స్ట్రాబెర్రీ

స్ట్రాబెర్రీలో పక్షి కన్ను తెగులు

Colletotrichum spp.

శీలీంధ్రం

క్లుప్తంగా

  • పక్వానికి వచ్చిన పండ్లపై నీటిలో తడిచినట్టు ఉన్న లేత గోధుమరంగు మచ్చలు.
  • పక్వానికి వచ్చిన పండ్లపై ముదురు గోధుమ రంగు లేదా నల్లని గుండ్రని, కొద్దిగా నొక్కుకుపోయినట్టు ఉన్న గాయాలు.
  • మొక్క కణజాలం, ప్రధానంగా వేర్లకు కొద్దిగా పైభాగంలో రంగు మారుతుంది.
  • ఆకులపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి.
  • ఆకులకు నష్టం కలుగుతుంది.
  • అన్ని ఆకుపచ్చ భాగాలపై ముదురు గోధుమ రంగు లేదా నలుపు రంగులో నొక్కుకుపోయినట్టు ఉన్న వృత్తాకార మచ్చలు ఏర్పడతాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు
స్ట్రాబెర్రీ

స్ట్రాబెర్రీ

లక్షణాలు

మొక్క కుళ్లిపోయేటట్టు చేసే ఈ వ్యాధి వల్ల మొక్క యొక్క అన్ని భాగాలు ప్రభావితమవుతాయి. కుళ్ళిన పండ్లు మరియు వేర్ల దగ్గర మరియు పైన రంగు మారిన కణజాలం ఈ వ్యాధి యొక్క అత్యంత స్పష్టమైన లక్షణాలు. దీనిని 'క్రౌన్ రాట్' అని కూడా పిలుస్తారు. మొక్క పైభాగానికి ఈ వ్యాధి సోకినప్పుడు, మొక్క మొత్తం వాడిపోవచ్చు. వ్యాధి సోకిన మొక్క పైభాగాన్ని ఓపెన్ చేయడం ద్వారా మీరు రంగు మారడాన్ని చూడవచ్చు. పక్వానికి వచ్చిన పండ్లపై నీటిలో తడిచినట్టు ఉన్న లేత గోధుమరంగు మచ్చలు ఏర్పడడంతో పండ్లు కుళ్లిపోవడం మొదలవుతుంది ఇవి ముదురు గోధుమరంగు లేదా నలుపు రంగులోకి లోకి మారుతాయి. తేమతో కూడిన పరిస్థితులలో, పండ్ల గాయాల నుండి నారింజ రంగు ద్రవం స్రవించవచ్చు. మొగ్గలు మరియు పువ్వులపై నలుపు రంగు గాయాలు మరి యు పువ్వులు ఎండిపోవడం తెగులు సంక్రమణ యొక్క ప్రారంభ సంకేతం. ఆకులపై కూడా నల్లటి మచ్చలు ఏర్పడి ఆకులకు నష్టాలను కలిగి ఉండవచ్చు,

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

వ్యాధిని నియంత్రిస్తుందని స్పష్టంగా చెప్పే ఉత్పత్తుల కోసం చూడండి. ఇవి సహాయక బ్యాక్టీరియా లేదా శిలీంధ్రాల నుండి తయారుచేయబడతాయి. వ్యాధి ప్రారంభమయ్యే ముందు ఉపయోగించినప్పుడు ఈ ఉత్పత్తులు ఉత్తమంగా పని చేస్తాయి. సేంద్రీయ పదార్థాలను మైంటైన్ చేయడం మరియు/లేదా జోడించడం మరియు మునుపటి సంవత్సరం పంట యొక్క మొక్కల అవశేషాలను తొలగించడం ద్వారా మీ మట్టిని ఆరోగ్యంగా ఉంచండి. ఒక ఆరోగ్యకరమైన నేల అనేక సహాయక జీవులను కలిగి ఉండవచ్చు, ఇవి మట్టి ద్వారా సంక్రమించే వ్యాధికారకాలు వ్యాప్తి చెందకుండా ఆపుతాయి.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే జీవ చికిత్సలతో పాటు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. మొక్కలు పుష్పించే దశలో ఉన్నప్పుడు పిచికారీ చేయడం చాలా ముఖ్యం. చికిత్స చేసే ముందు మీరు పండ్లపై లక్షణాలను చూసే వరకు వేచి ఉండకండి. ప్రభుత్వం ఆమోదించిన శిలీంద్ర నాశినులను మాత్రమే వాడండి. అత్యంత ప్రభావవంతమైన శిలీంద్ర నాశినులకు పక్షి కన్ను తెగులు నిరోధకతను కలగకుండా ఆపడానికి మీరు ఉపయోగించే శిలీంద్ర నాశిని రకాన్ని మార్చండి. మీరు ఎంచుకున్న శిలీంద్ర నాశిని ప్యాకింగ్ పై ఉన్న లేబుల్‌ని చదవండి మరియు అవి ఎలా పని చేస్తాయో మీరు అర్థం చేసుకున్నారని నిర్ధారించుకోండి మరియు వాటిని ఉపయోగించడం కోసం సూచనలు మరియు నియమాలను అనుసరించండి. కొన్ని శిలీంద్ర నాశినుల లేబుల్స్ పై వాటిని నాట్లు వేసే దశలో డ్రిప్ అప్లికేషన్‌ల కోసం ఉపయోగించవచ్చని కూడా పేర్కొనవచ్చు, ఇది మీ పంటకు మరింత రక్షణను అందిస్తుంది.

దీనికి కారణమేమిటి?

పక్షి కన్ను తెగులు అనేది ఫంగల్ వ్యాధి మరియు స్ట్రాబెర్రీలకు అత్యంత హానికరమైన వ్యాధి. ఇది మొక్కలు పెరిగే కాలంలో మరియు పంట కోత తర్వాత చ్చాలా నష్టం కలుగచేస్తుంది. సాధారణంగా ఈ వ్యాధి కొత్త స్ట్రాబెర్రీ నారు ద్వారా పొలాల్లోకి ప్రవేశిస్తుంది. కానీ అది పెరగడానికి అనుకూలంగా ఉండే వరకు ఎటువంటి సంకేతాలు కనిపించవు. వ్యాధికారక క్రిమి పంట నారు మొక్కలలో ఉండవచ్చు కానీ అది పెరగడానికి ఉష్ణోగ్రత మరియు తేమ అనుకూలంగా ఉండేవరకు ఎటువంటి సంకేతాలు కనిపించవు. వెచ్చని మరియు తేమతో కూడిన వాతావరణం ఉన్నప్పుడు వ్యాధి బాగా వృద్ధి చెందుతుంది. వర్షపు చుక్కలు భూమిని తాకినప్పుడు అవి నేల కణాలను గాలిలోకి నెట్టి వ్యాధిని వ్యాపింపచేస్తాయి. వ్యాధికారకం భూమిలో మరియు మొక్కల ఆశేషాలలో తొమ్మిది నెలల వరకు జీవించి ఉండగలదని మరియు పొలానికి సమీపంలో పెరుగుతున్న కలుపు మొక్కలకు సోకుతుందని కూడా రిపోర్ట్ చేయబడింది. పొలం గుండా యంత్రాలు మరియు వ్యక్తుల కదలిక కూడా వ్యాధిని వ్యాప్తి చేస్తుంది.


నివారణా చర్యలు

  • ఆరోగ్యంగా ఉన్న నారును ఉపయోగించండి మరియు మంచి సాగు పద్ధతులను అనుసరించండి.
  • ఎందుకంటే మీ నారు నిజంగా వ్యాధి-రహితంగా ఉందో లేదో తెలుసుకోవడం కొన్నిసార్లు కష్టం.
  • పంట చుట్టూ గాలి ప్రసరించేలా మరియు నర్సరీలో మరియు పొలంలో పండ్లు త్వరగా ఆరిపోయేలా సాగు పద్ధతులను ఉపయోగించండి.
  • నీటి బిందువుల ద్వారా వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి బహిర్గతమైన మట్టిని గడ్డి రక్షక కవచంతో కప్పండి.
  • వ్యాధి వ్యాప్తికి అనుకూలంగా ఉండే ప్లాస్టిక్ మల్చ్‌లను వాడకండి.
  • పైనుండి నీరు పెట్టడానికి బదులుగా క్రిందనుండి నీరు పెట్టండి లేదా బిందు సేద్యం పద్ధతిని ఉపయోగించండి.
  • మొక్కలు వికసించినప్పుడు మరియు వాతావరణ పరిస్థితులు వ్యాధికి అనుకూలంగా ఉంటే పక్షి కన్ను తెగులు సోకకుండా చూడడానికి దీనికి వ్యతిరేకంగా పనిచేసే సంప్రదాయ లేదా సేంద్రీయ శిలీంద్ర నాశినులను ఉపయోగించండి.
  • ఎటువంటి లక్షణాలు కనిపించనప్పటికీ, వ్యాధి వృద్ధి చెందకుండా ఈ శిలీంద్ర నాశినులను ఉపయోగిస్తారు.
  • పాత మొక్కల వ్యర్థాలు లేని మట్టిలో మొక్కలను నాటండి మరియు నేలను ఆరోగ్యంగా ఉంచడానికి కొత్త సేంద్రియ పదార్థాన్ని జోడించండి.
  • మట్టిలో వ్యాధి లేకుండా ఉందని నిర్ధారించుకోవడానికి, మీరు మట్టికి ఫ్యుమిగేషన్ లేదా సూర్యరశ్మితో మట్టిని వేడి చేయడం(సోలరైజేషన్) వంటి పద్ధతులను ఉపయోగించవచ్చు.
  • క్రమం తప్పకుండా పొలంలో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి