Botryotinia squamosa
శీలీంధ్రం
పంట ఏ దశలోఅయినా ఈ తెగులు సంక్రమించవచ్చు అయితే దీని లక్షణాలు ముందు ముదురు ఆకులపై కనిపిస్తాయి. మొదట లక్షణాలు చిన్న (1-5 మి.మి.) గుండ్రటి తెల్లటి మచ్చల రూపంలో ఆకుల పై భాగంలో ఏర్పడతాయి. ప్రారంభంలో ఒకొక్క మచ్చ మరియు తర్వాత మచ్చల గుంపుల చుట్టూ నీటితో తడిచినట్టు వున్న లేత పచ్చ లేదా వెండిరంగు వలయాలు కనిపిస్తాయి. క్రమేణా ఈ మచ్చలు పెద్దవై, మధ్యలో ఎండు గడ్డి రంగు గుంతలు ఏర్పడతాయి. కణజాలం నాశనం అవుతుందనడానికి ఇది సంకేతం. తరువాత దశలో ఈ మచ్చల్లో చీలికలు ఏర్పడతాయి. ఆకు కొనలు మరియు అంచులు మెత్తగా మారి క్రమేణా నిర్జీవమవుతాయి. ఫలితంగా మాడిపోవడం మరియు చనిపోవడం జరుగుతుంది. ఆనుకూల పరిస్థితులలో ఈ తెగులు ఉల్లి గడ్డలను ఆశించి గడ్డల పరిమాణాన్ని మరియు నాణ్యతను తగ్గిస్తుంది. వ్యాధి మరింత వ్యాప్తి చెందుతున్నప్పుడు, పొలంలో చనిపోతున్న మొక్కల పెద్ద పసుపు ప్యాచీలను దూరం నుండి గమనించవచ్చు.
ఈ తెగులుకు జీవ నియంత్రం పద్ధతులు లేవు. మీకు ఏవైనా జీవ నియంత్రం పద్ధతుల వలన మంచి ఫలితాలను కలిగి ఉంటే దయచేసి మాకు తెలియజేయండి.
వీలైనంతవరకు ఎల్లపుడూ జీవసంబంధమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. సమగ్ర సస్యరక్షణ పద్దతులను అవలంబించాలి. మంచి యాజమాన్య పద్ధతులు పాటించాలి. శిలీంద్ర నాశినులైన ఇప్రొడిఒన్, పైరిమేధానిల్, ఫ్లూవాజినం లేదా సైప్రోడినిల్ తో పాటు ఫ్లూడియోక్సనిల్ లను పిచికారీ చేయడం వలన చాలా మంచి ఫలితాలు వస్తాయి. క్లోరోతలోనిల్ మరియు మాంకోజెబ్ లను పైనుండి చల్లేకన్నా మట్టిని శుభ్రపరచడానికి వాడడం వలన మంచి ఫలితం ఉంటుంది.
బొట్రిటిస్ స్క్వామోసా అనే శిలీంద్రం వల్ల తెగులు కలుగుతాయి. ఈ శిలీంద్రం తెగులుతో సోకిన ఉల్లి గడ్డలు లేదా పొలంలో మిగిలిపోయిన దుబ్బులు లేదా స్టోరేజ్ గోడౌన్లలో ఉండి అనుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు గాలి ద్వారా వ్యాపిస్తాయి. పరిస్థితులు అనుకూలంగా వున్నప్పుడు, ఈ కణజాలాలపై శిలీంధ్ర బీజాంశాలు ఉత్పత్తి అవుతాయి మరియు గాలి ద్వారా పొరుగున వున్న మొక్కలకు వ్యాప్తి చెందుతాయి, ఇది సంక్రమణకు ప్రాధమిక వనరుగా పనిచేస్తుంది. 10 నుండి 20°C మధ్య ఉష్ణోగ్రతలు, అధిక వర్షపాతము, ఎక్కువ సమయం ఆకులు తడిగా ఉండడం లేదా అధిక తేమ వాతావరణం శిలీంద్ర బీజాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. తీవ్రమైన తెగులు వ్యాప్తిని నివారించడానికి వీలైనంతవరకు ఆకులు పొడిగా ఉంచడం చాలా ముఖ్యం. ఈ వ్యాధి లక్షణాలు కరువు పరిస్థితులు, సుడిగాలి వలన కలిగే నష్టం మరియు తామర పురుగు తెగుళ్లు లేదా కలుపు మొక్కల నివారణ మందులకు సంబంధించిన ఇతర తెగుళ్లను పోలి ఉంటాయి.