వేరుశనగ

వేరుశనగలో ఆల్టర్నేరియ ఆకు మచ్చ

Alternaria sp.

శీలీంధ్రం

క్లుప్తంగా

  • చుట్టూ పసుపు రంగు వలయంతో చిన్న పరిమాణంలో మచ్చలు ఏర్పడతాయి.
  • ఆకులు లోపలకు ముడుచుకు పోయి పెళుసుగా మారతాయి.
  • ఆకులు పసుపురంగులోకి మారి వాలిపోతాయి.
  • ఆకులు రాలిపోతాయి.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

వేరుశనగ

లక్షణాలు

A. అరాచిడీస్ వలన చిన్న గోధుమ రంగు మచ్చల చుట్టూ పసుపురంగు రింగ్ తో (ఆకుమచ్చ, లీఫ్ స్పాట్) ఏర్పడతాయి. A. తెనుఇషిమా లేత ఆకులపై 'V' రూపంలో ముదురు గోధుమ రంగు మచ్చలను కలుగజేస్తాయి. తరువాత ఈ మచ్చలు ఆకు మధ్య ఈనెల్లోకి చేరి ఆకు మొత్తం పాడైపోయినట్టు కనపడుతుంది. ఆకు లోపలకు ముడుచుకుపోయి పెళుసుగా అయిపోతుంది. A. ఆల్ట్రనేత నెక్రోటిక్ వలన చిన్న, అపసవ్యమైన రూపంలో మచ్చలు ఏర్పడి ఆకు మొత్తం వ్యాపిస్తాయి. అవి ముందు పాలిపోయి రంగుకోల్పోయి నీటిలో నానినట్టు ఉంటాయి. అవి పెద్దవి అయ్యేకొద్దీ అవి నిర్జీవంగా మారి పక్క ఈనెల కూడా వ్యాపిస్తుంది.( లీఫ్ స్పాట్ మరియు మరియు వీనెల్ నెక్రోసిస్) ఆకుల మధ్యభాగం చాల త్వరగా ఎండిపోయి విడిపోయి ఆకు అంతా చిరిగిపోయినట్టు అయిపోయి రాలిపోతాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

ఈ వ్యాధికి ఎటువంటి ప్రత్యామ్నాయ చికిత్స ఇంకా కనుగొనబడలేదు. ఈ తెగులు లక్షణాలు కనిపించిన తర్వాత ఒక లీటరు నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ పిచికారీ ఈ తెగులుపైన సమర్ధవంతంగా పనిచేస్తుంది.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. మాంకోజెబ్, కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా కార్బెన్డిజమ్ వంటిరసాయనాలను ఆకులపై పిచికారీ చేయవచ్చు.

దీనికి కారణమేమిటి?

ఈ తెగుళ్లు భూమిలో పెరిగే ఫంగై ఆల్ట్రనేరియా వల్ల కలుగుతాయి. తెగులుకు గురైన విత్తనాలు ఐనోకులమ్ కు ప్రాధమిక మూలంగా ఉంటాయి.ఈ విత్తనాలు వేసినప్పుడు వాతావరణం అనుకూలిస్తే విపరీతమైన నష్టం కలిగే అవకాశం ఉంటుంది. గాలివలన ఇతర కీటకాలవలన ఈ తెగులు మరిన్ని మొక్కలకు వ్యాపిస్తుంది. 20° సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత మరియు అధిక కాలం ఆకులు తేమగా ఉండడం వలన ఈ తెగులు వ్యాప్తి చెందుతుంది. వర్షాకాలం తర్వాత వేసిన వేరుశనగపంటలో ఈవిధంగా తరచు కనిపిస్తుంది. ఈ తెగులు తీవ్రత బట్టి కాయల సైజు మరియు గ్రాసం 22% నుండి 63% వరకు తగ్గే అవకాశం ఉంది.


నివారణా చర్యలు

  • ఆరోగ్యవంతమైన మొక్కల లేదా ధృవీకరించ బడిన తెగులు నిరోధక విత్తనాలు మాత్రమే వాడండి.
  • కలుపును ఇతర అతిధి పంటలను తొలగించండి.
  • తెగులు కారకాలకు పరిస్థితులు అనుకూలంగా ఉన్న సమయాల్లో పొలాన్నితెగులు లక్షణాల కోసం గమనిస్తూవుండండి.
  • పంటలో తెగులుకు గురైన మొక్కలను తీసివేసి నాశనం చేయండి.
  • వేరుశనగ మొక్కలను ఆశించే తెగులు సోకని మొక్కలతో ప్రతీ మూడుసంవత్సరాలకు ఒకసారి పంట మార్పిడి చేయండి.
  • ఆకులు తడిగా ఉన్నపుడు పొలంలో పనిచేయకూడదు.
  • మట్టిలో ఇంకా మిగిలివున్న పురుగులను నిర్ములించడానికి పొలాన్ని బాగా లోతుగా దున్నండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి