మొక్కజొన్న

మొక్కజొన్నలో కన్ను మచ్చ తెగులు

Kabatiella zeae

శీలీంధ్రం

క్లుప్తంగా

  • బాగా చిన్న, నీటిలో నానినట్టు వుండే గుండ్రని మచ్చలు క్రింది భాగంలో వున్న ఆకులపై కనిపిస్తాయి.
  • ఈ మచ్చలు " ఐ స్పాట్" గా మారి రాగి రంగులో ఉండి ముదురు గోధుమ రంగు అంచులు కలిగి ఉంటాయి.
  • తరువాత ఇవి ఒకే చెంతకు చేరి పాలిపోయిన లేదా నిర్జీవమైన అతుకుల వలే మారుతాయి.

లో కూడా చూడవచ్చు


మొక్కజొన్న

లక్షణాలు

బాగా చిన్న, నీటిలో నానినట్టు వుండే గుండ్రని మచ్చలు క్రింది భాగంలో వున్న ఆకులపై కనిపిస్తాయి. ఈ మచ్చలు " ఐ స్పాట్" గా మారి రాగి రంగులో ఉండి ముదురు గోధుమ రంగు అంచులు కలిగి ఉంటాయి. ఇవి తరువాత ఒకే చెంతకు చేరి పాలిపోయిన లేదా నిర్జీవమైన అతుకుల వలే మారుతాయి. సహజంగా పాత ఆకులపై ఈ మచ్చలు కనిపిస్తాయి. కానీ ఆకు బెరడు మరియు పొట్టు పైన కూడా కనిపిస్తాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

ఈ రోజు వరకు ఈ కబటియాల్లా జెఎ తెగులుకు జీవ నియంత్రం పద్ధతులు లేవు. మీకు ఏదైనా జీవ నియంత్రం పద్ధతుల వలన మంచి ఫలితాలను కలిగి ఉంటే దయచేసి మాకు తెలియజేయండి. మీ నుండి వినడానికి ఎదురుచూస్తూ ఉంటాము.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. శీలింద్ర నాశినులు వాడకం వలన పంట దిగుబడి పెరగడం మరియు పురుగుల మందుల ఖర్చు వంటి లాభనష్టాలను సరిగ్గా భేరీజు వేసుకోండి. మాంకోజెబ్, ప్రొపికోనజోల్ మరియు క్లోరోన్తలోనిల్ తో విత్తనశుద్ధి చేయడం పరిగణలోకి తీసుకోండి.

దీనికి కారణమేమిటి?

ఈ ఫంగస్ మట్టిపై వున్న మొక్కజొన్న అవశేషాలపై జీవిస్తాయి మరియు విత్తనాలపై కూడా చూడవచ్చు. వసంత కాలంలో ఇవి బీజాంశాలను ఉత్పత్తి చేస్తాయి. ఇవి గాలి మరియు వర్షం ద్వారా కొత్త పంటలకు వ్యాపిస్తాయి. ఆకులపై తడి, చల్లని ఉష్ణోగ్రతలు, నిరంతర వర్షాలు లేదా బిందువులు ఈ తెగులు సంక్రమణకు సహకరిస్తాయి. వేడి మరియు పొడి వాతావరణం దీని ఎదుగుదలని తగ్గిస్తాయి. మోనోకల్చర్ మరియు తక్కువగా దున్నడం వంటి పద్ధతులు కూడా ఈ తెగులు వృద్ధిచెందడానికి దోహదపడుతుంది. పుష్పించే దశలో లేదా జొన్న పరిణితి చెందుతున్నప్పుడు ఈ ఫంగస్ మొక్క పైభాగాలకు సోకితే పంట ఉత్పాదకత మరియు దిగుబడి తగ్గుతుంది.


నివారణా చర్యలు

  • తెగులు నిరోధక లేదా సహనాత్మక విత్తనాలు వాడాలి.
  • ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి పంట మార్పిడి చేయాలి.
  • కోత అనంతరం దుక్కి దున్ని మొక్కల అవశేషాల్ని పాతి పెట్టాలి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి