ద్రాక్ష

ద్రాక్షలో బూడిద తెగులు

Erysiphe necator

శీలీంధ్రం

క్లుప్తంగా

  • లేత ఆకుల అంచుల వద్ద పసుపురంగు మచ్చలు.
  • మచ్చల మీద బూడిద నుండి తెలుపురంగు పౌడర్ లాంటి శిలీంధ్ర పెరుగుదల.
  • ఈనెలు, చిగుర్లపై గోధుమ లేదా నలుపు పట్టీలు ఏర్పడతాయి.
  • పండు ముదురు గోధుమరంగులోకి మారవచ్చు, గీతలు పడవచ్చు.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

ద్రాక్ష

లక్షణాలు

లక్షణాల తీవ్రత వివిధ రకాల వైన్ మరియు పర్యావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా, మొదట, పత్రహరితం కోల్పోయిన మచ్చలు (2 నుండి 10 మిమీ వ్యాసం) లేత ఆకుల అంచుల దగ్గర కనిపిస్తాయి. బూడిద నుండి తెలుపు పౌడర్ లాంటి శిలీంధ్ర పెరుగుదల ఈ మచ్చలపై క్రమంగా అభివృద్ధి చెందుతుంది. వ్యాధి పెరిగేకొద్దీ, మచ్చలు విస్తరిస్తాయి మరియు మొత్తం ఆకును కప్పడానికి ఒకదానితో మరొకటి విలీనం కావచ్చు, ఇది చివరికి వైకల్యం చెంది, ఎండిపోయి రాలిపోతుంది. తెగులు సోకిన ఆకుల దిగువ భాగంలో ఉన్న తీగల భాగాలు గోధుమ రంగులోకి మారవచ్చు. చిగుర్లపై గోధుమ లేదా నలుపు విస్తరించివున్న ప్యాచీలు కూడా కనిపిస్తాయి. తరువాతి దశలలో, పుష్పగుచ్ఛాలు మరియు బెర్రీలు కూడా ప్రభావితమవుతాయి మరియు తీగలు ఒక దుర్వాసనను విడుదల చేస్తాయి. తెగులు సోకిన బెర్రీలు ముదురు గోధుమ రంగులోకి మారవచ్చు మరియు గీతలు ఏర్పడవచ్చు లేదా మమ్మీ అవుతాయి. కొన్ని రకాల్లో, ఇవి తక్కువ ప్రాంతాన్ని కవర్ చేస్తాయి మరియు లక్షణాలు ఆకులు బూడిదరంగు లేదా ఊదా రంగులోకి మారడానికి పరిమితం అవుతాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

సేంద్రీయంగా ధృవీకరించబడిన వాడడానికి ద్రాక్షపై గంధకం, హార్టికల్చరల్ నూనె మరియు వివిధ రకాల వాణిజ్య ఉత్పత్తులు అంగీకరించబడతాయి. పరాన్నజీవి ఫంగస్ ఆంపిలోమైసెస్ క్విస్క్వాలిస్, ఎరిసిఫ్ నెకాటర్ యొక్క జీవిత చక్రాన్ని అడ్డుకుంటుంది. ఫంగస్ ను తినే పురుగులు మరియు బీటిల్స్ కొన్ని తీగలలో బూజు తెగులు కాలనీలను తగ్గిస్తాయని తెలియచేయబడింది.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లప్పుడూ జీవపరమైన మరియు నివారణా చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. అన్ని ఆకుపచ్చ మొక్కల ఉపరితలాల మీద మంచి స్ప్రే కవరేజ్ మరియు సకాలంలో వాడకం అవసరం. ప్రారంభ సంక్రమణను తగ్గించడానికి సల్ఫర్, నూనెలు, బైకార్బోనేట్లు లేదా కొవ్వు ఆమ్లాల ఆధారిత రక్షణ మందులను ఉపయోగించవచ్చు. బూజును గుర్తించిన తర్వాత స్ట్రోబిలురిన్స్ మరియు అజోనాఫ్తలీన్స్ ఆధారిత ఉత్పత్తులను పిచికారీ చేయవచ్చు.

దీనికి కారణమేమిటి?

బూజు తెగులు ఫంగల్ వ్యాధికారక సూక్ష్మజీవి ఎరిసిఫ్ నెకాటర్ వల్ల వస్తుంది. ఇది శీతాకాలంలో నిద్రావస్థలో వున్న మొగ్గలు లేదా బెరడు పగుళ్లలో శిలీంధ్ర బీజాంశాలుగా జీవిస్తుంది. వసంతకాలంలో, ఈ బీజాంశాలను గాలి ద్వారా కొత్త మొక్కలకు (ప్రాధమిక సంక్రమణ) తీసుకెళ్లబడతాయి. వివిధ మొక్కల భాగాలపై బూజు అభివృద్ధి చెందిన తరువాత, ఇది గాలి ద్వారా (ద్వితీయ సంక్రమణ) మరింత వ్యాపించే కొత్త బీజాంశాలను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. పొగమంచు మరియు మంచు నుండి ఏర్పడిన తేమ, సుదీర్ఘమైన ఆకు తేమ లేదా మేఘావృత వాతావరణం బీజాంశ ఉత్పత్తికి అనుకూలంగా ఉంటాయి కాని సంక్రమణ ప్రక్రియకు అవసరం లేదు (ఇతర శిలీంధ్ర వ్యాధులకు విరుద్ధంగా). శిలీంధ్ర చక్రానికి తక్కువ నుండి మితమైన రేడియేషన్ మరియు 6 నుండి 33°C వరకు ఉష్ణోగ్రతలు (22 నుండి 28°C ఉష్ణోగ్రతలు వాంఛనీయమైనది) కూడా అనుకూలంగా ఉంటాయి. 35°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు, ప్రత్యక్ష సూర్యకాంతి మరియు తరచుగా వర్షానికి బహిర్గతమైన ఆకు ఉపరితలాలపై ఈ బూడిద తెగులు తగ్గుతుంది.


నివారణా చర్యలు

  • అందుబాటులో ఉంటే తెగులును తట్టుకునే రకాలను వాడండి.
  • మంచి గాలి ప్రసరణకు వీలు కల్పించడానికి తీగల మధ్య బాగా దూరం ఉంచండి.
  • ప్రత్యామ్నాయంగా తెరచినట్టు వుండే పందిరికి అనుకూలంగా ఉండే కత్తిరింపు పద్ధతులను ఎంచుకోండి.
  • ఎండ తగిలే స్థలాలను ఎంచుకోండి.
  • వ్యాధి సంకేతాల కోసం పొలాన్ని క్రమం తప్పకుండా గమనిస్తూ వుండండి.
  • ఆకుల అధిక పెరుగుదలను నివారించడానికి నత్రజని ఎరువులను జాగ్రత్తగా వాడండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి