Puccinia hordei
శీలీంధ్రం
మొదటి లక్షణాలు శీతాకాలం చివరి నుండి వసంతకాలం వరకు, ఆకుల పైభాగంలో చిన్న, వృత్తాకార, నారింజ-గోధుమ రంగు స్ఫోటములుగా అక్కడక్కడా చెల్లాచెదురుగా కనిపిస్తాయి. ఇవి బార్లీ మొక్కల మధ్య అంటు వ్యాధి ప్రక్రియకు దారితీసే బీజాంశాలను కలిగి ఉంటాయి. అప్పుడప్పుడు ఈ స్ఫోటములు కాండం, ఆకు తొడుగులు మరియు కంకులపై కూడా వృద్ధి చెందుతాయి. పసుపు లేదా ఆకుపచ్చ రంగు వలయం తరచుగా వాటి చుట్టూ ఏర్పడుతుంది. సీజన్ చివర్లో (వసంతకాలం చివర్లో లేదా వేసవి ప్రారంభంలో) చిన్న చిన్న నల్లటి స్ఫోటములు ఆకుల దిగువ భాగంలో క్రమంగా వృద్ధి చెందుతాయి. ఈ కొత్త సంచులు బీజాంశాలను కలిగి ఉంటాయి, ఇవి తర్వాత పంట పిలకలపై లేదా జీవితచక్రాన్ని పునఃప్రారంభించేందుకు ప్రత్యామ్నాయ అతిథేయ మొక్కలపై మనుగడ సాగిస్తాయి. లేత గోధుమరంగు స్ఫోటముల వలే కాకుండా నలుపు రంగు స్ఫోటములను రుద్దినప్పుడు ఇవి వేళ్ళకు అంటుకోవు.
ఇప్పటివరకు బార్లీ యొక్క గోధుమ రంగు తుప్పు తెగులుకు జీవ నియంత్రణ పద్దతులేవీ అందుబాటులో లేదు. మీకు ఏవైనా తెలిస్తే దయచేసి మమ్మల్ని సంప్రదించండి.
అందుబాటులో ఉంటే జీవ చికిత్సలతో పాటు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. సాధారణంగా గోధుమ రంగు తుప్పు తెగులును నియంత్రించడంలో ప్రొథియోకోనజోల్ ఆధారిత రక్షిత శిలీంద్ర నాశినులను సకాలంలో పిచికారీ చేయడం సహాయపడుతుంది. బార్లీలో ఆకు తుప్పు తెగులు నివారణకు అనేక రకాల శిలీంద్ర నాశినులు అందుబాటులో ఉన్నాయి. వీటిని బాగా అణచివేయడం కోసం, ఆకు తుప్పు తెగులు మొదటిసారి గుర్తించిన వెంటనే వీటిని వాడండి. తుప్పు వ్యాధుల వ్యాప్తికి సీజన్ అనుకూలంగా ఉన్నప్పుడు మరిన్నిసార్లు ఈ మందులను వాడవలసివుంటుంది.
బార్లీలో తుప్పు తెగులును కలుగచేసే నాలుగు రకాల శిలీంధ్రాల్లో ఒకటైన పుక్సినియా హార్డీ అనే ఫంగస్ వల్ల లక్షణాలు కనిపిస్తాయి. ఇవి పచ్చని మొక్కలపై మాత్రమే పెరుగుతాయి. పి. హార్డీ విషయానికొస్తే, ఆలస్యంగా మొలిచే పిలకలపై మరియు స్టార్ ఆఫ్ బెత్లెహెం (ఆర్నితోగలుమ్ అంబెల్లటం) మొక్కలపై వంటి ప్రత్యామ్నాయ అతిధేయ మొక్కలపై ఇది వేసవిలో మనుగడ సాగిస్తుంది. వేడి ఉష్ణోగ్రతలు (15° నుండి 22°C) అధిక తేమ మరియు తరచుగా కురిసే వర్షపాతం వ్యాధి వృద్ధికి అనుకూలంగా ఉంటుంది, అయితే పొడి గాలులతో కూడిన రోజులు బీజాంశాల వ్యాప్తికి సహాయపడతాయి. బార్లీలో, ప్రధానంగా సీజన్ చివరిలో, ప్రత్యేకించి అధిక మోతాదులో నత్రజని వాడినట్లయితే గోధుమ రంగు తుప్పు తెగులు దాడి తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా రాత్రులు వెచ్చగా ఉన్నప్పుడు, తర్వాత విత్తిన పంట కంటే ముందుగా నాటిన పంటకు తీవ్రంగా సోకుతాయి. అయినప్పటికీ, పంటలను శిలీంద్ర నాశినులతో చికిత్స చేస్తే బార్లీలో గోధుమరంగు తుప్పు తెగులును సులభంగా నియంత్రించవచ్చు.