నిమ్మజాతి

నల్ల బూజు తెగులు(సూటీ మోల్డ్)

Pezizomycotina

శీలీంధ్రం

క్లుప్తంగా

  • పండ్లపై ముదురు బూడిద రంగు నుండి నల్లటి బూజు ఏర్పడుతుంది.
  • ఆకులు, కొమ్మలు, రెమ్మలు మరియు కాండములు కూడా దీని ప్రభావానికి గురికావచ్చు.
  • ఆకులు చనిపోయి రాలిపోవచ్చు.

లో కూడా చూడవచ్చు

27 పంటలు
ఆపిల్
అరటి
చిక్కుడు
కాకరకాయ
మరిన్ని

నిమ్మజాతి

లక్షణాలు

ఈ నల్ల బూజు తెగులు మామిడి చెట్లపై కనిపిస్తుంది మరియు ఇంతకు ముందు పురుగులు తిన్న ఇతర చెట్లపై కూడా కనిపిస్తుంది. ఇది ఇతర కీటకాలు ఉత్పత్తి చేసే తీయని పంచదార ద్రవం లాంటి తేనె బంక( హనీ డ్యూ)పై పెరుగుతుంది. ఇలా దీనిని ఆహారంగా తీసుకుంటూ, ఇది మొత్తం చెట్టును అనేక రకాల నల్లని షేడ్స్ లోనికి మారుస్తూ, ఇది ప్రభావిత చెట్టు భాగం మొత్తం విస్తరిస్తుంది. ఇవి ఇతర క్రిములను ఆశించని ఇతర తెగుళ్లను వ్యాపింపచేయని ఒకరకమైన ఫంగస్. అందువలన ఇవి మొక్కల కణజాలాన్ని ఆక్రమించవు మరియు ఎటువంటి ఇతర లక్షణాలను కలగచేయవు. కానీ మొక్కలలో కిరణ్య జన్య సంయోగక్రియను మరియు వాతావరణంలోని వాయువులను మార్పిడి చేయడాన్ని అడ్డుకుంటాయి. ఈ తెగులు బాగా తీవ్రమైతే ఆకులు చనిపోవడం లేదా రాలిపోవడం జరుగుతుంది. దీనివలన మొక్కలలో ఎదుగుదల తగ్గడం మరియు మనుగడ లేకపోవడం జరుగుతుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

విస్తృత పరిధి కలిగిన సేంద్రియ పదార్ధమైన (బ్రాడ్ స్పెక్ట్రమ్) వేప నూనెను తెల్ల దోమలు, అఫిడ్స్, పొలుసు పురుగులు, చీమలు మరియు పిండి నల్లులపైనా ప్రయోగించవచ్చు. ఈ వేప నూనె ఫంగస్ ను పెరగకుండా చేస్తుంది. కీటక నాసిన సబ్బులు లేదా వంట పాత్రలు తోమే సబ్బులు ( 5 లీటర్ల నీటికి ఒక టేబుల్ స్పూన్) ఈ తెగులు సోకిన చెట్లపై పిచికారీ చేయవచ్చు. ఈ సబ్బు ద్రావణం చెట్లపైన పిచికారీ చేసిన కొంత సేపటి తర్వాత దీనిని తుడిచివేస్తే ఈ నల్ల బూజు కూడా తొలగిపోతుంది.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవసంబంధమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. మలాథియాన్ వంటి ఆర్గానోఫాస్ఫేట్ కుటుంబజాతికి చెందిన కృత్రిమ కీటక నాశినులు వాడి కీటకాలు మామిడి చెట్లను ఆశించకుండా చేయొచ్చు.

దీనికి కారణమేమిటి?

ఆకులను ఆశించే పురుగులు( అమ్రితోడుస్ అట్కిన్సోని) నాళాలను తినే పురుగులు తెల్ల ఈగలు, అఫిడ్స్ మరియు అనేక ఇతర రకాల పురుగులు ఈ తెగులుతో ముడిపడి ఉంటాయి. ఈ పురుగులు మొక్కలను తినే సమయంలో మొక్కలపైన తేనె బంక( హనీ డ్యూ)ను విసర్జిస్తాయి. దీనివలన నల్ల బూజు తెగులు ఎదగడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఈ తేనె బంక కింద పడుతున్నప్పుడు పక్కన వున్న మొక్కలు మరియు ఆకులపైనా పడడం వలన ఈ తెగులు ఇతర మొక్కలకు కూడా వ్యాపిస్తుంది. ఈ ఫంగస్ బూజులాగా కానీ బీజాంశాలుగా కానీ మొక్కలపై, వ్యవసాయ పరికరాలపై మరియు రవాణాకు ఉపయోగించే వాహనాలపై జీవిస్తుంది. కీటకాలు కూడా ఈ బూజును ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకు వ్యాపింపచేస్తాయి. ఉదాహరణకు చీమలు వాటి సొంత ప్రయోజనాలకోసం ఈ బూజును రక్షిస్తాయి.


నివారణా చర్యలు

  • మొక్కల మధ్య దూరం ఎక్కువగా ఉండేలా చూడండి మరియు సరిపడినంత సూర్యరశ్మి మొక్కలకు అందేటట్టు చూడండి.
  • చీమలను మరియు మొక్కల కణద్రవ్యాన్ని పీల్చే కీటకాలను నివారించడానికి ఇవి మరియు మొక్కలను చేరుకోకుండా, చెట్లు లేదా మొక్కల చుట్టూ భౌతిక అవరోధాలను నిర్మించండి.
  • మొక్కలకు సరిపడినంత ఎరువులు మరియు నీరు అందించి మొక్కల నాళాలను తినే పరాన్నజీవులు చెట్లను ఆశించకుండా చెట్ల యొక్క సరైన సహజ నిరోధకతను పెంచండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి