Cercospora kikuchii
శీలీంధ్రం
ఈ తెగులు ప్రధానంగా పంట ఆఖరిదశలో పువ్వులకు మరియు కాయలకు వ్యాపిస్తుంది. మచ్చలు ఊదా రంగు నుండి గోధుమ వర్ణంలో మచ్చలు ఆకులపై కనిపిస్తాయి. ఎర్రని రంగు మచ్చలు కాండాలు మరియు కాయలపై కనిపిస్తాయి. అంతేకాక విత్తనాలపై కూడా ఈ తెగులు ప్రభావం చూపుతుంది. దీని ప్రభావం వలన విత్తనాలు గులాబీ నుండి ఊద రంగులోకి మారి విత్తనాలపై పెద్ద మచ్చలు ఏర్పడుతాయి . ఈ విత్తనాల రంగు వల్ల ప్రభావం ఏమి ఉండదు కానీ అంకురోత్పత్తి, మొలకల ఉత్పత్తి దెబ్బతినవచ్చు.
క్షమించండి, ఈ సేస్కోపోరా కికుచి తెగులు నివారణకు సంబంధించి ఎటువంటి జీవ నియంత్రణమాకు తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే దయచేచ్సి మాకు తెలియచేయండి. మీ నుండి వినడానికి ఎదురుచూస్తూ వుంటాము.
వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. విత్తనాలు అధికంగా రంగు కోల్పోయినట్టువుంటే సీలింద్ర నాసీనులతో విత్తనశుద్ధి చేయండి. దానివలన ఈ తెగులు వ్యాపించకుండా నిరోధించే ఆస్కారం వుంది. మాంకోజెబ్ వంటి శీలింద్ర నాశినులను వాడి లీఫ్ బ్లెయిట్ మరియు కాయలకు సోకే తెగుళ్లను నివారించవచ్చు.
సెర్కోస్పోరా ఆకు మచ్చలు సెర్కోస్పోరా కుకుచ్చి అనే శీలింధ్రం వలన కలుగుతాయి. ఈ శీలింధ్రం చలి కాలం మొత్తం మొక్కల క్రింద,మట్టిలో, విత్తనాలపై జీవించివుంటుంది. ఎక్కువ తేమ, వెచ్చని వాతావరణం (22-26), గాలి, వర్షాకాలంలో ఈ ఫంగస్ వ్యాధి వ్యాప్తి చెందటానికి అనుకూలంగా ఉంటుంది.ఈ తెగులు కాయలపై, పువ్వులపై వ్యాపించి వాటికి ఊదా రంగు లేదా గోధుమ వర్ణంలో మచ్చలు ఏర్పడేటట్టు చేస్తాయి.