Pseudocercospora punicae
శీలీంధ్రం
పువ్వు గుత్తులపై మొదటిసారి లక్షణాలు గుర్తించవచ్చు. సన్నటి, వృత్తాకార మరియు గోధుమ రంగు నుంచి నల్ల రంగుకు మారిన మచ్చలు కనిపిస్తాయి. మచ్చలు తరువాత విస్తరించి, దగ్గరకు చేరి, ముదురు రంగులోకి మారుతాయి. మచ్చలు క్రమ రహితంగా మారి 1 మిల్లీ మీటర్ నుండి 12 మిల్లీ మీటర్ల పరిమాణాన్ని చేరుతాయి. బ్యాక్టీరియా తెగులు సమయంలో పండు మీద మచ్చలు గాయాలను పోలి ఉండడం అవి పగుళ్లు లేకుండా, అతుక్కోకుండా ముదురు నలుపు రంగులో వివిధ పరిమాణాల్లో గమనించబడింది. ఆకుల మీద మచ్చలు చెల్లాచెదురుగా, వృత్తాకార లేదా క్రమరహిత ముదురు ఎర్రటి గోధుమ రంగులో నుండి దాదాపుగా నల్లగా మారినటువంటి పసుపు రంగు అంచుతో ఉంటాయి. మచ్చలు 0.5 నుండి 5 మి.మీ వ్యాసంలో ఉంటాయి మరియు ఒకదానితో మరొకటి కలవవు. మచ్చలు సోకిన ఆకులు పాలిపోయిన ఆకుపచ్చ రంగులో వుండి, పసుపు రంగులోకి మారి రాలిపోతాయి. కొమ్మల మీద నల్ల మచ్చల మరొక లక్షణం కొమ్మలు ఫ్లాట్ గా మారడం మరియు ఉబ్బిన అంచుతో నొక్కుకుపోతాయి. తెగులుకు గురైన కొమ్మలు ఎండిపోయి చనిపోతాయి.
క్షమించాలి ఈ వ్యాధికి మేము ఎటువంటి నివారణ పద్దతిని కనుగొనలేక పోయాము. మీకు ఏమైనా తెలిసినట్లైతే దయచేసి మమల్ని సంప్రదించండి.
అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఆర్థిక పరిమితిని చేరుకున్నట్లయితే, నియంత్రణ చర్యలను ప్రవేశపెట్టాలి. పండ్లు ఏర్పడిన తరువాత 15 రోజుల విరామంతో రెండు మూడు సార్లు శిలీంద్ర నాశినులను పిచికారీ చేసినట్లయితే వ్యాధికి మంచి నియంత్రణను ఇస్తాయి. మాంకోజెబ్, కోనజోల్ లేదా కిటాజిన్ క్రియాశీల పదార్థాలుగా ఉంటాయి. దానిమ్మ కోసం అసలు రిజిస్ట్రేషన్‌తో శిలీంద్రనాశకాలను మాత్రమే పిచికారీ చేయండి. సిఫార్స్ చేసిన సాంద్రతలను అనుసరించడం మరియు ప్రతిఘటనలను నివారించడానికి వివిధ రకాల చర్యలతో శిలీంద్రనాశకాలను ఉపయోగించడం చాలా ముఖ్యం. నిరీక్షణ కాలాన్ని గౌరవించడం కూడా చాలా ముఖ్యం.
స్యుడోసెర్కోస్పోరా పునికే అనే ఫంగస్ వల్ల లక్షణాలు ఏర్పడతాయి. ఇది మొక్కల అవశేషాల్లో మరియు మొక్క యొక్క తెగులు సోకిన కాండం భాగాలలో జీవించి ఉండగలదు. ఇది గాలి ద్వారా వచ్చే బీజాంశాల ద్వారా వ్యాపిస్తుంది. వర్షం మరియు అధికంగా నీరు ఇంకిన నేల ఈ తెగులు ఆవిర్భావానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి తేమ మరియు వర్షపు పరిస్థితులలో సంక్రమణ ప్రక్రియ మరియు వ్యాధి వ్యాప్తి వేగంగా ఉంటాయి. ఆకు మచ్చలు పరోక్షంగా దిగుబడిని తగ్గిస్తాయి. కిరణజన్య సంయోగక్రియకు శక్తినిచ్చే ప్రాంతాన్ని ఇవి తగ్గిస్తాయి. తెగులు సోకిన ఆకులను టీ ఉత్పత్తికి లేదా మరి దేనికీ కూడా అమ్మలేము. పండ్ల పైన మచ్చలు ఉత్పత్తి యొక్క ఆర్ధిక నష్టానికి కారణమవుతాయి. తెగులు సోకిన పండ్లను కూడా అమ్మలేము.