Monographella albescens
శీలీంధ్రం
ఆకు మాడు తెగులుకి సంబంధించిన లక్షణాలు మొక్కల పెరుగుదల దశ, నాటిన రకం మరియు మొక్కల సాంద్రత ఆధారంగా మారతాయి. చాలా సందర్భాల్లో ఆకుల చివర్లలో బూడిద-ఆకుపచ్చ రంగులో నీటిలో తడిచినట్టు వున్న మచ్చలు వృద్ధి చెందడం మొదలవుతుంది. తరవాత ఈ మచ్చలు విస్తరించి, ఆకుల కొనభాగం నుండి లేదా ఆకు అంచుల నుండి మొదలుపెట్టి, ఒక రింగ్ లాంటి నమూనాలో లేత టాన్ రంగు మరియు గోధుమ రంగు మచ్చలను ఉత్పత్తి చేస్తాయి. ఈ మచ్చల నిరంతర ఎదుగుదల ఫలితంగా ఆకు పైభాగంలో పెద్ద మొత్తం ఎండిపోతుంది. వ్యాప్తికి గురైన ప్రాంతాలు ఎండిపోయి, ఆకులు కాలినట్టు కనిపిస్తాయి. కొన్ని దేశాల్లో చాలా అరుదుగా రింగ్ నమూనా మచ్చలు ఏర్పడతాయి మరియు కేవలం కాలినట్టు కనిపించే లక్షణాలు మాత్రమే కలిగి ఉంటాయి.
ఇప్పటివరకు ఈ వ్యాధికి ఏ రకమైన ప్రత్యామ్నాయ నివారణమార్గం కనుగొనబడలేదు.
వీలున్నంతవరకు ఎల్లపుడూ జీవసంబంధమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. థియోఫానేట్-మిథైల్ తో విధానాలను శుద్ధి చేయడం వలన M. అల్బెసెన్సు తెగులు సోకకుండా ఉంటుంది. మాంకోజెబ్ మరియు థియాఫనేట్ మిథైల్ లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ ఆధారిత శిలింద్ర నాశినులను ఒక లీటరు నీటికి 1.0 గ్రాము కలిపి ఆకులపై పిచికారీ చేసినట్లయితే ఆకు మాడు తెగులు (లీఫ్ స్కాల్డ్) తీవ్రతను గణనీయంగా తగ్గించవచ్చు. ఈ రసాయనాల కాంబినేషన్ కూడా బాగా పనిచేస్తుంది.
సహజంగా సీజన్ ఆఖర్లో ముదిరిన ఆకులపైన ఈ తెగులు కనిపిస్తుంది మరియు తడి వాతావరణం, అధిక నత్రజని ఎరువులు వాడకం వలన ఇది మరింత విజృంభిస్తుంది. 40 kg/హెక్టర్ కన్నా ఎక్కువ నత్రజని వాడడం వలన లీఫ్ స్కాల్డ్ తెగులు ఎక్కువగా సోకడం జరుగుతుంది. దెబ్బతినని ఆకులకన్నా దెబ్బతిన్న ఆకులపైన ఇది చాలా త్వరగా సోకుతుంది. ముందు పంట అవశేషాలు మరియు విత్తనాల ద్వారా ఈ తెగులు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆకు మాడు లేదా ఆకు ఎండు మధ్యలో తేడా కనుగొనటానికి కత్తిరించిన ఆకులని 5 నుండి 10 నిమిషాల పాటు నీళ్లలో ముంచి ఉంచండి. ఒక వేళ ఆకుల నుండి ఏమి స్రవించకపోతే అది ఆకు మాడు తెగులు అని అర్ధం.