Uromyces phaseoli
శీలీంధ్రం
తెల్లటి ఫంగల్ మచ్చల మధ్యలో చిన్న, గుండ్రపు, ఎరుపు గొధుమ రంగు మచ్చలు కనపడతాయి. సాధారణంగా ఇవి ఆకుల కింది భాగం లో కనబడతాయి. మచ్చలు మొదట్లో చిన్న గుంపులుగా ఉండవచ్చు తరువాత అవి అన్నీ ఒక్క చోట కలిసి ఆకు అంచులపై పెద్దగా కనపడతాయి. అదనంగా సన్నగా ముదురు గోధుమ ప్రదేశం ఏర్పడుతుంది. తెగులు తీవ్రత అధికంగా ఉండడం వలన ఆకుల పైభాగం నష్టానికి గురి కావచ్చు. దానివలన ఆకులు మచ్చలతో మూసివేయ బడతాయి. ఆకులు ఎండిపోయి, ముడుచుకుపోయి రాలి పోవచ్చు. ఈ దశలో కాయలు మరియు కాండాలు కూడా ప్రభావితం కావచ్చు. ఆకువు బాగా ఎక్కువగా రాలిపోవడం వలన దిగుబడి బాగా తగ్గుతుంది.
సాల్వియా ఆఫీసినలిస్ మరియు పోటేంటిల్ల ఎరేక్టా మొక్కల సారం ఈ ఫంగల్ ఎదుగుదలను అడ్డుకోవడంలో రక్షణగా ఉపయోగపడుతుంది.
వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. చివరిదశల్లో తెగులును గుర్తిస్తే రసాయన మందులవలన ఉపయోగం ఉండకపోవచ్చు. ఒక వేళ శీలింద్ర నాశినులు వాడవలసి వస్తే మాంకోజెబ్, కార్బెన్డిజమ్, ప్రొపికోనజోల్, కాపర్ లేదా సల్ఫర్ కూడిన రసాయనాలు వాడాలి. తెగులు కనిపించిన వెంటనే మందులు వాడడం మొదలు పెట్టాలి. ఆ తర్వాత ప్రతి 15 రోజులకు ఒకసారి మందులను వాడాలి.
తెగులు కారక పురుగులు మట్టిలోని పంట అవశేషాల్లో ఇతర అతిధి మొక్కలపై జీవిస్తాయి. మట్టిలోనుండి బీజాంశాలు ముదురు ఆకులపైకి చేరడంవలన చీడ మొదట మొదలవుతుంది.రెండవ దశలో గాలి వల్ల ఒక మొక్కనుండి ఇంకొక మొక్కకు వ్యాపిస్తుంది. తెగులు మొదలవ్వడానికి మరియి వ్యాప్తి చెందడానికి వేడి ఉష్ణోగ్రతలు, తేమ మరియు మబ్బులు పట్టి ఉన్న వాతావరణం (21 నుండి 26° C) మరియు రాత్రి వేళల్లో అధిక మంచు వంటివి సహకరిస్తాయి.