Diaporthe caulivora
శీలీంధ్రం
ఈ మచ్చలు తరువాత కాండం పైకి క్రిందకి వ్యాపించి ఇంకా ముదురు గోధుమ రంగులోకి మారతాయి. పచ్చ మరియు గోధుమ రంగు మచ్చలు ఒకదాని తర్వాత ఇంకొకటిగా కాడం పైన ఏర్పడడం ఈ తెగులు ప్రత్యేకత. ఈ తెగులు కాండం లోపలి అంతర్గత కణజాలాన్నినాశనం చేసి మొక్కలలో నీరు మరియు పోషక పదార్ధాలు రవాణా కాకుండా అడ్డుకుంటాయి. ఆకులపై అంతర్నాల క్లోరోసిస్ ( ఆకులు రంగుకోల్పోయి పాలిపోవడం)వృద్ధి చెందుతుంది.తరువాత ఆకులు చనిపోవచ్చు కానీ ఇవి కాండానికి అంటిపెట్టుకునే ఉంటాయి. ఈ మచ్చల పైన వున్న మొక్కల భాగాలు చనిపోయి మొగ్గలు రావడం తగ్గిపోతుంది.
అందుబాటులో వుండే జీవ సంబంధమైన శిలీంద్రనాశకాలతో కూడిన ఒక సమగ్రమైన పద్దతిని పాటించడం మంచిది
వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. శిలీంద్ర నాశినులు వాడడం వలన ఈ తెగులును నియంత్రించవచ్చు కానీ వీటిని వాడిన సమయం, వాతావరణ పరిస్థితులు బట్టి ఫలితాలు ఉంటాయి. అవసరమైతే మెఫినోక్సమ్, క్లోరో తలోనిల్, థియోఫానేట్ - మిథైల్ లేక అజోక్సీస్ట్రోబిన్ కలిగిన ఉత్పత్తులను మొక్కలు ఎదిగే మరియు పునరుత్పత్తి దశలలో వాడండి.
మట్టి ద్వారా సోకే ఈ డైపోర్తే ఫాసియోలారం, సోయా బీన్ కాండం కాంకర్ తెగులు కారకం. సదరన్ మరియు నార్తెన్ స్టెమ్ కాంకర్ తెగుళ్లను కలిగించే ఫంగస్ లు రెండు వేరు వేరువేరుగా ఉంటాయి. ఈ ఫంగస్ పంట అవశేషాలపై లేదా విత్తనాలపై జీవిస్తాయి. ఇవి మొక్కల ఎదుగుదల దశలో మొక్కలను ఆశిస్తాయి. కాని వీటి లక్షణాలు మొక్కలు పునరుత్పత్తి దశలో వున్నప్పుడు మాత్రమే బయట పడతాయి. నిరంతర తడి మరియు వర్షపు వాతావరణ పరిస్థితులలో ప్రత్యేకంగా సీజన్ ముందు తెగులు సోకే అవకాశాలు అధికంగా వుంటాయి. పొలాన్ని సరిగ్గా దున్నకపోవడం కూడా ఈ తెగులు సోకడానికి ఒక కారణం.