Cordana musae
శీలీంధ్రం
క్రింది ఆకులలో పసుపు లేదా లేత గోధుమ రంగు, అండాకారంలో లేదా కను గుడ్డు ఆకారంలో మచ్చలు ఆకు యొక్క అంచుల వద్ద కనిపిస్తాయి. కాలక్రమేణా మచ్చల కేంద్ర ప్రాంతంలో మృతకణముల మచ్చలు ఏర్పడుతాయి రానురాను క్రమంగా మచ్చలు సృష్టంగా కనబడడం మొదలుపెడతాయి. ఆకు పెరుగుతున్నప్పుడు ఈ మచ్చల దీర్ఘచతురస్రాకారంలో ఈనెల వెంట పెరుగుతాయి. అనేక మచ్చలు పసుపు కణజాలంతో కూడిన పెద్ద నెక్రోటిక్ అతుకులు ఏర్పడటానికి సహకరిస్తాయి. ఆకు అంచుల వద్ద ఇన్ఫెక్షన్ సోకితే, చిన్న కేంద్రీకృత మచ్చలు అభివృద్ధి అయి అవి కాలక్రమేణా లేత గోధుమ రంగు మృతకణముల యొక్క పొడవాటి గీతలుగా మారుతాయి. కొని సార్లు ఆ గీతల మధ్య ఈనె వరకు పాకుతాయి. ఈ తెగులు బారిన పడ్డ ఆకుల యొక్క తెగులు సోకిన భాగాల చుట్టూ ఒక మెరుపు లాంటి వృత్తం స్పష్టంగా కనబడుతుంది.
ఈ తెగులుకు పూర్తి జీవసంబంధ పరిష్కారాలు లేవు. అందువలన, అరటి తోటను జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. తెగులు తీవ్రమైన సందర్భాల్లో, సేంద్రీయ రాగి ఫార్ములాలు ఉదాహరణకు 1% బోర్డియక్స్ మిశ్రమం, తెగులు సోకిన ప్రాంతాల్లో పిచికారీ చేయండి.
వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. అరటిలో అనేక ఆకు మచ్చ చీడలు ఉన్నందున, మీరు కొర్డానా లీఫ్ స్పాట్ తో వ్యవహరిస్తున్నారని నిర్ధారించుకోండి అంతేకాని ఫ్రీక్లి లీఫ్ స్పాట్ లేదా సిగాటోకా లీఫ్ స్పాట్ తో కాదు అని తెలుసుకోండి. ఈ తెగులు తీవ్రమైన సందర్భాల్లో 0.4% మాంకోజెబ్ లేదా ఆయిల్ ఆధారిత కాపర్ ఆక్సీ క్లోరైడ్ 0.2-0.4% ను వాడండి. క్లోరోథలోనిల్ లేదా మాంకోజెబ్ మరియు ఒక దైహిక శిలీంద్ర సంహారిణి వంటి ఫంగైసైడ్స్ వాడండి, ఉదా. టేబుకోనజోల్ లేదా ప్రోపికోనోజోల్ సిఫారసు చేయబడ్డాయి. పిచికారీలు చేయునపుడు పై ఆకుల మీద రసాయనాలు పడేటట్టు చేయండి.
లక్షణాలు ఫంగస్ కోర్డానా మ్యుసే వలన సంభవిస్తాయి. అంతేకాక కోర్డాన లీఫ్ స్పాట్ అని కూడా పిలుస్తారు, ఇది దాదాపు అరటి సాగుచేయు అన్ని ప్రాంతాల్లో వ్యాపించేటువంటి ఫంగల్ వ్యాధులలో ఒక ముఖ్యమైన తెగులు. ఈ సూక్ష్మక్రిమి నీరు మరియు గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది, దీని వ్యాప్తి ముఖ్యంగా దగ్గర దగ్గరగా నాటిన పొలాల్లో వినాశనానికి దారి తీస్తుంది. తరచుగా వర్షాలు పడుతూ వేడి మరియు తేమ పరిస్థితుల్లో ఫంగస్ పెరుగుదల వేగవంతమవుతుంది. సంక్రమణ వలన ఆకుకు కలిగే నష్టం, కిరణజన్య సంయోగక్రియను తగ్గించి దిగుబడి గణనీయంగా తగ్గడానికి కారణమవుతుంది.