Magnaporthe salvinii
శీలీంధ్రం
ఈ లక్షణాలు పిలకలువేసే దశ తరువాతే కనిపిస్తాయి. నీటి మట్టం వద్ద, ఆకు తొడిమ పైభాగంపై చిన్నచిన్న, అపసవ్యంగా నల్లటి మచ్చలు ఏర్పడటం మొదటి సంకేతంగా చెప్పొచ్చు. తెగులు తీవ్రత పెరిగేకొద్దీ ఈ మచ్చలు పెద్దవి అవుతూ ఆకుతొడిమ లోపలభాగాల్లోకి చొచ్చుకుపోతాయి. దీనివలన గోధుమరంగుతో కూడిన నల్లని మచ్చలు ఏర్పడతాయి. ఒకటి లేదా రెండు కాడలు కుళ్లిపోయి విరిగిపోతాయి. (కాండం పైభాగం మాత్రమే చెక్కుచెదరకుండా ఉంటుంది). దానివలన కాండం ఒకవైపుకు వాలిపోయి కంకుల్లో తాలు గింజలు ఏర్పడతాయి లేదా పిలకలు నశించిపోతాయి. తెగులు సోకిన కాండం లోపలభాగంలో చిన్న చిన్న నల్లని స్కెలేరోషియా తో పాటు ముదురు బూడిదరంగు మైసీలియం ను చూడవచ్చు.
మంచి పంట యాజమాన్య పద్ధతులు పాటించడం మరియు వైరస్ కు ప్రతికూలంగా జీవించే జీవులను వుపయోగించి ఈ కాండం కుళ్ళు తెగులును నివారించవచ్చు.
వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవసంబంధమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. సాధారణంగా పిలకలు వేసే దశ మధ్య నుండి లేదా వ్యాధి ప్రారంభమయ్యే సమయంలో, వాలిడామైసిన్ లేదా హెక్సాకోనజోల్ (2 మి.లీ/లీ), ప్రొపికోనజోల్ (1 మి.లీ/లీ) లేదా థియోఫనేట్ మిథైల్ (1.0 గ్రా/లీ) ఆధారిత మందులను 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
మాగ్నాపోర్తే సాల్విని ఫంగస్ వలన ఈ చిహ్నాలు ఏర్పడతాయి. ఇది చలికాలం మొత్తం చనిపోయిన మొక్క కణజాలంలో కానీ మట్టిలో కాని జీవించివుంటుంది. పరిస్థితులు అనుకూలించినప్పుడు (ఎక్కువ తేమ, ఎక్కువ నత్రజని ఎరువుల వాడకం) వర్షపు చినుకులవలన మరియు సాగునీటివలన దీని బీజాంశాలు విస్తరిస్తాయి . ఇది ఆకు పైకి చేరినప్పుడు ఆకుకు అంటిపెట్టుకుని ఉండి ఆకుపైవుండే పైపొరను ఉపయోగించుకుని జెర్మ్ ట్యూబును ఉత్పత్తిచేస్తుంది. సరైన సస్యరక్షణ విధానాలు పాటించకపోవడంవలన, కీటకాలు దాడిచేయడంవలన లేదా మొక్కలు దెబ్బతినడంవలన ఇది మరింత సులువుగా వ్యాపిస్తుంది. పంట పక్వదశకు వచ్చేసమయంలో ఈ తెగులు మరింత తీవ్రతరమౌతుంది. ఉష్ణమండల ప్రదేశాలలో పంట కోత తర్వాత వుండే అధిక తేమ ఈ ఫంగస్ మరింత పెరిగేటట్టు చేస్తుంది.