Magnaporthe oryzae
శీలీంధ్రం
నేలకు పైనవుండే అన్ని మొక్కల భాగాలు ఈ తెగులు ప్రభావానికి గురవుతాయి. కానీ ముందుగా కంకులు పాలిపోవడం దీని అతి ముఖ్యమైన లక్షణం. రైతులకు చర్యలు తీసుకునే సమయం ఇవ్వకుండా చాలా కొద్దీ రోజుల వ్యవధిలోనే ఈ చీడ దిగుబడిని ప్రభావితం చేయగలదు. పుష్పించే దశల్లో ఈ తెగులు సంక్రమించడం వలన గింజలు ఏర్పడవు. కానీ గింజ పాలుపోసుకునే దశల్లో ఈ తెగులు సోకితే చిన్న పరిమాణంలో ముడుతలు పడిన రంగు కోల్పోయిన గింజలు తయారవుతాయి. ముదురు ఆకులపైన రెండు రకాల మచ్చలు కనపడతాయి: తెగులు తీవ్రత తక్కువగా వున్నప్పుడు నల్లని చుక్కలు మరియు బూడిద రంగు మధ్య భాగంతో చుట్టూ ముదురు అంచుతో పెద్ద కన్ను ఆకారపు మచ్చలు ఏర్పడతాయి. ఈ తెగులు తీవ్రత అధికంగా వున్నప్పుడు ఆకులపైన నల్లని చుక్కలు మరియు నల్లని అంచులతో కూడిన చిన్న గోధుమ రంగు చుక్కలు మరియు కొన్ని సార్లు పాలిపోయిన వృత్తాకారం ఏర్పడతాయి. కంకులపైన లక్షణాలు ఫుసారియం హెడ్ బ్లెయిట్ ను పోలి ఉంటాయి.
ఈ M. ఒరిజై ను నియంత్రించడానికి ఎటువంటి జీవన నియంత్రణ అందుబాటులో ఉన్నట్టు ఆధారాలు లేవు. కానీ వరిలో విత్తన చికిత్స మరియు స్యుడోమోనాస్ ఫ్లోరెసెన్స్ కలిగిన మందులను ఆకులపైన పిచికారీ చేయడం వలన ఈ తెగులు ప్రభావవంతంగా నియంత్రించబడి దిగుబడి పెరుగుతుంది.
వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. పుష్పించే దశల్లో లేదా గింజ పాలుపోసుకునే దశల్లో వాతావరణంలో అధికంగా మంచు, వర్షం లేదా ఆవిరి వున్నప్పుడు ఈ తెగులు సంక్రమించే అవకాశం అధికంగా ఉంటుంది. నివారణ చర్యగా శీలింద్ర నాశినులను వాడే సమయంలో వాతావరణ సూచనలు పరిగణలోకి తీసుకోండి. ఏది ఏమైనప్పటికి ఈ శీలింద్ర నాశినులు కొంత వరకూ మాత్రమే ఈ తెగులు నుండి రక్షణ కల్పించగలవు. పుష్పించే దశలో వర్షం వచ్చే ముందు లేదా మంచు బిందువులు పడే ముందు ట్రైఫ్లోక్సిస్ట్రోబిన్ + టెబుకోనజోల్ కలిగిన శీలింద్ర నాశినులను ఉపయోగించండి. ఈ మందులను తరుచుగా వాడడం వలన ఈ ఫంగస్ నిరోధకతను పెంచుకుంటుంది. కావున ప్రతి సంవత్సరం ఇవే మందులను వాడరాదు.
మాగ్నాపొర్తే ఒరేజై అనే ఫంగస్ దీనికి కారణంగా ఉంటుంది. ఈ ఫంగస్ విత్తనాలు మరియు అంట అవశేషాలపైన జీవించి ఉండగలదు. ఇది గోధుమ పంటనే కాకుండా బార్లీ, వరి మరియు అనేక ఇతర మొక్కలను కూడా ఆశిస్తుంది. అందువలన పంట మార్పిడి చేయడం వలన పెద్దగా ఉపయోగం ఉండదు.ప్రస్తుతం సాగు చేస్తున్న అనేక గోధుమ రకాలకు ఈ తెగులు సంక్రమిస్తుంది. కంకులు ఏర్పడే సమయంలో మరియు గింజలు పాలుపోసుకునే దశల్లో వెచ్చని ఉష్ణోగ్రతలు మరియు (18-30°C) సాపేక్ష ఆర్ద్రత 80% కన్నా అధికంగా వున్నప్పుడు తీవ్రమైన నష్టం కలుగుతుంది మరియు కొన్ని సార్లు ఒక వారం లోపలే పంటకు తీవ్రమైన నష్టం కలిగిస్తుంది.