పొగాకు

బ్లాక్ శాంక్

Phytophthora nicotianae

శీలీంధ్రం

క్లుప్తంగా

  • ఆకులు అసాధారణ రంగులు, రూపాలుగా మారి వంకరపోయి చుట్టు చుట్టు కుంటాయి.
  • మృత కణాల మచ్చలు విస్తృతంగా పచ్చదనము కోల్పోయిన ఆకుల మధ్య కనిపిస్తాయి.
  • చెట్లపై పండ్లు కూడా అసాధారణ ఆకారం కలిగి ఉంటాయి మరియు వాటి చర్మం నలుపు లేదా గోధుమ రంగు మచ్చలతో నిండి వుంటుంది.
  • ఈ గాయాలపైన బూజు విస్తృతంగా అభివృద్ధి చెంది జిగురు క్రిందికు కారడము గమనించవచ్చును.
  • చాలా అధిక మొత్తంలో బంక (గమ్మోసిస్) చెట్టు బెరడు పైన వున్న గాయాల నుండి కారుతుంది.

లో కూడా చూడవచ్చు


పొగాకు

లక్షణాలు

ఈ తెగులు లక్షణాలను మొక్కల అన్ని ఎదుగుదల అన్ని దశలలోను మరియు మొక్క అన్ని భాగాలలో గమనించవచ్చును. ఆకులు అసాధారణ రంగుతో రూపాంతరము చెంది రింగు రింగులుగా మారతాయి. మృత కణాల మచ్చలు విస్తృతంగా ఏర్పడి పచ్చదనం కోల్పోయిన ఆకుల మధ్య కనిపిస్తాయి. ఈ తెగులు విస్తరిస్తున్న కొద్దీ చనిపోయిన కణజాలం క్రిందకు పడిపోయి ఆకులు చిరిగి పోయినట్లుగా కనబడతాయి. పండ్లు కూడా అసాధారణమైన ఆకారం కలిగి ఉండి వాటి చర్మం నలుపు లేదా గోధుమ గాయాలతో కప్పబడి వుంటుంది. తరువాత దశలలో విస్తృతమైన బూజు వృద్ధి చెంది వీటి నుండి జిగురు కారడము గమనించ వచ్చు. పండ్లు వాడిపోయి చర్మం ముడుచుకొని పోయిన లక్షణాలు స్పష్టంగా కనబడుతాయి. చెట్టు బెరడు ముదురు గోధుమ రంగులోకి మారుతుంది మరియు చెట్టు కాండం మీద పగుళ్ళు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ గాయాల (గమ్మోసిస్) నుండి విపరీతమైన జిగురు కారుతుంది. వీటిని కత్తిరించి తెరిచినప్పుడు కాండం మరియు మూలాల యొక్క అంతర్గత కణజాలం మురిగి( రంగు పాలిపోవడము) పోయినట్లుగా గమనించ వచ్చును. మొత్తంమీద, మొక్కలు వాడిపోయి కొన్ని తీవ్రమైన సందర్భాల్లో రాలిపోవడం గమనించవచ్చు.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

ఈ ఫంగస్ యొక్క నియంత్రణ పంట మరియు పర్యావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఫైటోఫ్తోర నికోటియనే కు అనేక వ్యతిరేక జాతులు ఉన్నాయి, ఉదాహరణకు ఆస్పెర్గిల్లస్ తెర్రియుస్ ,సూడో మొనాస్ పుటిదా లేదా ట్రైకోడెర్మా హర్జియానం. తడి సీజన్లో ప్రతి 2-3 నెలలకు రాగి ఆధారిత శిలీంధ్ర నాశినులు శీతా కాలములో వాడడం వలన ఈ తెగులును తగ్గించవచ్చు. దెబ్బ తిన్న బెరడును తొలగించి ఒక రాగి శిలీంధ్ర నాసినిని పైన పూత పూయవచు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. కొన్ని పంటలలో మెటలాక్సిల్ మరియు ఫోస్ఫోనేట్, రెండు కూడా ప్రభావవంతంగా ఉన్నాయి. ఐతే ఈ తెగులు మెటలాక్సిల్ కు కొంత నిరోధకత పెంచుకున్నట్లు నివేదికలు వున్నాయి.

దీనికి కారణమేమిటి?

వ్యవసాయ మరియు తోటల పెంపకంలో ముఖ్యమైన చాలా మొక్కల రకాలలో ఫైటో ఫతోర నికోతియన్ నె సోకుతుంది. ఇది ప్రత్యేకంగా తీవ్రమైన వ్యాధి కారకము అవుతుంది. ప్రధానంగా ఇది నేలలో అప్పటికప్పుడు పుట్టే ఫంగస్. ఇది ఎక్కువగా వేడి, తేమతో కూడిన వాతావరణంతో పాటు సమశీతోష్ణ వాతావరణంలో కూడా గమనించవచ్చును. రోగ కారకక్రిముల వ్యాప్తికి మరియు దాని బీజాంశాల వ్యాప్తికి ఎక్కువ తేమ అవసరం ఉంటుంది. తెగులు సోకిన మొక్కల నుండి సమీపంలోని ఆరోగ్యకరమైన మొక్కలకు వర్షపు జల్లులు లేదా నీటిపారుదల ద్వారా వీటి స్పోర్స్ వ్యాప్తి చెందుతాయి. ఈ బీజాంశాలు నీటిలో కూడా జీవించగలవు మరియు నీటి గుంటలు లేదా నీటిపారుదల వ్యవస్థలను కలుషితం చేస్తాయి మరియు సంక్రమణము చెందిన ప్రాంతం నుండి చాలా దూరంలో వుండే మొక్కలకు ఈ తెగులు సోకేలా చేస్తాయి.


నివారణా చర్యలు

  • ధ్రువీకరించిన విత్తన డీలర్ల నుండి తెగులు రహిత విత్తనాలను లేదా మొక్కలను వుపయోగించండి.
  • అందుబాటులోవుంటే తెగుళ్లను తట్టుకునే రకాలను ఉపయోగించండి.
  • పొలంలో అధికంగా నీటిని పెట్టకండి.
  • తెగులు సోకిన మొక్కలు లేదా కొమ్మలను తొలగించండి.
  • నీటి పారుదల బాగా వున్నచోట మొక్కలను నాటండి.
  • పొలంలో పనిచేస్తున్నప్పుడు మొక్కలకు దెబ్బలు తగలకుండా చూడండి.
  • ఆకులు తడిగా ఉన్నప్పుడు పొలంలో పని చేయకండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి