Tilletia tritici
శీలీంధ్రం
పుష్పాలు ఫలదీకరణం చెందిన వెంటనే ఈ తెగులు లక్షణాలు బైట పడతాయి. తెగులు సోకిన కంకులు క ముదురు ఆకుపచ్చ రంగులో జిగురుగా కనిపిస్తాయి. గింజల పైపొట్టు పాడవదు కానీ లోపల మాత్రం నల్లని పౌడర్ వంటి పదార్ధంతో( బంట్ బాల్) గింజ నిండిపోయి ఉంటుంది. ఈ గింజలు యధావిధిగా అదే ఆకారం మరియు పరిమాణంలో ఉంటాయి, కాని బూడిద రంగు-ఊదా రంగులో ఉంటాయి. వీటిని నొక్కినప్పుడు ఇవి కుళ్ళిపోయిన చేప వాసనతో నల్లటి బీజాంశములు బహిర్గతం అవుతాయి. తెగులు సోకిన గోధుమ మొక్కలు కొన్నిసార్లు ఆరోగ్యకరమైన మొక్కలు కంటే కొద్దిగా ఎత్తు తక్కువగా ఉండవచ్చు. వీటి తలలపై చిన్న పరిమాణంలో ఈనెలు ఉంటాయి లేకపోతే అసలు ఏమీ ఉండకపోవచ్చు. సాధారణంగా కంకి యొక్క అన్ని గింజలు ప్రభావితం అవుతాయి. కానీ ఒక మొక్క మీది అన్ని కంకులకు ఈ తెగులు సోకకపోవచ్చు.
వెన్న తీసిన పాలపొడి, గోధుమ పిండి లేదా నీరు కలిపిన సముద్రపు పాచి పొడి తో(సీవీడ్) పొలాలను శుద్ధి చేయడం వలన దాదాపు పూర్తిగా టి. కారీస్ ను తొలగించవచ్చు. విత్తనాలను వేసేముందు 2 గంటల పాటు వెచ్చని నీటితో (45°C) తో విత్తన శుద్ధి చేయడం వలన స్పోర్స్ తొలగించబడతాయి.
వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. అంటు మరియు శిలీంద్రనాశకాలు (లోపలికి వెళ్లి మరియు వృద్ధి చెందుతున్న విత్తనాల లోపలికి వెళ్లడం)ఉదాహరణకు టేబుకనజోల్, బెంజిమిడజోల్స్, ఫెనైల్పైరోల్స్, మరియు ట్రయజోల్స్ అనేవి టి.కారీస్ నుండి గింజలను ప్రభావవంతంగా రక్షిస్తాయి.
రెండు సంవత్సరాల వరకు మట్టిలో నిద్రాణమై వుండి బీజాంశమును అంటి పెట్టుకొని వుండే ఈ బూజు తెగులు తెలిట్టియా వలన ఈ లక్షణాలు కలుగుతాయి. బీజాంశములు నేలలో జీవిస్తున్న ప్రాంతాలలో, చాలా వ్యాధులు కేవలం అంకురోత్పత్తి తర్వాత, మొక్కల అంకురోత్పత్తి దశలో పుడతాయి. ఈ ఫంగస్ కూడా లేత గోధుమ రెమ్మలకు, మట్టిలోనుండి బైటకు వచ్చిన వెంటనే, తెగులు సోకిన వెంట్రుకల ద్వారా సోకుతుంది. మొక్క క్రమముగా ఎదిగే కొలదీ ఇవి మొక్కల అంతర్గత కణజాలములను నివాసాలుగా చేసుకుంటాయి. చివరకు ఇవి పుష్పములు మరియు ధాన్యాల వద్దకు కొన్ని తెగులు సోకిన గోధుమ కంకులు పంటకోత సమయంలో పగిలి బయటకు వస్తాయి. మరియు అవి గాలిచే కొట్టుకొనిపోయి నేల పైకి వచ్చి మరల ఒక కొత్త జీవిత చక్రాన్ని మొదలుపెడతాయి. మిగిలిన గింజలు కోతల తర్వాత తరువాత సీజన్లో ఈ తెగులుకు వాహకాలుగా పనిచేస్తాయి. ఈ బీజాలు అంకురోత్పత్తి చెందడానికి 5 నుండి 15°C మట్టి ఉష్ణోగ్రత అనుకూలంగా ఉంటుంది.