Uromyces viciae-fabae
శీలీంధ్రం
ఆకులు, కాండం మరియు కాయలకు ఈ తెగులు సంక్రమించవచ్చు. మొదటి లక్షణాలు ఆకుల ఎగువ ఉపరితలంపై చిన్న, తెల్లటి, కొద్దిగా పైకి ఉబ్బిన మచ్చలుగా కనిపిస్తాయి. ఈ మచ్చలు విస్తరించినప్పుడు పొడి మరియు నారింజ లేదా గోధుమ రంగులోకి మారుతాయి మరియు తరచూ తేలికపాటి వలయంతో ఉంటాయి. ఈ స్ఫోటములు ఆకుల ఎగువ మరియు దిగువ భాగంలో, కాండం మరియు కాయలపై కనిపిస్తాయి. తరువాతి దశలో అప్పటికే వున్న స్ఫోటముల్లో మరొక స్ఫోటం వృద్ధి చెందుతున్నట్లు మధ్యలో ఒక చుక్కతో O ఆకారం ఏర్పడుతుంది. అప్పటి వాతావరణ పరిస్థితులు బట్టి ఈ తుప్పు తెగులు రూపం మరియు తీవ్రత ఆధారపడివుంటుంది. ఉష్ణోగ్రతలు 20ºC కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఇది మొక్కపై వేగంగా వృద్ధి చెందుతుంది మరియు దానిని మొత్తం కప్పేస్తుంది. భారీ ఇన్ఫెక్షన్ వల్ల ఆకులు పడిపోవడం, మొక్కల ఎదుగుదల తగ్గడం మరియు అకాల మరణం సంభవిస్తాయి.
ఈ వ్యాధికారకాన్ని నియంత్రించడానికి జీవ నియంత్రణ ఏజెంట్లు అందుబాటులో లేవు. నియంత్రణ ప్లాటుతో పోల్చితే వేప నూనె, జట్రోఫా లేదా ఆవ నూనె యొక్క రోగనిరోధక పిచికారీ వలన వ్యాధి యొక్క తీవ్రత తక్కువగా ఉండడం మరియు మంచి దిగుబడి రావడం జరుగుతుంది.
అందుబాటులో ఉంటే జీవ చికిత్సలతో పాటు నివారణ చర్యలతో సమగ్ర విధానాన్ని ఎల్లప్పుడు పరిగణలోకి తీసుకోండి. విత్తనాల ద్వారా వ్యాప్తిని తగ్గించడానికి ఫినైల్ మెర్క్యురీ ఎసిటేట్ మరియు డైక్లోబుట్రాజోల్‌తో విత్తన చికిత్సలు ఉపయోగించబడ్డాయి. లక్షణాలు కనిపించిన వెంటనే శిలీంద్ర సంహారక మందుల వాడకం, తరువాత 10 రోజుల వ్యవధిలో మరో రెండు పిచికారీలు వ్యాధి సంభవం మరియు తీవ్రతను తగ్గిస్తాయి. కాయధాన్యాల తుప్పు నియంత్రణ కోసం ఫ్లూట్రియాఫోల్, మెటలాక్సిల్ సిఫారసు చేయవచ్చు. ఇతర ఉత్పత్తులలో మాంకోజెబ్, క్లోరోతలోనిల్ మరియు రాగితో కూడిన సూత్రీకరణలు ఉన్నాయి.
పంటలు అందుబాటులో లేనప్పుడు మొక్కల అవశేషాలు, స్వచ్చందంగా వచ్చే మొక్కలు మరియు కలుపు మొక్కలపై జీవించే యురోమైసెస్ విసియా-ఫాబే అనే ఫంగస్ వల్ల ఈ లక్షణాలు ఏర్పడతాయి. ఒకే సమయంలో ఇది విత్తనాలపై కూడా ఇది కలుషితంగా ఉండవచ్చు. కాయధాన్యం, చిక్కుడు మరియు బఠానీలు కాకుండా ఇది తక్కువ సంఖ్యలో అతిధి మొక్కలను కలిగి ఉంది. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు (17 నుండి 25°C మరియు సుదీర్ఘమైన ఆకు తడి), ఇది కొత్త మొక్కలు లేదా పొలాలకు సంక్రమించడానికి వీలుగా, సుదూరం గాలి ద్వారా వ్యాప్తి చెందే బీజాంశాలను ఉత్పత్తి చేస్తుంది. కలుషితమైన ఎండుగడ్డి, మరియు దుస్తులు, పరికరాలు మరియు యంత్రాలు, పొలాల మధ్యన మొక్కల అవశేషాల రవాణా ఈ వ్యాధి విస్తరించడానికి ఇతర మార్గాలు. అధికంగా వ్యాపించే సామర్థ్యం ఉన్నందున ఇది అధిక ఆర్థిక ముప్పుగా పరిగణించబడుతుంది.