Botryosphaeria dothidea
శీలీంధ్రం
చెట్ల బెరడు నుండి పెద్ద మొత్తంలో వెలువడే గమ్ (జిగట పదార్ధం) నుండి ఈ వ్యాధి పేరు వచ్చింది. వ్యాధికి ప్రారంభ లక్షణాలు అంటే కొమ్మలు,శాఖలు లేదా కాండం బెరడుపై కనిపించే 1–6 మిమీ వ్యాసం కలిగిన బొబ్బలు. ఈ బొబ్బలు సాధారణంగా వాటి మధ్యలో ఒక గుర్తు (లెంటిసెల్) ను కలిగి ఉంటాయి, ఇది వ్యాధికారకం యొక్క అసలు ప్రవేశ బిందువుకు సంబంధించి ఉంటుంది. సీజన్ ప్రారంభంలో సంక్రమణ సంభవిస్తుంది, కాని తరువాతి సంవత్సరంలో మాత్రమే లక్షణాలు గమనించవచ్చు. సాధారణంగా, చెట్టు ఎదుగుతునప్పుడు ఈ లెంటిసెల్ చాలా తక్కువగా కనిపిస్తుంది లేదా ఉండదు, కానీ దీని చుట్టుపక్కల ప్రాంతం నిర్జీవంగా మారి రంగు పాలిపోతుంది. ఈ గాయాలు, అధిక స్థాయిలో జేగురు-గోధుమ రంగు జిగురును స్రవిస్తాయి. భారీ వర్షాల తర్వాత ఇవి స్పష్టంగా కనిపిస్తాయి. తరువాత ఈ జిగురు ఎండిపోతుంది మరియు ముదురు గోధుమ లేదా నలుపు రంగులోకి మారుతుంది. 2 సెం.మీ కంటే పెద్ద గాయాలు కలిసి ప్రారంభమైనప్పుడు కాంకర్లు ఏర్పడటం మొదలవుతుంది. తీవ్రమైన ఇన్ఫెక్షన్లలో, అంతర్గత కణజాలాలు నిర్జీవం అవుతాయి మరియు మొత్తం శాఖ చుట్టూ నడికట్టులాగా ఏర్పడుతుంది. చివరికి దానిని చంపుతుంది. సాధారణంగా ఇది పువ్వులు, ఆకులు మరియు పండ్లకు సంక్రమించదు.
ఈ వ్యాధికి జీవ చికిత్స లేదు. కత్తిరింపు పరికరాలను శుభ్రం చేయడానికి తేలికపాటి బ్లీచ్ (10%) లేదా ఆల్కహాల్ ను రుద్దడం సరిపోతుంది మరియు తద్వారా తోటలో ఫంగస్ వ్యాప్తి చెందకుండా ఉంటుంది.
అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. బాహ్య కాంకర్ల లక్షణాలను తగ్గించడానికి శిలీంద్ర నాశినులను ఉపయోగించవచ్చు కాని వ్యాధికారకం యొక్క దీర్ఘకాలిక నియంత్రణను ఇవి అందించదు. క్రెసోక్సిమ్-మిథైల్ మిశ్రమాలు మరియు ట్రైఫ్లోక్సిస్ట్రోబిన్ ఆధారంగా శిలీంద్రనాశకాలు సిఫార్స్ చేయబడిన మోతాదుల్లో వాడినప్పుడు కాంకర్ల సంభవం మరియు పరిమాణాన్ని స్థిరంగా తగ్గిస్తాయి. ఎయిర్-బ్లాస్ట్ స్ప్రేయర్ వుపయోగించి క్రెసోక్సిమ్-మిథైల్ ను పిచికారీ చేసినప్పుడు కూడా ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది
ఒకే కుటుంబంలోని ఇతర శిలీంధ్రాల ప్రమేయం ఉన్నప్పటికీ ప్రధానంగా బొట్రియోస్ఫేరియా డోతిడియా అనే ఫంగస్ వల్ల లక్షణాలు సంభవిస్తాయి. సంక్రమణ కాలాల మధ్య, వ్యాధి సోకిన బెరడు మరియు చనిపోయిన కొమ్మలలో ఈ వ్యాధికారకాలు జీవిస్తాయి. ఇవి వసంతకాలంలో బీజాంశాలను ఉత్పత్తి చేయటం ప్రారంభిస్తాయి మరియు ఒక సంవత్సరం వరకు అలా కొనసాగిస్తాయి. ఈ బీజాంశాలను వర్షపు బిందువుల ద్వారా వెదజల్లబడతాయి లేదా లేదా నీటిపారుదల ద్వారా తోట అంత విస్తరిస్తాయి. సాధారణంగా కొత్త చెట్లను అప్పటికే ఉన్న గాయాలు లేదా లెంటిసెల్స్ అనే బెరడుపై వుండే సహజ గుర్తుల ద్వారా సంక్రమిస్తాయి. తడి మరియు తేమతో కూడిన పరిస్థితులు సంక్రమణ ప్రక్రియకు అనుకూలంగా ఉంటుంది. భౌతిక లేదా రసాయన గాయాలు మరియు ఇతర వ్యాధికారక కారణాలు (ఉదాహరణకు నీటి ఒత్తిడి) కూడా గమ్మోసిస్ కు కారణమవుతాయి. సరిగ్గా నిర్వహించని తోటలు ముఖ్యంగా ఈ తెగులు భారిన పడే అవకాశం ఉంది. ఇప్పటివరకు, అందుబాటులో ఉన్న చెట్ల రకాలు ఏవీ ఫంగల్ గుమ్మోసిస్‌కు నిరోధక స్థాయిలను కలిగి లేవు.