Colletotrichum truncatum
శీలీంధ్రం
ఆకులు, కాండం, కాయలు గింజలపై గాయాలు కనిపించడం ద్వారా పక్షి కన్ను తెగులు వర్ణించబడుతుంది. ముదురు గోధుమ రంగు అంచులతో కోలాకారపు , బూడిద నుండి టాన్ రంగు నిర్జీవ ప్యాచీలు ముదురు ఆకులపై వృద్ధి చెందుతాయి. తీవ్రమైన సందర్భాల్లో, ఈ ఆకులు వాలిపోయి, ఎండిపోయి రాలిపోతాయి. దీని వలన ఆకులు రాలిపోతాయి. కాండంపైన పొడవైన నొక్కుకుపోయినట్టు వున్న ముదురు రంగు అంచులతో గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఇవి విస్తరించేటప్పుడు, గాయాలు కాండం మొదలును చుట్టుముట్టి దాన్ని నడికట్టు లాగ పట్టి ఉంచి మొక్క వాడిపోయి చనిపోయేలా చేస్తుంది. కాయలపై ఎర్రటి-గోధుమ రంగు అంచులు మరియు ఎర్రటి కేంద్రాలతో వృత్తాకార మరియు నొక్కినట్టు వున్న మచ్చలు ఉంటాయి. అన్ని సందర్భాల్లోనూ , చనిపోయిన కణజాలంపై చిన్న విలక్షణమైన ముదురు లేదా నల్లని మచ్చలు కనిపిస్తాయి. అప్పుడప్పుడు, సాల్మన్ రంగులో ఉండే ఒక స్రావం కూడా మధ్యలో కనిపిస్తుంది. తెగులు సోకిన గింజలు ముడుతలు పడి రంగు కోల్పోతాయి. మొత్తంమీద, మొక్కల సత్తువ బాగా తగ్గిపోతుంది మరియు ప్రతికూల వాతావరణ పరిస్థితులలో ఇవి వాలిపోయి పడిపోవచ్చు.
కొన్ని సంబంధిత జాతుల ఫంగస్ కోసం (ఇతర పంటలపై), తెగులు సోకిన విత్తనాలను 52°C వేడి నీటిలో 30 నిమిషాలు నానబెట్టడం ద్వారా కొంత వరకూ ఈ తెగులును నియంత్రించవచ్చు. ఈ చికిత్సకు కావలసిన ప్రభావాన్ని పొందడానికి ఉష్ణోగ్రత మరియు సమయాన్ని ఖచ్చితంగా పాటించాలి. సంక్రమణను నియంత్రించడానికి జీవసంబంధ ఏజెంట్లు కూడా సహాయపడవచ్చు. ట్రైకోడెర్మా హర్జియనం అనే ఫంగస్ మరియు విత్తన చికిత్సగా ఉపయోగించే సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ అనే బ్యాక్టీరియా కొన్ని జాతుల కొల్లెటోట్రిఖంతో పోటీపడతాయి.
అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. విత్తనం ద్వారా సంక్రమణలను నివారించడానికి విత్తన చికిత్సలను ఉపయోగించవచ్చు. పుష్పించే ముందు వివిధ శిలీంద్ర నాశినులను ఆకుల పిచికారీగా సిఫార్సు చేయబడింది. తెగులు వృద్ధికి పరిస్థితులు అనుకూలంగా ఉంటే వీటిని మళ్ళీ మరొకసారి వాడాలి. పైరాక్లోస్ట్రోబిన్, క్లోరోథలోనిల్, ప్రోథియోకొనజోల్ లేదా బోస్కాలిడ్ ఆధారంగా సూత్రీకరణలు తెగులును అదుపులో ఉంచడానికి విజయవంతంగా ఉపయోగించబడ్డాయి. ఈ ఉత్పత్తులలో కొన్నింటికి కొన్ని నిరోధకత యొక్క సందర్భాలు వివరించబడ్డాయి.
గింజలతో సంబంధం కలిగిన మట్టిలో లేదా మొక్కల అవశేషాలపై నాలుగేళ్ల వరకు జీవించి వుండే కొల్లెటోట్రిఖమ్ ట్రంకాటం అనే ఫంగస్ వలన ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఈ ఫంగస్ కొత్త మొక్కలకు సంక్రమించడానికి రెండు మార్గాలు ఉన్నాయి. మొలకలు ఆవిర్భవిస్తున్న సమయంలో మట్టిలో పెరిగే బీజాంశం వీటికి సంక్రమించినప్పుడు ఇది కణజాలాల్లో వ్యవస్థాత్మకంగా పెరుగుతుంది. ఇతర సందర్భాల్లో వర్షపు తుంపర్ల ద్వారా బీజాంశం క్రింది ఆకులపైకి చిమ్ముతుంది మరియు సంక్రమణను పైకి వ్యాపింపచేస్తుంది. తరువాత మొక్కల కణజాలాలపై (ముదురు లేదా నల్లని మచ్చలు) వృద్ధి చెందుతున్న గాయాలలో మరిన్ని బీజాంశాలను ఉత్పత్తి చేస్తుంది. ఇవి మొక్కల పైభాగాలకు లేదా ఇతర మొక్కలకు (ద్వితీయ సంక్రమణ) వర్షపు తుంపర్ల ద్వారా చెదరగొట్టబడతాయి. చల్లటి నుండి వెచ్చని ఉష్ణోగ్రతలు (20 నుండి 24°C), అధిక ఉదజని సూచిక ఉన్న నేలలు, సుదీర్ఘమైన ఆకు తడి (18 నుండి 24 గంటలు), తరచుగా వర్షం మరియు దట్టమైన మొక్క పై పందిరి ఈ వ్యాధికి అనుకూలంగా ఉంటాయి. పోషకాల లోపం ఒత్తిడికి గురైన పంటలు ముఖ్యంగా ఈ తెగులు బారిన పడే అవకాశం అధికంగా ఉంటుంది. తెగులు తీవ్రత అధికంగా ఉంటే దిగుబడి నష్టాలు 50% వరకు ఉండవచ్చు.