Passalora manihotis
శీలీంధ్రం
లక్షణాలు మొక్క రకం మరియు పర్యావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. సాధారణంగా, ముదురు ఆకులపై ఎక్కువగా మరియు లేత ఆకులపై తక్కువగా నష్టం జరుగుతుంది. నొక్కినట్టు వున్న, తెల్లని, కోణాకారపు లేదా వృత్తాకార మచ్చలు ఆకుల పైభాగంలో వృద్ధి చెందుతాయి, వీటి చుట్టూ తరచుగా సక్రమంగా లేని ర్రటి గీత మరియు పెద్ద పసుపురంగు వలయం ఏర్పడుతుంది. ఈ మచ్చలు ఆకు లామినా యొక్క దిగువ భాగంలో విస్తరించిన రంగుల అంచుతో కనిపిస్తాయి. ఫంగస్ వృద్ధి చెందుతున్నప్పుడు మరియు లక్షణాలు పురోగమించే కొద్దీ, ఈ మచ్చలు బూడిదరంగు, వెల్వెట్ రంగులోకి మారతాయి. ముఖ్యంగా తేమతో కూడిన వాతావరణంలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. సాధారణంగా ఈ వ్యాధి తేమతో కూడిన కానీ చల్లగా ఉండే పెండలం పెండలం పెరిగే ప్రాంతాలలో కనిపిస్తుంది. వెచ్చని, తేమతో కూడిన వాతావరణం ఫంగస్ యొక్క జీవిత చక్రానికి అనుకూలంగా ఉంటుంది మరియు వ్యాధి యొక్క తీవ్రతను పెంచుతుంది. సాధారణంగా లేత ఆకుల కంటే ముదురు ఆకులు ఈ వ్యాధికి అధికంగా గురవుతాయి.
ఫంగస్ వ్యాప్తిని నియంత్రించడానికి జీవ నియంత్రణ చర్యలు అందుబాటులో లేవు. ఈ తెగులును నివారించడానికి తెగులు లేని మొక్కలు నాటడం మరియు తగిన నివారణా చర్యలను ఉపయోగించడం చాలా అవసరం.
అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లప్పుడూ జీవపరమైన మరియు నివారణా చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. పెండలం పంట తెల్ల ఆకుమచ్చను నెలవారీ వ్యవధిలో థియోఫనేట్ (0.20%), క్లోర్తలోనిల్ కలిగి ఉన్న శిలీంధ్ర సంహారిణి పిచికారీలతో సమర్థవంతంగా నియంత్రించవచ్చు. రాగి ఆధారిత శిలీంధ్ర నాశినులైన మెటలాక్సిల్ మరియు మాంకోజెబ్ కూడా సిఫార్సు చేయబడ్డాయి. పొలంలో కలుపు మొక్కల పెరుగుదలను నియంత్రించడానికి కలుపు నాశినులను కూడా ఉపయోగించవచ్చు.
ఫేయోరాములేరియా మానిహోటిస్ అనే ఫంగస్ వలన ఈ లక్షణాలు సంభవిస్తాయి, పొడి సీజన్లో ఇవి తెగులు సోకిన మొక్క పైన ముదురు ఆకులపై లేదా నేలపైన రాలిన ఆకులపై జీవించి ఉంటాయి. అనుకూలమైన పరిస్థితులలో, ఇది ఆకుల క్రింది భాగంలో నిర్జీవ ప్యాచీల క్రింద బీజాంశాలను ఉత్పత్తి చేస్తుంది. అక్కడ నుండి, ఈ బీజాంశం గాలి లేదా వర్షపు తుంపర్ల ద్వారా కొత్త మొక్కలకు వ్యాపిస్తుంది. ఆకులపై సహజ రంధ్రాల ద్వారా ఆరోగ్యకరమైన కణజాలాలలోకి ఈ తెగులు చొచ్చుకుపోవడం సంభవిస్తుంది మరియు మొక్కను ఫంగస్ నెమ్మదిగా ఆక్రమించే కొద్దీ, ఈ తెగులు లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి. తెగులు సోకిన మొక్కలు ఇతర పొలాలకు రవాణా చేయబడినప్పుడు ఈ తెగులు సుదూర ప్రాంతాలకు విస్తరిస్తుంది. కొన్ని కలుపు మొక్కలు కూడా ప్రత్యామ్నాయ అతిథేయ మొక్కలుగా పనిచేస్తాయి. సాధారణంగా ఇది పెండలం మొక్కలకు హానికరం కాదు మరియు తెగులు తీవ్రత తక్కువగా ఉంటే ఇది దిగుబడిని గణనీయంగా ప్రభావితం చేయదు. అయినప్పటికీ, చల్లని మరియు తేమతో కూడిన, వర్షపు వాతావరణం ఫంగస్ యొక్క జీవిత చక్రానికి అనుకూలంగా ఉంటుంది మరియు వ్యాధి యొక్క తీవ్రతను పెంచుతుంది