Cercospora sojina
శీలీంధ్రం
ఈ తెగులు మొక్క ఎదిగే ఏ దశలో అయినా సంక్రమించవచ్చు, కానీ సామాన్యంగా పుష్పించే దశలో లేత ఆకులకు ఇది సంక్రమిస్తుంది. ముందుగా చిన్న పరిమాణంలో గోధుమ రంగు నీట తడిచినట్టు వుండే మచ్చలు ఏర్పడతాయి. కాలక్రమేణా ఇవి పెద్దగా మారి (1-5 మిల్లీమీటర్లు)మధ్యన బూడిదరంగు కలిగి ముదురు ఊదా రంగు అంచులతో గుండ్రటి మచ్చలుగా మారతాయి. ఈ తెగులు తీవ్రత అధికంగా వున్నప్పుడు ఆకులు చనిపోయి రాలిపోతాయి. మధ్యలో నలిపినట్టు వున్న పొడవైన మచ్చలు కాండంపైన కనిపిస్తాయి. మొగ్గలపైన గుండ్రని లేదా పొడవైన గుంతలు పడినట్టువున్న గోధుమరంగు మచ్చలు ఏర్పడతాయి. తెగులు సోకిన విత్తనాలు ముడుతలు పడి వివిధ పరిమాణాలలో గోధుమరంగు మచ్చలు ఏర్పడతాయి.
వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి.
వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. తెగులు సోకినప్పుడు ఒకసారి పంట ఎదుగుతునప్పుడు మరొకసారి పైరాక్లోస్ట్రోబిన్ కలిగివున్న పదార్థాలు వాడడం వలన ఈ తెగులు వ్యాప్తిచెందకుండా నిరోధించవచ్చు. తేమ కలిగి ఉంటే ఇది మరింత శక్తివంతంగా పనిచేస్తుంది. పంట కోతకు 21 రోజుల సమయం మాత్రమే ఉంటే వీటిని వాడకూడదు.
కప్ప కన్ను ఆకు మచ్చ తెగులు రాస్కోపోరా సాజిన అనే వైరస్ వలన కలుగుతుంది. ఇది పంట అవశేషాలపై లేదా విత్తనాలపై జీవిస్తుంది. తెగులు సోకిన విత్తనాలు నాటితే తెగులుతో వున్న మొలకలు మొలకెత్తుతాయి. ఈ తెగులు ఎక్కువగా లేత ఆకులకు సోకుతుంది. వేడి, తేమ మరియు మబ్బు పట్టిన ఆకాశం, నిరంతర వర్షం కూడా ఈ తెగులు ఎదుగుదలకు తోడ్పడుతాయి.