సోయాబీన్

సోయాబీన్ లో బూడిద తెగులు

Erysiphe diffusa

శీలీంధ్రం

క్లుప్తంగా

  • ముందుగా ఆకు పైభాగాన తెల్లటి పొడి లాంటి బూజు ఏర్పడుతుంది.
  • తరవాత ఆకు పైభాగానికి మరియు కింది భాగానికి విస్తరిస్తుంది.
  • ఇది కాయలకు మరియు కాడలకు కూడా విస్తరించే అవకాశం వుంది.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

సోయాబీన్

లక్షణాలు

బూడిద తెగులు సోయాబీన్ ఆకు పైభాగాన, మొదట ఒక చిన్న తెల్లటి వృత్తాకారంలో బూడిద లాంటి పెరుగుదల కనబడుతుంది. ఆకుల మీద తెగులు సోకిన భాగాలు ఆకు పైభాగాన మరియు క్రింది భాగాన వుండే పెద్ద అతుకుల వంటి మచ్చలను కప్పుతూ విస్తరిస్తాయి. కాయలు మరియు కాండాల మీద కూడా పచ్చటి బూడిద పెరుగుదలను గమనించవచ్చు. ఈ తెగులు తీవ్రత అధికంగా వున్నప్పుడు సోయాబీన్ మొక్క యొక్క అన్ని భాగాలపై తెలుపు నుండి బూడిద రంగు పొడి లాంటి బూజు ఏర్పడుతుంది. కొన్ని సోయాబీన్ రకాలలో ఆకులు పాలిపోయి లేదా పసుపు రంగులోకి మారడం మరియు ఆకుల క్రింది భాగంలో తుప్పు పట్టిన మచ్చల వంటి భాగాలు కనబడవచ్చు. తెగులు అధికంగా సోకిన మొక్కలల్లో ఆకులు ముందుగానే రాలిపోతాయి. కాయల్లో ముడుచుకుపోయిన, సరిగ్గా ఎదగనటువంటి సరైన ఆకారం లేనటువంటి మరియు చదునుగా వుండే ఆకుపచ్చ గింజలు ఏర్పడుతాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

చిన్న కమతాలలో వేసే పంటపై పాలు-నీళ్ళు ద్రావణాలు సహజ శిలీంద్ర నాశినిలుగా పనిచేయవచ్చు. ప్రతి రెండు రోజులకు ఓకసారి ఈ ద్రావణాన్ని ఆకులకు పూయండి. వెల్లుల్లి లేదా సోడియం బైకార్బోనేట్ ద్రావణాలు కూడా సంతృప్తికర ఫలితాలను ఇవ్వగలవు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. కొన్ని పంటలలో తడి సల్ఫర్, ట్రైఫ్లుమీజోల్, మైక్లోబ్యూటనిల్ ఆధారిత శీలింద్ర నాశినిలు ఈ శిలీంధ్రం యొక్క పెరుగుదలను నియంత్రించినట్లుగా కనబడింది.

దీనికి కారణమేమిటి?

ఫంగస్ ఎరిసిప్ డిఫ్యూసా కారణంగా ఈ లక్షణాలు ఏర్పడతాయి, దీని బీజాంశాలు గాలి ద్వారా ముఖ్యంగా ఆరోగ్యకరమైన మొక్కల భాగాల మీద వెదచల్లబడతాయి. అవి మొలకెత్తి కణజాలాలలో వ్యాప్తి చెందే కొద్దీ ఈ బీజాంశాలు బీజ గొట్టాలు ఏర్పరుస్తాయి మరియు ఒక లంగరు వంటి నిర్మాణం ద్వారా ఆకు కణాలకు అతుక్కుపోతాయి. చివరకు ఇది ఆహార నిర్మాణాలు మరియు సోయాబీన్ ఆకు బాహ్య చర్మం (తెల్లటి పొర)ను దాటి అభివృద్ధి చెందే పెరుగుదలకు దారితీస్తుంది. వాయు జనిత బీజాంశాలు క్రొత్త ఇన్ఫెక్షన్లను మొదలు పెడుతుంది మరియు సోయాబీన్ మొక్కలు పరిపక్వత చెందే వరకు తెగులు చక్రాన్ని పునరావృతం చేస్తుంది. 30°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలలో ఈ తెగులు అభివృద్ధి నిలిచి పోతుంది. చల్లని ఉష్ణోగ్రత ఈ తెగులు వృద్ధికి అనుకూలంగా వుంటుంది. వర్షపాతం ఈ తెగులును ప్రభావితం చేయలేదు. సోయాబీన్ మొక్కల ఏ పెరుగుదల దశలో అయినా తెగులు సోకే అవకాశం ఉన్నప్పటికీ, మధ్య నుండి చివరి సీజన్ లో వుండే పునరుత్పత్తి దశలకు ముందు లక్షణాలు కనబడడం అరుదుగా జరుగుతుంది..


నివారణా చర్యలు

  • మంచి గాలి వెలుతురు సోకేవిధంగా సరైన ఎడంతో మొక్కలను నాటండి.
  • తెగులు తట్టుకునే మొక్కల రకాలను ఎంచుకోండి.
  • తెగులు లక్షణాల కోసం పొలాన్ని క్రమం తప్పకుండా పర్యవేక్షించండి.
  • మచ్చలు కనపడిన వెంటనే తెగులు సోకిన ఆకులను తీసివేయండి.
  • తెగులు సోకిన మొక్కలను తాకిన తరవాత ఆరోగ్యకరమైన మొక్కలను తాకవద్దు.
  • కోత కోసిన తరవాత మరియు పంట నాటడానికి ముందు దున్నడం వలన పంట వ్యర్థాలను మరియు తెగులును కలిగించే కారకాలను నాశనం చేయడంలో సహాయపడగలదు.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి