లెట్టూస్

లెట్టూస్ లో బొట్రిటిస్ ఎండు తెగులు

Botrytis cinerea

శీలీంధ్రం

క్లుప్తంగా

  • బూడిద రంగు బూజును పైభాగంలో మరియు ఆకుల మొదళ్లవద్ద గమనించవచ్చు, దీనివలన అవి మసకగా కనిపిస్తాయి.
  • మొక్క మొత్తం ఎండిపోయి గోధుమ రంగులోకి మారి చనిపోవచ్చు (డాంపింగ్-ఆఫ్).

లో కూడా చూడవచ్చు

1 పంటలు
లెట్టూస్

లెట్టూస్

లక్షణాలు

అన్ని రకాల లెట్టూస్ ను ఇది ప్రభావితం చేయవచ్చు. పైభాగం లేదా ఆకుల మొదళ్లవద్ద నుండి మొదలుకొని మొక్కలపై అచ్చు యొక్క పెరుగుదల చాలా తీక్షణమైన లక్షణం. ప్రారంభంలో, మట్టికి అంటుకుని వున్న మొక్కల భాగాలు లేదా గాయపడిన మొక్కల భాగాలపై చిన్న, టాన్ లేదా గోధుమరంగు మరియు నీటిలో నానినట్టు వున్న మచ్చలు కనిపిస్తాయి. తరువాత, ఈ కణజాలాలపై మసకగా, బూడిద నుండి గోధుమరంగు బూజు వృద్ధి చెందుతుంది. లెట్టూస్ వంటి ఉద్యాన పంటల రకాల్లో బేసల్ లీఫ్ మరియు మరియు కాండం కుళ్ళు మొత్తం పంట వైఫల్యానికి కారణమవుతాయి. ప్రత్యామ్నాయంగా, నిల్వ సమయంలో కనిపించే లక్షణాలు కూడా అధిక మొత్తంలో నష్టాలను కలిగిస్తాయి. తెగులు కలిగివున్న విత్తనాలను నాటితే, నాటిన మొలకల డాంపింగ్ ఆఫ్ ను గమనించవచ్చు.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

లెట్టూస్ పై బూడిద బూజుకు వ్యతిరేకంగా పోటీ శిలీంధ్రాలు ట్రైకోడెర్మా అట్రోవిరిడే, కోనియోథైరియం మినిటాన్స్ మరియు ఎపికోకామ్ పర్పురాస్సెన్లను కలిగి ఉన్న బయో శిలీంధ్ర నాశినులు సమర్థవంతంగా పరీక్షించబడ్డాయి. స్ట్రెప్టోమైసెస్ గ్రిసోవిరిడేస్ ఆధారిత ఉత్పత్తులు కూడా ఈ పంటపై వాడడానికి అందుబాటులో ఉన్నాయి. బొట్రిటిస్ సినెర్రియా వలన కలిగే నష్టాన్ని తగ్గించడానికి సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ అనే బ్యాక్టీరియాను కూడా ఉపయోగిస్తున్నారు.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లప్పుడూ జీవపరమైన మరియు నివారణా చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. పంటకోత సమయానికి ఈ ఫంగస్ మొక్కలను ఆవాసంగా చేసుకుంటుంది. ఆ సమయంలో పురుగు మందులను వాడడం వలన విషపూరిత అవశేషాలు పంటపైన ఉండిపోతాయి. అందువలన నియంత్రణ సాధించడం కష్టం. ముందుగా సంక్రమించే అంటువ్యాధుల వ్యాప్తిని నియంత్రించడానికి క్లోరోతలోనిల్‌తో కూడిన మందులను ఆకులపై పిచికారీగా వాడవచ్చు. ఫ్లూజినామ్, మరియు థియోఫాంటే-మిథైల్ ఆధారిత ఇతర శిలీంధ్ర నాశినులు కూడా పనిచేస్తాయి. శిలీంధ్ర నాశినులను అధికంగా ఉపయోగించినప్పుడు ఈ మందులకు నిరోధకత వృద్ధి చెందడం సాధారణం.

దీనికి కారణమేమిటి?

మట్టిలో వుండే బొట్రిటిస్ సినెరియా వలన ఈ లక్షణాలు సంభవిస్తాయి, ఇవి మొక్కల అవశేషాలు , సేంద్రియ పదార్థాలు మరియు లెట్టూస్ విత్తనాలపై కూడా పెరుగుతాయి మరియు జీవించగలవు. తేమ వాతావరణం, తరచుగా వర్షపాతం మరియు చల్లని ఉష్ణోగ్రతలతో లెట్టూస్ పైభాగం మరియు మట్టికి అంటిన ఆకులపై ఫంగస్ పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. ఒకదానిపై మరొకటి కప్పబడిన ఆకుల వలన ఈ మొక్కల భాగాలు సూర్యుడి నుండి కప్పబడతాయి మరియు అందువలన ఇవి ముఖ్యంగా ప్రభావితమవుతాయి. ఫంగస్ వృద్ధి చెందడానికి మరియు మొక్కలపై వలసలు ఏర్పరచుకోవడానికి సరైన ఉష్ణోగ్రత పరిధి 15°C నుండి 20°C వరకు ఉంటుంది. పొలంలో పనిచేస్తున్నప్పుడు యాంత్రికంగా గాయపడిన లేదా వడగళ్ళు లేదా మంచు వలన గాయపడిన మొక్కల్లో ఈ లక్షణాలు ముందుగా కనిపిస్తాయి. ఈ విషయంలో, నాటే ప్రక్రియలో సంభవించే స్వల్ప గాయాల వలన నాటిన మొలకలకు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. నీరు అధికంగా పెట్టడం మరియు దట్టమైన పందిరి అనేవి ఫంగల్ పెరుగుదలకు అనుకూలమైన తేమ, దట్టమైన వాతావరణాన్ని అందించడం ద్వారా తెగులు స్థాయిని పెంచుతాయి.


నివారణా చర్యలు

  • ధృవీకరించబడిన మూలాల నుండి ఆరోగ్యకరమైన మొక్కలను ఉపయోగించండి.
  • నిరోధక లేదా తెగుళ్లు తట్టుకునే రకాలను నాటండి.
  • ప్రతికూల వాతావరణ పరిస్థితులను నివారించడానికి ముందుగా నాటండి లేదా త్వరగా పక్వానికి వచ్చే రకాలను నాటండి.
  • మొక్కల మధ్య సహేతుకమైన దూరం ఉంచండి.
  • వెలుతురు మరియు సూర్యరశ్మిని పెంచడానికి తగిన వరుసలో నాటండి.
  • పొలంలో మంచి మురుగు నీటి సౌకర్యం ఏర్పాటు చేసుకోండి మరియు అవసరం లేకుండా నీరు పెట్టవద్దు.
  • అధిక మోతాదులో ఎరువులను వేయకండి.
  • నాట్లు వేసేటప్పుడు మొక్కలను గాయపరచకుండా బాగా జాగ్రత్తలు తీసుకోండి.
  • తరుచుగా పొలాన్ని గమనిస్తూ కుళ్లిపోతున్న మొక్కలను తొలగించండి.
  • ఫంగస్ యొక్క జీవిత చక్రాన్ని బలహీనపరచడానికి మరియు ఐనోక్యులమ్ ను తగ్గించడానికి మట్టిపై రక్షక కవచాన్ని ఉపయోగించండి.
  • గ్రీన్ హౌస్ లో, ఫంగస్ కు అననుకూల పరిస్థితులను సృష్టించడానికి వేడిని మరియు వెంటిలేషన్ ను ఉపయోగించవచ్చు.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి