Colletotrichum lindemuthianum
శీలీంధ్రం
ఈ తెగులు మొక్కల ఏ దశలో అయినా ఆశించవచ్చు. ఈ తెగులు ముఖ్యంగా ఆకులు, కాండాలు, కాయలకు వ్యాపిస్తుంది. ఈ తెగులు ఉన్న విత్తనాల్ని పొలంలో చల్లటం ద్వారా అంకురోత్పత్తి జరిగి కన్ను ఆకారంలో మచ్చలు ఏర్పడుతాయి. పెద్ద మొక్కలలో ఈ మచ్చలు చిన్నగా, సక్రమంగా లేకుండా , నల్లని రంగులో నీటిలో నానినట్టు కనిపిస్తాయి. మాములుగా ఇవి ఆకు కింది భాగం లేదా కాండంపై ఏర్పడుతాయి. ఆకు అంచుల వెంబడి లేదా పై భాగాన పసుపు నారింజ పండు వర్ణంలో మచ్చలు ఏర్పడుతాయి. కాయలు తుప్పు రంగు మచ్చలు కలిగి ముడుచుకు పోయి మరియు ఎండి పోయే అవకాశం ఉంది. కాండం మరియు ఆకు కాడలపై కాంకర్స్ కనిపిస్తాయి. ఆకులు రాలిపోతాయి.
జీవ సంబంధ ఏజెంట్లను ఉపయోగించడం వలన వ్యాధిని అదుపులో ఉంచవచ్చు. జీవ శిలీంధ్ర నాశని అయిన ట్రైకోడెర్మా హర్జియానమ్ మరియు బాక్టీరియా సుడోమోనాస్ ఫ్లోరిసెన్స్ వంటి వాటిని విత్తనాల చికిత్సకు వాడాలి.
వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. వాతావరణ పరిస్థితులను బట్టి రసాయనాలు ఉపయోగించడం వలన ఖర్చు ఎక్కువ అయ్యే అవకాశం వుంది. సరైన శీలింద్ర నాశినులతో విత్తనాలను శుద్ధి చేయండి. పద్ధతుల్ని అవసరాన్ని బట్టి లేదా వ్యాధి తీవ్రతని బట్టి ఉపయోగించవచ్చు. ఉదాహరణకు ప్రతి ఒక లీటరు నీటికి 2 గ్రాముల థిరం 80% WP లేదా ఒకలీటరు నీటికి 2.5 గ్రాములు కప్తాన్ 75 WP. ఫోల్పేట్, మాంకోజెబ్, థియోఫానేట్ మిథైల్ (0.1%) కాపర్ ఆక్సీక్లోరైడ్ ఒక లీటరు నీటిలో 3 గ్రాముల చొప్పున ప్రతి 15 రోజులకు ఒకసారి ఉపయోగించాలి.
"కొలెటోట్రికం లిండేముతియనమ్" అనే శీలింధ్రం మట్టిలో, విత్తనాలలో మరియు మొక్కల అవశేషాలపై జీవిస్తుంది. ఇతర పదార్ధాలపై కూడా ఇది నిద్రావస్థలో ఉండి జీవిస్తుంది. వర్షం పడినప్పుడు లేదా తడిగా ఉన్న పొలంలో పని చేసినప్పుడు ఇది వ్యాపిస్తుంది. మంచు, తడి సమయాల్లో పొలాల్లో ఎటువంటి పని చేయకపోవటం (పనివాళ్ళు, ట్రీట్మెంట్స్) మంచిది. చల్లగా ఉండే ప్రాంతాల్లో(13-21°C ఉష్ణోగ్రతలు) మరియు తరుచుగా వర్షాలు పడే సమయంలో ఈ తెగులు తొందరగా వ్యాపిస్తుంది. ఈ సమయాల్లో వ్యాధి తొందరగా సోకే అవకాశాలు ఉంటాయి.