గుమ్మడికాయ

దోస జాతి మొక్కల్లో పక్షి కన్ను తెగులు

Glomerella lagenarium

శీలీంధ్రం

క్లుప్తంగా

  • ఆకులపై నీటితో తడిచినట్టు వున్న పసుపు రంగు గుండ్రటి మచ్చలు.
  • పండ్లపై గుండ్రని నల్లని గుంతలు లాంటి కేన్కర్స్.

లో కూడా చూడవచ్చు

4 పంటలు
దోసకాయ
పుచ్చకాయ
గుమ్మడికాయ
కీర దోస

గుమ్మడికాయ

లక్షణాలు

ఆకుపైన నీటిలో నానినట్టు వున్న మచ్చలు ఏర్పడడంతో ఈ తెగులు లక్షణాలు మొదలవుతాయి. తరువాత ఇవి పసుపురంగు గుండ్రని చుక్కలుగా మారతాయి. అవి ఒక క్రమపద్ధతిలో లేకుండా ఉండి పెరిగే కొలది ముదురు గోధమ రంగు లేదా నల్లని రంగులోకి మారతాయి. కాండం పైన మచ్చలు కూడా ప్రస్పుటంగా కనపడతాయి. ఇవి ఎదుగుతునప్పుడు నాళాల కణజాలాన్ని గట్టిగా చుట్టు ముట్టి కాండం మరియు తీగెలు ఎండిపోయేటట్టు చేస్తాయి. పండ్లపైన పెద్ద పరిమాణంలో గుండ్రని, నల్లని మరియు నొక్కినట్టు వున్న మచ్చలు ఏర్పడతాయి కొన్నాళ్లకు ఇవి గజ్జి లాగా మారతాయి. పుచ్చ మొక్కలలో ఈ మచ్చలు 6 నుండి 13 మిల్లీమీటర్ల వరకు ఉండి 6 మిల్లీమీటర్ల లోతు ఉంటాయి. ఉంటాయి. తేమ వున్నప్పుడు ఈ మచ్చల మధ్యలో వున్న నల్లని ప్రాంతం జిలటనస్ సాల్మన్ రంగులో వున్న బీజాంశాలతో కప్పబడిపోతుంది. ఇదే తరహా మచ్చలు కర్బూజ మరియు దోసకాయ మొక్కలలో కూడా ఏర్పడతాయి. ఈ గులాబీ రంగులో వుండే కేన్కర్లు ఈ తెగులు యొక్క ప్రత్యేకమైన లక్షణాలు అని చెప్పవచ్చు.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

సేంద్రియ పరంగా ఆమోదించిన కాపర్ ఫార్ములేషన్లను కుకుర్బిట్స్ పై వాడవచ్చు. ఇంతకు ముందు ఇవి మంచి ఫలితాలను ఇచ్చాయి. బాసిల్లస్ సుబ్తిలిస్ కలిగిన జీవన నియంత్రణ ఏజంట్లు కూడా లభిస్తున్నాయి.

రసాయన నియంత్రణ

వీలైనంత వరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవసంబంధమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఆమోదించిన శీలింద్ర నాశినులను, ముఖ్యంగా వర్షం పడినప్పుడు, సరైన విరామంతో వాడండి. క్లోరోతలోనిల్, మానేబ్ మరియు మాంకోజెన్ ఫార్ములేషన్లు అందుబాటులో వున్నాయి. క్లోరోతలోనిల్ మరియు మాంకోజెబ్ కలిపి పిచికారీ చేసినట్లయితే ఇది మంచి ప్రభావాన్ని చూపిస్తుంది.

దీనికి కారణమేమిటి?

గ్లోమెరేళ్ళ లాగేనరియుమ్ అని పిలవబడే ఫంగస్ వలన ఆకులు మరియు పండ్లపైన ఈ లక్షణాలు ఏర్పడతాయి. ముందు పంట అవశేషాలలో ఈ ఫంగస్ జీవిస్తుంది. లేదా కుకుర్బిట్స్ విత్తనాల ద్వారా సంక్రమిస్తుంది. వసంత ఋతువులో వాతావరణం తేమగా వున్నప్పుడు ఈ ఫంగస్ గాలిలోకి బీజాంశాలను విడుదల చేస్తుంది. ఇవి నేలకు దగ్గరగా వున్న తీగలు మరియు ఆకులకు వ్యాధిని వ్యాపిస్తాయి. ఈ ఫంగస్ యొక్క జీవిత చక్రం పరిసర తేమ, ఆకుల పైన తడి మరియు అధిక ఉష్ణోగ్రతలు( 24°C దీనికి అత్యంత అనుకూలం) పైన ఆధారపడివుంటుంది. 4.4°C కన్నా తక్కువ ఉష్ణోగ్రత మరియు 30°C కన్నా అధిక ఉష్ణోగ్రతల వద్ద లేదా వీటికి తేమ లభించకపోతే ఇవి మొలకెత్తవు. దీనికి అదనంగా ఈ తెగులు కారక ఫంగస్ బీజాంశాలు వాటి జిగురు వంటి పైపూతనుండి విడుదల కావడానికి నీరు అవసరం ఉంటుంది. ఈ కారణాలను బట్టి పక్షి కన్ను తెగులు సీజన్ మధ్యలోనే, మొక్క పైభాగం వృద్ధి చెందిన తర్వాత ఎందుకు స్థిరపడుతుందో అర్ధమౌతుంది.


నివారణా చర్యలు

  • ధ్రువీకరించబడిన తెగులు లేని తెగులు నిరోధక రకాలను వాడండి.
  • మీ ప్రాంతంలో వ్యాధి నిరోధక రకాలు లభిస్తున్నట్లైతే వాటిని ఎంచుకోండి.
  • దోస జాతికి సంబంధం లేని మొక్కలతో మూడు సంవత్సరాల పాటు పంట మార్పిడి చేయండి.
  • సీజన్ చివర్లో పండ్లు మరియు తీగెల క్రింద దున్ని మంచి పారిశుధ్య సౌకర్యం ఏర్పాటు చేసుకోండి.
  • ఆకులు తడిగా వున్నప్పుడు యంత్రాలు మరియు పనివాళ్ళు ఒక పొలంలోనుండి ఇంకొక పొలంలోకి వెళ్లకుండా చూడండి.
  • పైనుండి నీరు పెట్టడం అవసరమైతే ఉదయం సమయాలలో పెట్టి సాయంత్రం మంచు కురవడానికి ముందు ఆకులు ఆరిపోయేటట్టు చూడండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి