఒక జాలి లాగా కనపడతాయి. ఆకుల పైన మాత్రమే కనపడే కేంద్రీకృతమైన వలయాలు మెల్లగా ఏర్పడతాయి. ఇవి చూడడానికి టార్గెట్ వలే కనపడతాయి. ఈ గుండ్రని మచ్చలు మొత్తం ఆకును ప్రభావితం చేసి ఆకులు రాలిపోయేటట్టు చేస్తుంది. ఈ తెగులు సంక్రమించిన పండ్లపైన కొద్దిగా నొక్కినట్టు వున్న గుండ్రని గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. కొన్ని రోజులకు ఇవి ఆలివ్ నుండి నల్లటి పొడి వంటి చాప లాగా మారిపోతాయి. పండ్లు కోస్తున్నప్పుడు ఈ పండ్లపైన తెగులును గుర్తించనట్లైతే నిలువ చేసేటప్పుడు మరియు రవాణా చేసేటప్పుడు నష్టం కలుగుతుంది. మొక్కల ఇతర భాగాలు ప్రత్యక్షంగా ప్రభావితం చెందవు.
మొక్కలు నాటిన వెంటనే గడ్డిని నేల పైన పరచడం వలన A. కుకుమెరీనా బీజాంశాలు మట్టిలో నుండి క్రిందకు వున్న ఆకులపైకి చేరకుండా అడ్డుకోవచ్చు.
వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. అజోక్సిస్ట్రోబిన్, బాష్కలిడ్, క్లోరోతలోనిల్, కాపర్ హైడ్రాక్సైడ్, మాంకోజెబ్, మనేబ్ లేదా పొటాషియం బైకార్బొనేట్ వంటి శీలింద్ర నాశినులు ఈ తెగులును నియంత్రించగలవు. క్లోరోతలోనిల్ కలిగిన ఉత్పత్తులు మంచి ప్రభావాన్ని చూపిస్తాయి. వాడవలసిన సమయం మరియు తరచుదనం బట్టి పదార్ధాలు మారుతూ ఉంటాయి. కొనడానికి ముందు డబ్బా పైన వున్న వాడకం వివరాలను చదవడం మర్చిపోవద్దు.
పుచ్చ మరియు పుచ్చ జాతికి చెందిన మొక్కలలో ఈ తెగులు మట్టిలో వుండే ఫంగస్ అయిన ఆల్ట్రనేరియా కుకుమెరినా వలన సంక్రమిస్తుంది. ఇది మట్టిలో వుండే పంట అవశేషాలలో లేదా కలుపు మొక్కలపైన మరియు ఇతర దోస జాతి మొక్కలపైన జీవిస్తుంది. వర్షపు తుంపర వలన, అధికంగా నీరు పెట్టడం వర్షపు తుంపర్లు, గాలి, పరికరాలు మరియు పొలంలో పని చేసే వారి వలన ఈ తెగులు ఇతర ప్రాంతాలకు విస్తరిస్తుంది. వెచ్చని వాతావరణం మరియు మంచు వలన ఏర్పడే తేమ, వర్షం లేదా పైనుండి నీరు పెట్టడం ఈ తెగులుకు అనుకూలమైన పరిస్థితులు. ఆకులపైన 2 నుండి 8 గంటల పాటు తడి వున్నట్లైతే ఈ తెగులు యొక్క తీవ్రత స్థాయి పెరుగుతుంది. అధిక వర్షపాతం కన్నా తరుచుగా పడే వర్షం మరియుఅధిక సమయం నీటి బిందువులు ఆకుల మీద ఉండడం ఈ తెగులు వృద్ధికి అధికంగా దోహదపడుతుంది