వరి

బకనే మరియు మొదలు కుళ్ళు

Gibberella fujikuroi

శీలీంధ్రం

క్లుప్తంగా

  • బకనే తెగులు ముఖ్యంగా నాట్లకు సంబంధించిన వ్యాధి కానీ మొక్క పెరుగుదల అన్ని స్థాయిల్లో కూడా చూడవచ్చు.
  • నారు అసాధారంగా పొడుగైన మొక్కలుగా, లేత, సన్నటి మరియు ఎండిన ఆకులతో పెరుగుతాయి.
  • తెగులుకు గురైన మొక్కల కాండం పైన గోధుమ రంగు మచ్చలు కనిపిస్తాయి.
  • కాండంపైన ఉన్న కణుపులనుండి కొత్త పిలకలు మొలకెత్తుతాయి.
  • తెగులు సోకిన మొక్కలలో సగం నిండిన ధాన్యాలు లేదా తాలు ధాన్యాలు తయారు అవుతాయి.

లో కూడా చూడవచ్చు


వరి

లక్షణాలు

బకనే నారు తెగులు అనిపిస్తుంది కానీ మొక్కల పెరుగుదల ప్రతి దశలోను ఈ తెగులును చూడొచ్చు. మొక్కలకు ఫంగస్ వేర్లనుండి వ్యాపిస్తుంది మరియు ఒక పద్ధతి ప్రకారం కాండం ద్వారా మొక్క అంతా వ్యాపిస్తుంది. ఒక వేళ ఈ తెగులు మొదటి దశను దాటితే మొలకలు అసాధారంగా పొడుగైన మొక్కలుగా, పాలిపోయిన, సన్నటి మరియు ఎండిన ఆకులు మరియు తక్కువ పిలకలు లాంటి లక్షణాలతో ఉంటాయి. కాండం లోపలిభాగం కుళ్లిపోయి పై కణుపులనుండి కొత్తగా చిగుర్లు వేస్తాయి. తెగులు సోకిన మొక్కల కాండంపైన గోధుమరంగు మచ్చలు ఏర్పడతాయి. మొక్క పెద్దది అయ్యేవరకు బ్రతికివుంటే కంకులలో తాలుగింజలు ఏర్పడతాయి. ఈ మొక్కలు నిటారుగా నిలబడి వుంటాయి. వీటిలో ఫ్లాగ్ లీఫ్ తెగులు కూడా మనం గమనించవచ్చు.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

ఇంత వరకు ఈ తెగులుకు జీవ చికిత్స విధానం లేదు. విత్తనాలను ఉప్పునీటిలో నానబెట్టి తేలికగావున్న విత్తనాలను ఆరోగ్యంగా వున్న విత్తనాలనుండి వేరుచేయవచు.

రసాయన నియంత్రణ

వీలున్నంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ట్రైఫుమిజోల్, ప్రొపికనజోల్, ప్రోక్లోరాజ్ వంటి సీలింద్రనాశినిలలో విత్తనాలను (ఒకటే కానీ లేదా తీరం(thiram) తో కలిపికాని) 5 గంటల వరకు నానబెట్టి వాడడం వలన మంచి ఫలితం వుంటుంది. సోడియం హైపోక్లోరైడ్( బ్లీచ్) తో విత్తనాలను శుద్ధిచేయడంవలన కూడా ఈ తెగులును నియంత్రించవచ్చు. పైరు ఎదుగుతున్నదశలో పైన చెప్పిన వాటిని వారంలో 2 సార్లు పిచికారీ చేయడం వలన ఈ తెగులును నివారించవచ్చు.

దీనికి కారణమేమిటి?

బకనే తెగులు విత్తనాలకు సోకే ఫంగల్ వ్యాధి. తరచుగా వ్యాధి సోకిన విత్తనాలు వాడటం వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది(ఫంగల్ స్పోర్స్ ఉన్నటువంటి) ఇంకా మొక్క భాగాలు లేదా భూమిలో రోగకారక సూక్ష్మక్రిములు వున్నప్పుడు కానీ ఈ వ్యాధి సోకుతుంది. ఇది గాలి లేదా నీటి ద్వారా ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకు వ్యాపిస్తుంది. పంట కోత వంటి పొలం పనుల ద్వారా కూడా ఈ వ్యాధి ఆరోగయకరమైన మొక్కలకు కూడా సోకుతుంది. సాగు సమయంలో ఆరోగ్యాంగా ఉన్న విత్తనాలకీ ఫంగల్ స్పార్స్ సోకడం వల్ల కూడా బకనే తెగులు వ్యాపించవచ్చు. 30 నుండి 35 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు వ్యాధి పెరగటానికి సహకరిస్తాయి.


నివారణా చర్యలు

  • తెగులు సోకకుండా ఉండడానికి శుభ్రమైన విత్తనాలను వాడండి.
  • తెగులును తట్టుకునే వరివంగడాలు వాడండి.
  • మొలకలను గమనించి పాలిష్ మరియు అల్బినో రకాల వంగడాలను వాడవద్దు నత్రజని ఎరువులను అధికమోతాదులో వాడొద్దు.
  • పొలాన్ని లోతుగా దున్నడం వలన అతినీలలోహిత కిరణాలు మట్టికి బాగా సోకుతాయి.
  • విత్తేముందు బాగా దుక్కిదున్ని ముందు పంట అవశేషాలను నాశనం చేయండి.
  • ముందు వేసిన పంట అవశేషాలను దున్నడం ద్వారా తొలగించాలి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి