చెరుకు

చెరకులో సాధారణ తుప్పు తెగులు

Puccinia melanocephala

శీలీంధ్రం

క్లుప్తంగా

  • ప్రారంభ లక్షణాలు పొడువైన పసుపురంగు ఆకు మచ్చలు.
  • ఈ మచ్చలు క్రమంగా ఎరుపు-గోధుమ రంగులోకి మారుతాయి.
  • ఎక్కువగా ప్రభావితమైన ఆకులు పచ్చదనం కోల్పోవచ్చు.

లో కూడా చూడవచ్చు

1 పంటలు

చెరుకు

లక్షణాలు

చెరకులో తుప్పు తెగులు యొక్క ప్రారంభ లక్షణాలు 1-4 మిల్లి మీటర్లు పొడవైన పసుపు ఆకు మచ్చలు. వ్యాధి వృద్ధితో (ప్రధానంగా దిగువ ఆకు ఉపరితలంపై) ఆకుకు సమాంతరంగా మచ్చలు ఉంటాయి. ఇవి 20 మి.మీ పొడవు మరియు ఒకటి నుండి మూడు మి.మీ వెడల్పు వరకు విస్తరిస్తాయి. అవి చిన్నదైన ఖచ్చితమైన పాలిపోయిన వలయంతో నారింజ-గోధుమ లేదా ఎరుపు-గోధుమ రంగు మచ్చలుగా మారుతాయి. తరువాత, తుప్పు స్ఫోటములు కలిసిపోతాయి. ఇది ఆకు పైపొర యొక్క చీలిక మరియు నిర్జీవ ప్రాంతాల వృద్ధికి దారితీస్తుంది. సాధారణంగా ఆకు కొన దగ్గర ఈ మచ్చలు అధికంగా ఉంటాయి మరియు మొదలు వైపుకు తక్కువగా ఉంటాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

క్షమించండి, పుక్కినియా మెలనోసెఫాలాకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ చికిత్స గురించి మాకు తెలియదు. ఈ తెగులుతో పోరాడటానికి సహాయపడే పరిష్కారమార్గం ఏదైనా మీకు తెలిస్తే దయచేసి మమ్మల్ని సంప్రదించండి. మీ నుండి వినడానికి మేము ఎదురుచుస్తు ఉంటాము.

రసాయన నియంత్రణ

అందుబాటులో ఉంటే జీవ చికిత్సలతో పాటు నివారణ చర్యలతో సమగ్ర విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. శిలీంద్ర సంహారిణులతో చికిత్స ఆర్థికంగా అనుకూలం కాదు మరియు ఆచరణాత్మకం కాదు.

దీనికి కారణమేమిటి?

98% సాపేక్ష ఆర్ద్రత మరియు చల్లని రాత్రుల తరువాత 20°C మరియు 25°C మధ్య ఉష్ణోగ్రతలతో వెచ్చని రోజులు ఈ తెగులుకు అనుకూలంగా ఉంటాయి. నిరంతరం ఆకు తడిగా ఉండడం (తొమ్మిది గంటలు లేదా అంతకంటే ఎక్కువ) కూడా తెగులు వ్యాప్తికి తోడ్పడుతుంది. అనుకూలమైన పరిస్థితులలో దీని (పుక్కినియా మెలనోసెఫాలా) యొక్క సంక్రమణ చక్రం 14 రోజుల కన్నా తక్కువ. రెండు మరియు ఆరు నెలల వయస్సు గల మొక్కలు సాధారణ తుప్పు తెగులుకు ఎక్కువగా గురవుతాయి.


నివారణా చర్యలు

  • తెగులు నిరోధక రకాలను సాగుచేయండి.
  • నేల యొక్క సమతుల్య పోషక స్థితిని నిర్ధారించుకోండి.
  • వృద్ధి కాలంలో తగినంత నీటి సరఫరా ఉండేలా చూసుకోండి.
  • పొడవైన చాళ్లు లేదా జత చేసిన వరుస నాటు పద్ధతులను వర్తించండి.
  • ప్రభావిత పంటల యొక్క అవశేషాలను మరియు పంట చెత్తను తొలగించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి