Phaeosphaeria maydis
శీలీంధ్రం
ప్రారంభంలో ఆకులపైన చిన్న లేత ఆకుపచ్చ రంగులో పాలిపోయిన పసుపు కోరోటిక్ మచ్చలు ప్రారంభ లక్షణాలుగా కనిపిస్తాయి, ఈ మచ్చలు తరువాత వృత్తాకార లేదా దీర్ఘచతురస్రాకార మచ్చలుగా (3 నుండి 20 మిల్లీమీటర్స్) మారతాయి. ఈ మచ్చల మధ్యలో తెల్లగా మరియు ఎండినట్టువుండిముదురు గోధుమ క్రమానుసారంగా లేని అంచులతో అభివృద్ధి చెందుతాయి. తెగులు తీవ్రంగా సంక్రమించిన సందర్భాల్లో, అవి మొత్తం ఆకుని దగ్గరగా చేర్చి మాడిపోయినట్టు కనపడేలా చేస్తాయి. ఆకులు క్రింది భాగంలో బాగా చిన్న పరిమాణంలో నల్లని మచ్చలు కనిపిస్తాయి. మొక్కల పెరుగుదల ప్రారంభ దశలో ఈ తెగులు సోకితే పుష్పించే దశకన్నా ముందే పైన వున్న ఆకులు మాడిపోయినట్లయి పంట దిగుబడి బాగా తగ్గుతుంది.
క్షమించండి. ఇప్పటి వరకు మాకుఫెయోస్ఫేరియా ఆకు మచ్చ తెగులు కొరకు ఏ విధమైన జీవసంబంధమైన చికిత్స తెలియదు. ఈ తెగులుతో పోరాడటానికి సహాయపడే మీకు ఏమైనా మార్గం మీకు తెలిస్తే దయచేసి మాతో పంచుకోగలరు. మీ నుండి వినడానికి ఎదురుచూస్తూవుంటాము.
వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. మాంకోజెబ్, పైరాక్లోస్ట్రోబిన్ వంటి శీలింద్ర నాశినులను ఆకులపై పిచికారీ చేయడం ద్వారా ఈ తెగులును నియంత్రించవచ్చు.
ఈ తెగులు ఫంగస్ ఫెయోస్ఫేరియా మేడిస్ వలన సంభవిస్తుంది. ఇది పంట శిథిలాలలో జీవించి ఉంటుంది. అనుకూలమైన పరిస్థితులలో, దాని బీజాంశాలు వర్షపు ప్రవాహాలు మరియు గాలి ద్వారా కొత్త మొక్కలకు సోకుతాయి. ఇది కొత్త ఆకులపైన తన సంతతిని వృద్ధిచేసుకుంటుంది. ఆలా ఇది ఈ తెగులు విస్తరించేటట్టు చేస్తుంది. అధిక వర్షపాతం మరియు అధిక తేమ (70% పైన) తక్కువ రాత్రి ఉష్ణోగ్రతలు (సుమారుగా 15 ° C) వున్నప్పుడు ఈ తెగులు త్వరగా విస్తరిస్తుంది. ఎతైన ప్రదేశాలలో ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయి. ఈ తెగులు మొక్క ఉత్పాదకతను దెబ్బతీస్తుంది. కొన్ని సందర్భాలలో పంట దిగుబడిని కూడా తగ్గిస్తుంది. సాధారణంగా ఇది తక్కువ ప్రాముఖ్యత కలిగిన సీజన్ చివర్లో వచ్చే తెగులుగా పరిగణించబడుతుంది.