ఇతరములు

జొన్నలో లాంగ్ స్మట్

Tolyposporium ehrenbergii

శీలీంధ్రం

క్లుప్తంగా

  • క్రీమీ గోధుమ రంగులో సుమారుగా స్థూపాకారంలో కొద్దిగా వంగినట్టువున్న "స్మట్ సోరి" కంకి పైన చెల్లాచెదురుగా విస్తరించి ఉంటుంది.
  • ఈ సోరి పగిలి నల్లని బీజాంశాలను వదులుతుంది.
  • 8 నుండి 10 కట్టల ముదురు గోధుమ రంగు ఫిలమెంట్లు బహిర్గతమౌతాయి.

లో కూడా చూడవచ్చు


ఇతరములు

లక్షణాలు

ఈ తెగులు కొన్ని పుష్ప గుచ్చాలకు మాత్రమే పరిమితమై ఉంటుంది. ఇవి "స్మట్ సోరి" గా రూపంతరం చెంది కంకి పైభాగంలో చెల్లాచెదురుగా విస్తరిస్తాయి. ఈ సోరి పొడవుగా ఉండి, సుమారుగా స్థూపాకారంలో కొద్దిగా వంగినట్టువున్న ఫంగస్ నిర్మాణంగా ఉంటుంది. ఇవి క్రీమీ గోధుమ రంగు పొరతో కప్పబడి ఉంటాయి. ప్రతి సోరస్ పైభాగంలో చీలి ఉండి నల్లని బీజాంశాలను విడుదల చేసి ఈ తెగులును మరింతగా విస్తరింప చేస్తాయి. 8 నుండి 10 కట్టల ముదురు గోధుమ రంగు ఫిలమెంట్లు ఈ నిర్మాణాలలో కనిపిస్తాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

సేంద్రియ పాదరసపు సమ్మేళనాలు వుపయోగించి విత్తన శుద్ధి చేయడం ద్వారా ఈ తెగులు వ్యాప్తి చెందకుండా చేయడం సిఫార్స్ చేయబడినది.

రసాయన నియంత్రణ

ఈ తెగులును నియంత్రించడానికి ఎటువంటి రసాయనాలు అందుబాటులో లేవు. మీకు ఏమైనా తెలిస్తే మమల్ని సంప్రదించండి.

దీనికి కారణమేమిటి?

ఈ లక్షణాలు టోలిఫాస్ఫోరియం ఎన్ఱేన్బెర్గి అనే ఫంగస్ వలన కలుగుతాయి. దీని బీజాంశాలు ఒకదానితో ఇంకొకటి అతుక్కుని బంతుల అదికారంలోకి మారతాయి. దీనివలన ఇవి చాలా సంవత్సరాలవరకు మట్టిలో జీవించి ఉంటాయి. ఈ బీజాంశాలు జొన్న విత్తనాలకు అంటుకుని మొదటగా తెగులును సంక్రమింపచేస్తాయి. లక్షణాలు ముందుగా జొన్న బూటింగ్ దశలో బయటపడతాయి. ఈ సమయంతో విశ్రాంతి దశలో వున్న బీజాంశాలు పుష్పగుచ్చాలలో అంకురోత్పత్తి చెంది మరిన్ని బీజాంశాలను ఉత్పత్తి చేస్తాయి. ఇవి గాలి ద్వారా మరింతగా విస్తరించి ఇతర మొక్కలకు వ్యాపిస్తాయి. గాలి ద్వారా వ్యాపించే బీజాంశాలు ఆకు పైపొరపై స్థిరపడి ఆకుపైన వుండే నీటి బిందువులలో అంకురోత్పత్తి చెంది తెరిచి వున్న పుష్పగుచ్చాలలోకి చేరి సీజన్ తరువాత సమయంలో అక్కడ ఈ తెగులును సంక్రమింప చేస్తాయి.


నివారణా చర్యలు

  • ఆరోగ్యకరమైన విత్తనాలను మాత్రమే వాడండి.
  • చాలా రకాల తెగులు నిరోధకత కలిగిన రకాలు అందుబాటులో వున్నాయి.
  • వీటిని మాత్రమే ఉపయోగించండి.
  • తెగులు సోకిన గింజలు మరియు మొక్కల పదార్ధాలను వెంటనే తొలగించండి.
  • రెండు నుండి మూడు సంవత్సరాలకు ఒకసారి పంట మార్పిడి చేయండి.
  • T.
  • ఎహ్రేంబెర్గి అంకురోత్పత్తి చెందే సమయంలో గాలి ద్వారా వ్యాపించే బీజాంశాలు పంటకు సంక్రమించకుండా ఉండడానికి సీజన్లో ముందుగా పంటను వేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి