వేరుశనగ

నల్ల బూజు

Aspergillus niger

శీలీంధ్రం

క్లుప్తంగా

  • మొక్కలపై నల్లటి బూజు ఏర్పడుతుంది.
  • నీటిలో నీటితో తడిచినట్టు వున్న పొలుసులు ఏర్పడతాయి.
  • ఈనెల వెంబడి చారలు ఏర్పడతాయి.
  • విత్తనం మరియు కాలర్ తెగులు లక్షణాలు కనిపిస్తాయి.

లో కూడా చూడవచ్చు


వేరుశనగ

లక్షణాలు

విత్తనాలు మొలకెత్తకుండా కుళ్ళిపోతాయి ఒకవేళ అంకురోత్పత్తి జరిగితే, కాలర్ ప్రాంతం నీటిలో నానినట్టున్న మచ్చలతో కుళ్లిపోతాయి. దెబ్బతిన్న మొక్క భాగాలు నీటిలో ఉబ్బిన గాయాలను కూడా చూపుతాయి. ప్రభావిత పంటను బట్టి లక్షణాలు మారుతూ ఉంటాయి. ఉల్లిలో, మొలకెత్తే ప్రారంభంలో మొలకల కాలర్ ప్రాంతంలో కుళ్ళిపోతాయి. కండగల ఉల్లి పాయ కణజాలం యొక్క ఈనెల వెంట నల్లని బూజు పెరుగుతుంది. వేరుశెనగలో, ఫంగస్ కాలర్ లేదా క్రౌన్ తెగులుకు కారణమవుతుంది, ఇది వేర్లు మెలికెలు తిరిగిపోయి మొక్క పై భాగం వైకల్యం చెంది ఉంటుంది. తీగలలో, ప్రారంభ లక్షణాలలో తెగులు సోకిన ప్రాంతంలో ఎర్రటి ద్రవం యొక్క సూది మొన చుక్కలు ఉంటాయి. పంటకోత తర్వాత కుళ్లిపోవడం ఫలితంగా రంగు పోవడం, నాణ్యత క్షీణించడం మరియు వివిధ పంటల వాణిజ్య విలువ తగ్గడం జరుగుతుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

ట్రైకోడెర్మా (పొలం పెంటలో సమృద్ధిగా కలిపి) తో మట్టిని బాగా తడపండి. వేప చెక్క యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది మరియు ఏ. నైగర్ వ్యాప్తిని నియంత్రించడానికి కూడా ఉపయోగించవచ్చు. విత్తనాలను నాటడానికి ముందు వేడి నీటితో 60°C వద్ద 60 నిమిషాలు చికిత్స చేయండి. ఫెనోలిక్ సమ్మేళనాలు ఉండటం వల్ల ఎరుపు పొర ఆకులు కలిగిన ఉల్లిపాయ రకాలు యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటాయి.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. శిలీంద్ర నాశినులు అవసరమైతే, మాంకోజెబ్ తో స్థానికంగా బాగా తడపడం లేదా మాంకోజెబ్ ను కార్బెండజిన్ తో కలిపి ఉపయోగించండి, ప్రత్యామ్నాయంగా తిరామ్ కూడా వాడవచ్చు. ఇతర సాధారణ చికిత్సలలో ట్రయాజోల్ మరియు ఎచినోకాండిన్ వంటి యాంటీ ఫంగల్ మందులు ఉన్నాయి.

దీనికి కారణమేమిటి?

నల్ల బూజు అనేది ఒక సాధారణ ఫంగస్, ఇది వివిధ రకాల పిండి పదార్థపు పండ్లు మరియు కూరగాయలపై కనిపిస్తుంది. దీనివలన ఆహారం చెడిపోవడం మరియు క్షీణించడం జరుగుతుంది. అస్పెర్‌గిల్లస్ నైగర్ అనే ఫంగస్ గాలి, నేల మరియు నీటి ద్వారా వ్యాపిస్తుంది. సాధారణంగా ఇది ఒక సాప్రోఫైట్, చనిపోయిన మరియు కుళ్లుతున్న పదార్థంపై జీవిస్తుంది కానీ ఆరోగ్యంగా వున్న మొక్కలపై కూడా జీవించగలదు.ఈ ఫంగస్ మధ్యధరా, ఉష్ణమండల మరియు ఉప ఉష్ణమండల ప్రాంతాలలో ఒక సాధారణ మట్టిలో జీవించి ఉంటుంది. 37°C ఉష్ణోగ్రత వద్ద ఇది బాగా పెరుగుతుంది. 20 - 40°C మధ్య ఉష్ణోగ్రతలు దీనికి అనుకూలం. అలాగే, పండ్లు ఎండబెట్టే ప్రక్రియలో తేమ తగ్గి చక్కెర శాతం పెరుగుతుంది, దీని ఫలితంగా ఫంగస్ యొక్క పొడివాతావరణంలో పెరిగే బూజుకు అనుకూలమైన మాధ్యమం లభిస్తుంది.


నివారణా చర్యలు

  • మంచి డ్రైనేజ్ సౌకర్యం వున్న భూమిని ఎంచుకోండి.
  • విత్తనం బీజాంశాలను కలిగిలేదని మరియు అంటు మొక్కలు ఆరోగ్యంగా ఉన్నాయని నిర్ధారించుకోండి.
  • ఎర్రటి పొర ఆకులు కలిగిన ఉల్లి వంటి నిరోధక రకాలను ఉపయోగించండి.
  • తడి వాతావరణంలో పంటను కోయవద్దు.
  • రవాణా సమయంలో, అలాగే ఉల్లిపాయలు గోడౌన్ లో పెడుతున్నప్పుడు మరియు బైటకి తీసుకు వచ్చేటప్పుడు స్థిరమైన ఉష్ణోగ్రతలు మరియు తక్కువ తేమ వుండేటట్టు జాగ్రత్తలు తీసుకోండి.
  • పంట కోత తర్వాత పంట అవశేషాలను తొలగించి కాల్చివేయండి.
  • పంటకోత తర్వాత, నిల్వ మరియు మార్కెటింగ్ చేసే ముందు కాయలను జాగ్రత్తగా ఆరబెట్టండి.
  • వేడి వాతావరణంలో, 80% కంటే తక్కువ తేమ ఉందని నిర్ధారించుకోండి.
  • 2-3 సంవత్సరాలకు ఒకసారి పంట మార్పిడి చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి