Monographella nivalis
శీలీంధ్రం
ఈ తెగులు సంక్రమించిన మొలకలు యొక్క తొలి ఆకుల పైన గోధుమరంగు మచ్చలు కనబడతాయి లేక మొలకలు వచ్చిన వెంటనే చనిపోవడం (డైబాక్) జరుగుతుంది. పెద్ద మొక్కల క్రింది ఆకులు గోధుమరంగులో వుండి కుళ్లిపోతాయి. (కొన్ని సార్లు ఆకు తొడుగులలో ముదురు బీజాంశములు) మరియు క్రింది కణుపుల వద్ద బూడిద–గోదుమరంగు పొక్కులు ఏర్పడి తరువాత ఇవి పైకి వ్యాపిస్తాయి. తెగులు తీవ్రత అధికంగా ఉంటే కాండాలు కుళ్ళిపోయి నారింజ రంగు బూజు వాటిపై పెరుగుతుంది. తీవ్రమైన వాతావరణ పరిస్థితులలో మట్టికి దగ్గరలో భూమట్టపు స్థాయిలో మొక్కలు విరిగిపోతాయి. చిన్న, గోధుమరంగు, నీటిలో తడసినట్టు వుండే మచ్చలు పుష్ప గుచ్చాల పైన కనబడి ఆకుపచ్చగా ఉండవలసిన సమయములో ఇవి రంగును కోల్పోతాయి. వెచ్చటి మరియు తేమ పరిస్థితులలో పూల గుత్తుల మొదళ్ళు వద్ద నారింజరంగు బూజు కనపడవచు మరియు పువ్వుల దగ్గర వుండే ఆకులు(బ్రాట్స్) ఊదా-గోధుమ రంగులోనికి మారుతాయి.
మట్టిలో నివసించే విస్తారంగా వ్యాపించిన చల్లదనాన్ని తట్టుకునే బ్యాక్టీరియా ఈ ఫంగస్ యొక్క జీవిత చక్రాన్ని ప్రభావితం చేయడమే కాకుండా అంటువ్యాధుల తీవ్రతను తగ్గిస్తాయి.
వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. విత్తన శుద్ధి చేయడానికి అజోల్స్ (ఉదాహరణకు ట్రయాడీమెనోల్, బైటేర్టనోల్, ప్రోతికోనజోల్) లేక స్ట్రోబిలురిన్స్ (ఉదాహరణకు ఫ్లోక్సోక్సస్ట్రోబిన్) ఫ్యూబెరిడాజోల్ మరియు ఇప్రోడియోన్ లు వాడవచ్చు.
ఈ లక్షణాలు మట్టి ద్వారా ఏం.నివాలే బూజు వల్ల కలుగుతాయి. వేసవిలో మొక్క శిదిలములో లేక మట్టిలో బతుకుతుంది. ఆకు రాలు కాలం లేదా శీతాకాలంలో చల్లని, తేమ వాతావరణం వున్నప్పుడు ఈ బూజు తెగులు పెరుగుతుంది మరియు మొలకలను మరియు క్రింది ఆకులకు సంక్రమణాన్ని కలిగించే బీజాంశాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ బీజాంశాలు గాలి మరియు ఉపరితల నీటి వలన వ్యాప్తి చెందుతాయి. ఇవి మొక్కల ఇతర భాగాలను మరియు పొలంలో ఇతర పంటలను కలుషితం చేసి తీవ్రమైన తెగుళ్లు సంక్రమించేటట్టు చేస్తాయి. ఈ బూజు తెగులు 18 మరియు 20°C ఉష్ణోగ్రతల వద్ద ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది కాని కొన్ని సందర్భాలలో ఇవి 6°C కనిష్ట మరియు 32°C గరిష్ట ఉష్ణోగ్రత వద్ద కూడా వృద్ధిచెందుతాయి. చల్లని, మరియు వేడి పరిస్థితులలో మొక్క క్రింది భాగాలకు ఈ తెగులు సంక్రమిస్తుంది. అయితే తేమ మరియు వెచ్చని పరిస్థితులలో ఈ తెగులు కంకులకు సంక్రమిస్తుంది.