Plenodomus lingam
శీలీంధ్రం
లక్షణాల యొక్క తీవ్రత పంట లేదా రకాన్ని బట్టి, వ్యాధికారక సూక్ష్మ జీవులు మరియు అప్పటి పర్యావరణ పరిస్థితులను బట్టి విస్తృతంగా మారుతుంది. ఏదేమైనా, ప్రధాన లక్షణాలు ఆకులు మరియు కాండాలపై కనిపిస్తాయి. ఆకు గాయాలలో వృత్తాకార, లేత బూడిద రంగు గాయాలు నల్ల మచ్చలతో నిండి ఉంటాయి మరియు ముదురు నిర్జీవ గాయాలు ఉంటాయి. సాధారణంగా ఆకు ఈనె పసుపు రంగులోకి మారడం లేదా మచ్చల చుట్టూ ఉన్న మొత్తం పాచెస్ కూడా పాలిపోయినట్టు మారడం (పాలిపోయిన వలయం) జరుగుతుంది. కాండం మీద చిన్న, దీర్ఘచతురస్రాకార, గోధుమ రంగు మచ్చల నుండి క్యాంకర్ల వరకు లాగా ఉండే బూడిదరంగు గాయాలు కనిపిస్తాయి. వాటిపై నల్లటి మచ్చలను కూడా గమనించవచ్చు. ఇవి పెరిగే కొద్దీ, ఈ క్యాంకర్లు కాండం చుట్టూ నడికట్టులాగా మారి దీనిని బలహీనపరుస్తాయి. ఇది మొక్కలు వాలిపోవడానికి మరియు మొక్కల మరణానికి దారితీస్తుంది. కాయలు నల్లని అంచు గల గోధుమరంగు మచ్చల రూపంలో లక్షణాలను చూపించవచ్చు, ఫలితంగా ముందుగానే పండిపోవడం మరియు విత్తన సంక్రమణ జరుగుతుంది.
ఈ వ్యాధితో పోరాడటానికి జీవ నియంత్రణా చర్యలు ఏవీ అందుబాటులో లేవు. మీకు ఏమైనా తెలిస్తే మమ్మల్ని సంప్రదించండి
అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లప్పుడూ జీవపరమైన మరియు నివారణా చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. శిలీంధ్రాలు కాండం చేరుకున్న తర్వాత శిలీంద్ర నాశినులు చాలా తక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి మరియు అధిక దిగుబడిని ఆశించే పొలాలలో మాత్రమే చికిత్స సమర్ధనీయం. ప్రోథియోకోనజోల్‌ను ఆకులపై పిచికారీగా ఉపయోగించవచ్చు. దీరమ్ కు జోడించిన ప్రోక్లోరాజ్‌తో చురుకైన విత్తన చికిత్స, విత్తనం ద్వారా సంక్రమించే ఫోమా ఇన్‌ఫెక్షన్ వల్ల కలిగే విత్తనాల ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తుంది.
బ్లాక్‌లెగ్ (ఫోమా స్టెమ్ క్యాంకర్ అని కూడా పిలుస్తారు) వాస్తవానికి రెండు జాతుల శిలీంధ్రాల వలన సంభవిస్తుంది, అవి లెప్టోస్ఫేరియా మాక్యులన్స్ మరియు ఎల్. బిగ్లోబోసా. ఇవి విత్తనాలలో, లేదా పొలంలో ఉండిపోయే మొండి గడ్డి మరియు పంట అవశేషాల్లో మనుగడ సాధిస్తాయి. వసంతకాలంలో వెచ్చని మరియు తేమతో కూడిన వాతావరణం ప్రారంభంలో ఇవి బీజాంశాలను ఉత్పత్తి చేయటం ప్రారంభిస్తాయి. ఈ బీజాంశం గాలి లేదా వర్షపు తుంపర్ల ద్వారా ద్వారా ఆరోగ్యంగా వున్న మొక్కల భాగాలకు, ప్రధానంగా క్రింది భాగంలోని ఆకులు మరియు కాండం మొదలు పైకి చేరుతుంది. బీజాంశం యొక్క అంకురోత్పత్తి మరియు మొక్కల కణజాలాలపై ఫంగస్ పెరుగుదల ఈ తెగులు లక్షణాలను ప్రేరేపిస్తాయి. మొలకలకు వచ్చే మొదటి ఆకులకు సోకినట్లయితే, సీజన్ ప్రారంభంలోనే మొలకలు చనిపోవచ్చు (డంపింగ్-ఆఫ్). ఈ ఫంగస్ లేత ఆకుల నుండి కాండం వరకు వ్యాపిస్తుంది, ఇక్కడ అది ఆకు కాడలు మరియు కాండం జంక్షన్ మధ్య లేదా మొక్క పైభాగం చుట్టూ క్యాంకర్లను ఏర్పరుస్తుంది. ఇది కాండం ద్వారా నీరు మరియు పోషక రవాణాను పరిమితం చేస్తుంది మరియు మొక్కలు చనిపోవడానికి మరియు పడిపోవడానికి దారితీస్తుంది. ఆవ మరియు బ్రాసికా కుటుంబంలోని ఇతర పంటలపై (కనోలా, టర్నిప్, బ్రోకలీ, బ్రస్సెల్స్ మొలకలు, క్యాబేజీ) ఇది ఒక ముఖ్యమైన వ్యాధి.