సోయాబీన్

సోయాబీన్ యొక్క బొగ్గు కుళ్ళు తెగులు

Macrophomina phaseolina

శీలీంధ్రం

క్లుప్తంగా

  • పుష్పించే సమయంలో మరియు వెచ్చని, పొడి వాతావరణ సమయంలో ఈ తెగులు లక్షణాలు బైట పడతాయి.
  • తక్కువ శక్తి గల మొక్కలు ఉష్ణోగ్రత అధికంగా వుండే పగలు సమయంలో వాలిపోతాయి.
  • లేత ఆకులు పసుపు రంగులోకి మారతాయి.
  • కాయలు పూర్తిగా నిండవు.
  • వేర్లు మరియు కాండంలోని అంతర్గత కణజాలం ఎరుపురంగుతో కూడిన గోధుమరంగుకు పాలిపోవడం జరుగుతుంది.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

సోయాబీన్

లక్షణాలు

మొక్కల ఎదుగుదలలో ఏ దశలో అయినా ఈ తెగులు సోకవచు. కానీ మొక్కలు పుష్పించే దశ ప్రారంభంలో ఇవి ఎక్కువగా పంటను ఆశిస్తాయి. సాధారణంగా దీర్ఘకాలం వెచ్చని, పొడి వాతావరణ సమయంలో ఈ తెగులు లక్షణాలు బయటపడతాయి. మొక్కలు తక్కువ బలాన్ని కలిగివుంటాయి.మరియు రోజులో అత్యంత వేడిగా ఉండే సమయాల్లో వాడి పోతాయి. తిరిగి రాత్రి సమయంలో పాక్షికంగా కోలుకుంటాయి. లేత ఆకులు పసుపు రంగులోకి మారడం మొదలు పెడతాయి మరియు కాయలు పూర్తిగా నిండవు. వేర్లు మరియు కాండంలోని తెగులు, అంతర్గత కణజాలంలోని ఎరుపుతో కూడిన గోధుమ రంగులోకి పాలిపోవడం జరుగుతుంది. కాండం యొక్క అడుగున యాదృచ్ఛికంగా విస్తరించిన నల్లటి చుక్కలు ఫంగస్ వృద్ధి యొక్క ఇంకొక లక్షణం.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

పరాన్నజీవ ఫంగీ ట్రైకోడెర్మా spp మాక్రోఫోమినా ఫసియొలినా వంటి ఇతర ఫంగి పైన జీవిస్తుంది. ట్రైకోడెర్మా విరిడే ( 250 గ్రాముల వెర్మిపోస్ట్ లేదా FYM తో 5 కేజీ )ను విత్తనాలు వేసేసమయంలో వాడినట్లైతే ఈ తెగులు సోకకుండా అది నిరోధిస్తుంది. ఈ ఫంగిను నియంత్రించడానికి వాడే ఇతర పద్దతులలో బాక్టీరియం రైజోబియం sp. కూడా ఒకటి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఎటువంటి శిలీంద్ర నాశినులు లేదా ఆకులపై చల్లే పిచికారీ ఈ తెగులును నియంత్రించలేవు. ఒక కిలో కు మూడు గ్రాముల మాంకోజెబ్ తో విత్తన శుద్ధి చేయడం వలన మొక్కలు వేసే సమయంలో ఈ తెగులు సోకకుండా నిరోధించవచ్చు. హెక్టారుకు 80 కేజీలు మ్యురేట్ ఆఫ్ పోటాష్ ను రెండు వాయిదాలలో వేయడం వలన ఈ తెగులు లక్షణాలను తీవ్రం కాకుండా చేయవచ్చు.

దీనికి కారణమేమిటి?

సోయాబీన్ బొగ్గు కుళ్ళు తెగులు, మాక్రోఫోమినా ఫేసెయోలినా అనే ఫంగస్ వలన కలుగుతుంది. ఇది శీతాకాలంలో పొలంలోని లేదా మట్టి లోని మొక్క శిధిలాలలో ఉంటుంది మరియు సీజన్ ప్రారంభంలో వేరు ద్వారా మొక్కలకు సోకుతుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు (ఉదాహరణకు వేడి, పొడి వాతావరణం) మొక్కలను ఒత్తిడికి గురిచేయనంత వరకు లక్షణాలు కనిపించకుండా ఉండిపోవచ్చు. వేరు అంతర్గత కణజాలానికి నష్టం కలగడంవలన మొక్కలకు నీరు ఎక్కువగా అవసరమైనప్పుడు మొక్కలు నీటిని సరిగా గ్రహించలేవు. ఇతర శిలీంధ్రాలు మాదిరిగా కాకుండా, బొగ్గు తెగులు ఫంగస్ యొక్క కార్యకలాపాలు మరియు పెరుగుదలకు పొడి నేలలు (27 నుండి 35°C) అనుకూలం.


నివారణా చర్యలు

  • అందుబాటులో ఉంటే తెగులు తట్టుకోగల విత్తన రకాలను ఉపయోగించండి.
  • పొలంలో అధికంగా విత్తనాలు వేయవద్దు.
  • పొడి, వేడి వాతావరణ సమయంలో క్రమం తప్పకుండా పొలానికి సాగునీరు అందించండి.
  • వేసవికాలంలో పొలాన్ని బాగా లోతుగా దున్నండి.
  • దానివలన ఈ చీడ కారక క్రిములను తగ్గించవచ్చు.
  • వాతావరణ పరిస్థితులను బట్టి సీజన్ కు ముందుగా లేదా సీజన్ వేయడానికి సరిపోయే విధానాలను ఉపయోగించండి.
  • ఈ తెగులు విస్తరించలేని గోధుమ వంటి ఇతర పంటలతో పంట మార్పిడి చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి