వంకాయ

పండు మిరపలో ఎండు తెగులు

Phytophthora capsici

శీలీంధ్రం

క్లుప్తంగా

  • మొలకల మొదళ్ళ వద్ద కుళ్లిపోయి మొలకలు ఒక ప్రక్కకు వాలిపోతాయి.
  • నల్లని లేదా గోధుమరంగు గాయాలు కాండంపైన ఏర్పడతాయి.
  • ఆకులు మరియు పండ్లపై ముదురు పచ్చ రంగు నుండి గోధుమరంగు నీటిలో నానినట్టు వున్న మచ్చలు ఏర్పడతాయి.
  • విడిపోవడం మరియు ఎదుగుదల మందగించడం జరుగుతుంది.

లో కూడా చూడవచ్చు


వంకాయ

లక్షణాలు

పొడి ప్రాంతాలలో ఈ సంక్రమణము సాధారణంగా మొక్కల వేర్లు మరియు పై భాగములలో కనబడుతుంది. ఒక ప్రత్యేకమైన నల్లటి లేదా గోధుమరంగు మచ్చ మొక్కల వేర్ల దగ్గర మట్టి వద్ద కనపడుతుంది. తేమ అధికంగా వున్నప్పుడు మొక్క అన్ని భాగాలు ఈ తెగులుకు ప్రభావితం అవుతాయి. ఈ తెగులు సోకిన వేర్లు ముదురు గోధుమ రంగులోకి మారి మెత్తగా అయి మొలకలు నియంత్రణ కోల్పోవడానికి కారణం అవుతుంది. ఆకులు మరియు పండ్లపైన ముదురు ఆకుపచ్చ నుండి గోధుమ నీటిలో నానినట్టు వున్న మచ్చలు కనిపిస్తాయి. ఎదిగిన మొక్కలలో క్రౌన్ తెగులు చిహ్నాలు కనిపిస్తాయి. ముదురు గోధుమ పుండ్లు కాండాన్ని కప్పివేసి మొక్క చనిపోవడానికి కారణం అవుతాయి. పొలంలో పంట కోతల తర్వాత లేదా పండ్లు నిలువ ఉంచిన సమయంలో కూడా పండు కుళ్లిపోవచ్చు.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

బాక్టీరియా బర్కోల్దేరియ సేపాసియా (MPC-7)ను ఫైటోఫ్తోరా క్యాప్సిసి పై వ్యతిరేక ప్రభావం కోసం పరీక్షించినప్పుడు సానుకూల ఫలితాలు వెల్లడి అయ్యాయి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. మెఫినోక్సమ్ కలిగిన ఉత్పత్తులను మొక్కలపై స్ప్రే గా ఉపయోగించడము, మరియు రెండు వారాల తరువాత ఒక నిర్దిష్ట రాగి శిలీంద్ర నాసినిని వాడినట్లైతే ఇది ఆకులు ఎదిగే దశలో తెగులు సోకకుండా అడ్డుకుంటుంది. డ్రిప్ ఇరిగేషన్ పద్దతిలో క్రౌన్ తెగులు లక్షణాలు కనబడినపుడు పండ్లకు జరిగే నష్టాన్ని నియంత్రించడానికి మెఫినోక్సమ్ ను ఉపయోగించవచ్చు.

దీనికి కారణమేమిటి?

ఫైటోఫ్తోరా క్యాప్సిసి అనేది ఒక మట్టి ద్వారా సంక్రమించే తెగులు. ఇది తీవ్రమైన వాతావరణ పరిస్థితులకు తట్టుకొనగలదు. ఇది మొక్కల అవశేషాలపై మరియు ఇతర ప్రత్యమ్న్యాయ అతిధి మొక్కలపైనా మూడు సంవత్సరముల వరకు జీవించి ఉండగలదు. P. క్యాప్సిసి 7°C మరియు 37°C ల మధ్య పెరుగుతుంది. సుమారు 30°C వీటికి బాగా అనుకూలంగా ఉంటుంది. పెరిగిన ఉష్ణోగ్రత మరియు అధిక తేమ వాతావరణంలో ఈ తెగులు చాలా వేగంగా వృద్ధి చెందగలదు. చల్లని వాతావరణం ఈ తెగులు వ్యాపించకుండా చేస్తుంది.


నివారణా చర్యలు

  • నేల pH ను తనిఖీ చేయండి లైమ్ ను తగిన విధంగా సరిచేసుకోండి.
  • పొలం తయారి సమయంలో సేంద్రీయ ఎరువును జోడించండి.
  • ఈ తెగులును తట్టుకునే లేదా తెగులు నిరోధక విత్తన రకములను వాడండి.
  • ఈ తెగులుకు ఆతిధ్యం ఇవ్వని పంటలతో పంట మార్పిడి చేయండి.
  • నేల క్షయాన్ని అరికట్టుటకు అధికంగా నీటిని పెట్టకండి.
  • మురుగు నీరు సక్రంమంగా పారుటకు డోమ్ ఆకారంలో బెడ్లను తయారు చేసుకోండి.
  • నాటిన తరవాత మొక్క మొదళ్ళ వద్ద మట్టి జారిపోకుండా చూసుకోండి.
  • నేల తేమ స్థిరంగా ఉండుటకు ప్లాస్టిక్ ముల్చ్ ను ఉపయోగించండి.
  • ప్రత్యామ్న్యాయ అతిధి మొక్కలను పొలంలో మరియు చుట్టుప్రక్కల నుండి తొలగించండి.
  • సమతుల్య ఎరువును విడతల వారిగా నత్రజనితో కలిపి వాడండి.
  • పొలానికి ఉదయం పూట నీటిని పెట్టి మొక్కలు తడి ఆరునట్లు చేయండి.
  • మంచి పరిశుభ్రత ఉండునట్లు చూసుకోండి.
  • ముఖ్యంగా నీటి శుభ్రత, బట్టలు మరియు పరికరాలు.
  • 2-3 సంవత్సరాలకు ఒకసారి వ్యాధి సోకని రకాలతో పంట మార్పిడి చేయండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి