Cochliobolus heterostrophus
శీలీంధ్రం
వీటి లక్షణాలు పురుగుల బలం, మొక్కల రకాలు మరియు వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. ముందుగా వజ్రం రూపంలో పొడవాటి మచ్చలు గోధుమ రంగు అంచులతో క్రింది ఆకులపై కనిపిస్తాయి. ఈ మచ్చలు వివిధ పరిమాణాల్లో ఉండి ఆకు ఈనెల వరకు వ్యాపిస్తాయి. కొన్ని మొక్కల్లో ఇవి ఒక దగ్గరకు చేరి మాడు తెగులకు దారి తీస్తాయి. పొత్తులు బూడిద రంగు తో కప్పబడి ఈ తెగులు తరువాత దశలలో రూపు మారే అవకాశం ఉంది. ఆకులకు నష్టం వాటిల్లడం వలన మొక్కలు వాలిపోవడం మరియు కాడలు విరిగిపోతాయి. దీనివలన దిగుబడి తగ్గిపోతుంది.
ట్రైకోడెర్మా ఆట్రోవిరిడే SG3403 అనే ఫంగస్ ఈ తెగులు పైన విజయవంతంగా ప్రయోగించబడినది. అయితే దీని సామర్ధ్యాన్ని తెలుసుకోవటానికి ఇంకా ఫీల్డ్ ట్రయల్స్ జరుగుతూ వున్నాయి.
వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. సరైన సమయంలో శీలింద్ర నాశినులను ఉపయోగించినట్లైతే ఈ తెగులును నియంత్రించవచ్చు. ఈ తెగులు వలన దిగుబడి నష్టం ఎంతకలుగుతుంది, వాతావరణ సూచనలు, మొక్కల ఎదుగుదల దశ, మరియు పురుగుల మందులు వాడడం వలన కలిగే లాభాన్ని బేరీజు వేసుకుని ఈ శీలింద్ర నాశినులను వాడాలి.
ఈ వ్యాధి కోక్లియోబొలస్ హెటెరోస్ట్రోఫు అనే ఫంగస్ వల్ల కలుగుతుంది. ఈ ఫంగస్ భూమి లోని పంట అవశేషాలపై జీవిస్తుంది. వాతావరణం అనుకూలంగా ఉన్నపుడు గాలి మరియు వర్షం వలన ఇవి కొత్త మొక్కలపైకి వ్యాపిస్తాయి. ఇది దీని జీవిత చక్రాన్ని 72 గంటల్లో పూర్తి చేస్తుంది. దీని ఎదుగుదల తడి వాతావరణం, ఆకు తేమ మరియు ఉష్ణోగ్రతలు 22 నుండి 30°C వరకు ఉన్నపుడు అధికంగా ఉంటుంది. ఆకులకు కలిగిన నష్టం వల్ల దిగుబడి తగ్గిపోతుంది.