ఇతరములు

చేదు కుళ్లు తెగులు

Glomerella cingulata

శీలీంధ్రం

క్లుప్తంగా

  • పండ్లపై ఎరుపు రంగు వలయంతో చిన్న, పల్లపు, గోధుమరంగు గాయాలు ఏర్పడతాయి.
  • ఈ గాయాలు మధ్యలో చిన్న, నల్ల చుక్కలతో విస్తరిస్తాయి.
  • గోధుమ రంగు కుళ్ళు - V- ఆకారపు నమూనాలో ఉపరితలం నుండి పండు కేంద్ర భాగం వరకూ విస్తరిస్తుంది.
  • ఆపిల్ కుళ్లిపోవడం మరియు ఎండిపోవడం - మమ్మీఫైడ్ పండు జరుగుతుంది.

లో కూడా చూడవచ్చు

2 పంటలు
ఆపిల్
చెర్రీ

ఇతరములు

లక్షణాలు

వసంతకాలంలో లేత పండ్లపై చిన్న చిన్న బూడిద లేదా గోధుమ రంగు చుక్కలు మొదటి లక్షణాలుగా కనిపిస్తాయి. వేసవి కాలం వచ్చేసరికి ఈ మచ్చలు చిన్న చిన్న, నొక్కుకుపోయినట్టు వున్న పల్లపు, గోధుమ రంగు గాయాలుగా వృద్ధి చెందుతాయి. కొన్నిసార్లు వీటి చుట్టూ ఎర్రటి రంగు వలయాన్ని స్పష్టంగా చూడవచ్చు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు, ఈ గాయాలలో కొన్ని మరింత విస్తరిస్తాయి మరియు వాటి మధ్యలో చిన్న, నలుపు లేదా ముదురు గోధుమ రంగు చుక్కలు ఏర్పడతాయి. క్రమంగా గోధుమ, నీరు వంటి కుళ్ళు ఉపరితలం నుండి పండు మధ్య వరకు విస్తరించి, V- ఆకారపు నమూనాను ఏర్పరుస్తుంది (ఆపిల్ పండు మధ్యలో స్థూపాకార కుళ్ళు నమూనా బోట్ రాట్ తెగులు లక్షణం). కుళ్ళిపోతుండటంతో, క్షీణిస్తున్న ఆపిల్ ఎండిపోయి సాధారణంగా కొమ్మకు వేలాడుతూ ఉంటుంది, మమ్మీఫైడ్ పండు అని పిలవబడే పండు ఆకృతికి మారుతుంది. ఆకులపై, చిన్న ఊదా రంగు మచ్చల ద్వారా ఈ అంటువ్యాధులు వర్గీకరించబడతాయి, ఇవి తరువాత క్రమరహిత నిర్జీవ ప్రాంతాలుగా విస్తరిస్తాయి. తీవ్రంగా ప్రభావితమైన ఆకులు పసుపు రంగులోకి మారి చివరికి రాలిపోతాయి. చిగుర్లకు ఈ తెగులు సోకడం వలన తరువాతి సీజన్లో పుష్పించే సమయంలో నష్టం కలుగుతుంది. అన్నిఆపిల్ రకాలు చేదు కుళ్ళు తెగులుకు గురవుతాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

నియంత్రిత పరిస్థితులలో ‘గోల్డెన్ డెలీసియస్’ యాపిల్స్ పై చేదు కుళ్ళు తెగులును నియంత్రించడానికి వేడి చికిత్సతో కలిపి మెచ్నికోవియా పుల్చేరిమా టి 5-ఎ 2 అనే విరోధిని ఉపయోగించారు. క్షేత్ర పరీక్షలలో ఈ చికిత్సలను ఇంకా పరీక్షించాల్సిన అవసరం ఉంది.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. మంచి పారిశుధ్య కార్యక్రమం పాటించినట్లయితే, ప్రతి పదిహేను రోజులకు ఒకసారి డినానిథియాన్, రాగి లేదా గంధకం ఆధారిత మందులను పిచికారీ చేయడం వల్ల మంచి ఫలితాలు కలగవచ్చు. వెచ్చని, తడి వాతావరణం ఏర్పడినట్లైతే, ప్రతి 14 రోజుల కన్నా ఎక్కువసార్లు పిచికారీ చేయడం అత్యవసరం.

దీనికి కారణమేమిటి?

ఆకులు మరియు పండ్లపై లక్షణాలు ఒకే వ్యాధికారకం యొక్క రెండు వేర్వేరు లైంగిక దశల వలన కలుగుతాయి. గ్లోమోరెల్లా సింగులాటా అనే లైంగిక రూపం కణజాలాలను నివాసంగా చేసుకోవడం వలన ఆకులు మరియు పండ్లపై మచ్చలు ఏర్పడతాయి. అలైంగిక రూపాన్ని కొల్లెటోట్రిచుమ్ గ్లోయోస్పోరియోయిడ్స్ అని పిలుస్తారు మరియు తరువాత సీజన్లో పండ్ల గాయాలకు ఇది కారణమౌతుంది. మమ్మీఫైడ్ పండ్లు మరియు తెగులు సోకిన కలప ఈ ఫంగస్ కు శీతాకాలంలో ఆవాసాలుగా ఉంటాయి. వసంత ఋతువులో ఇది తిరిగి వృద్ధి చెందడం ప్రారంభించి బీజాంశాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ బీజాంశాలు వర్షపు తుంపర్లు మరియు గాలి ద్వారా చెల్లాచెదురు చెందుతాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు (25°C) మరియు దీర్ఘకాలం ఆకులు చెమ్మతో ఉండడం ఫంగస్ జీవిత చక్రం మరియు సంక్రమణ ప్రక్రియకు అనుకూలంగా ఉంటుంది. పండ్ల యొక్క అన్ని వృద్ధి దశల్లోనూ ఈ తెగులు సంక్రమించే అవకాశం ఉంటుంది. కానీ సీజన్ చివరి భాగంలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. పండు వృద్ధి దశలో తడితో కూడిన వెచ్చని వాతావరణం వున్నట్లైతే ఈ తెగులు బాగా విస్తరించి విస్తృతమైన నష్టాలను కలుగచేస్తుంది.


నివారణా చర్యలు

  • పొలంలో మంచి పారిశుధ్యం పాటించండి.
  • తెగులు తీవ్రత తక్కువగా వున్నప్పుడు పండ్ల తోటలను గమనిస్తూ వుండండి.
  • ఎదిగే దశలో చెట్టు నుండి తెగులు సోకిన పండ్లను తొలగించండి.
  • పంట కోత తర్వాత తెగులు సోకిన కలప మరియు చెట్ల అవశేషాలను తొలగించి నాశనం చేయాలి.
  • ప్రత్యామ్నాయంగా, త్వరగా కుళ్ళి పోవడానికి వీలుగా నేలపైన ఉండే చనిపోయిన కొమ్మలను ముక్కలుగా కత్తిరించండి.
  • మొక్కలకు తెగులు సంక్రమించకుండా నిరోధకతను పెంచడానికి మొక్కల బలవర్ధకాలను వాడవచ్చు.
  • సమతుల్య ఎరువుల కార్యక్రమాన్ని నిర్వహించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి