Sporisorium sorghi
శీలీంధ్రం
జొన్న గింజలు శంఖాకారం లేదా కోలాకారపు ఆకారంలో బీజాంశం ఉత్పత్తి చేసే నిర్మాణాలతో భర్తీ కాబడతాయి, వీటిని స్మట్ సోరి అని పిలుస్తారు. ఇవి నిరంతర పూతతో కప్పబడి ఉంటాయి మరియు వాటి పరిమాణాన్ని బట్టి గ్లూమ్స్ తో 1 సెం.మీ కంటే ఎక్కువ పొడవు వరకు కప్పవచ్చు. గ్లూమ్స్ సాధారణ రంగులోనే కనిపిస్తాయి. చాలా సోరిలు శంఖాకారం లేదా కోల ఆకారంలో ఉంటాయి మరియు పొడవైన జొన్నగింజ లాగా కనిపిస్తాయి. ఈ సోరి తెల్లగా బూడిద రంగు లేదా గోధుమ రంగులో ఉంటుంది, కొన్నిసార్లు చారలతో కప్పబడి ఉంటుంది. చాలా సందర్భాలలో, తలలు పాక్షికంగా మాత్రమే వీటి ప్రభావానికి లోనవుతాయి. కొన్ని సందర్భాల్లో, వంకరగా వున్న వక్రీకృత కేంద్ర కాండం మాత్రమే సోరీతో కప్పబడి ఉండి కంకుల కొమ్మలు పూర్తిగా నాశనం కావచ్చు.,
ప్రస్తుతం ఈ తెగులుకు ఎటువంటి జీవ చికిత్స అందుబాటులో లేదు. మీకు ఏమైనా తెలిసినట్లైతే మమ్మల్ని సంప్రదించండి.
అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ తెగులును అణిచివేయడానికి కార్బాక్సిన్ (2 గ్రా / 1 కిలోల విత్తనాలు) తో విత్తన శుద్ధి సిఫార్స్ చేయబడింది. ప్రొపికోనజోల్, మనేబ్ లేదా మాంకోజెబ్ కలిగిన ఆకు పిచికారీ కూడా క్షేత్ర అధ్యయనాలలో సంతృప్తికరమైన ఫలితాలను ఇచ్చాయి.
స్మట్ సోకిన గింజను నాటినప్పుడు, విశ్రాంతి బీజాంశం విత్తనంతో పాటు మొలకెత్తి విత్తనాల లోపల అభివృద్ధి చెందుతుంది మరియు ఇన్ఫెక్షన్ ప్రక్రియను మరింత దిగజార్చే బీజాంశాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ బీజాంశాలు గాలి ద్వారా ఇతర మొక్కలకు వ్యాపిస్తాయి. అక్కడ అవి మొలకెత్తుతాయి మరియు మొక్కల లోపల వ్యవస్థాత్మకంగా వ్యాపించే శిలీంధ్ర పెరుగుదలను ఉత్పత్తి చేస్తాయి. మొదటి లక్షణాలు పూత (శీర్షిక) ఏర్పడేటప్పుడు కనిపిస్తాయి. ఆ సమయంలో, శిలీంధ్ర నిర్మాణాలు క్రమంగా గింజలను భర్తీ చేయడమే కాక వాటి చుట్టూ ఒక పొర పెరుగుతుంది. పరిపక్వత సమయంలో, ఈ పొర ఇతర గింజలను లేదా మట్టిని కలుషితం చేసే కొత్త బీజాంశాలను విడుదల చేస్తుంది. 30°C ఉష్ణోగ్రత బీజాంశం అంకురోత్పత్తి మరియు మొక్క యొక్క సంక్రమణకు అనుకూలంగా ఉంటుంది.