Polystigma ochraceum
శీలీంధ్రం
ఆకులకు రెండు వైపులా లేత ఆకుపచ్చ రంగు మచ్చలుగా లక్షణాలు ప్రారంభమై తరువాత పసుపు-నారింజ ప్యాచీలుగా మారుతాయి. ఈ ప్యాచీలు వసంతకాలమంతటా పరిమాణంలో పెరుగుతాయి మరియు క్రమంగా ఒకదానితో మరొకటి కలిసిపోతాయి, వేసవి చివరిలో ఆకు ఈనెల మధ్యభాగంలో ఎక్కువ భాగాన్ని కవర్ చేస్తాయి. అవి వ్యాపించినప్పుడు, వాటి మధ్యభాగం ముదురు రంగులోకి మారుతుంది మరియు క్రమరహితంగా మారుతుంది, చుట్టూ గోధుమ రంగు వలయం ఏర్పడుతుంది. వ్యాధి వృద్ధి చెందే అడ్వాన్స్ దశల్లో కొనలు లేదా అంచుల నుండి ఆకులు వంకర్లు తిరిగి నిర్జీవంగా మారుతాయి. ఎర్రటి ఆకు మచ్చ తెగులు వల్ల ఆకులు అకాలంగా రాలిపోతాయి. అందువల్ల కిరణజన్య సంయోగక్రియ సామర్థ్యం తగ్గుతుంది. ఇది దిగుబడిని ప్రభావితం చేస్తుంది.
ఈ వ్యాధికారకానికి జీవ నియంత్రణ అందుబాటులో లేదు. సేంద్రీయ శిలీంద్ర నాశినులైన కాపర్ ఆక్సిక్లోరైడ్ (2 గ్రా/లీ), కాపర్ హైడ్రాక్సైడ్ (2 గ్రా/లీ) మరియు బోర్డియక్స్ మిశ్రమం (10 గ్రా/లీ)ఆకు సంక్రమణను గణనీయంగా తగ్గిస్తాయి. పూరేకులు రాలిన తర్వాత ఒకసారి మరియు 14 రోజుల వ్యవధిలో రెండవసారి శిలీంద్ర నాశిని వాడకం వ్యాధిని తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది.
అందుబాటులో ఉంటే జీవ చికిత్సలతో పాటు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్ని ఎల్లప్పుడూ పరిగణలోకి తీసుకోండి. మాంకోజెబ్ మరియు సంబంధిత డైతియోకార్బమేట్స్ (2 గ్రా/లీ).శిలీంద్ర నాశినులు ఆకు సంక్రమణను గణనీయంగా తగ్గిస్తాయి. పూరేకులు రాలిన తర్వాత ఒకసారి మరియు 14 రోజుల వ్యవధిలో రెండవసారి శిలీంద్ర నాశిని వాడకం వ్యాధిని తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది.
పాలిస్టిగ్మా ఓక్రేసియం అనే శిలీంధ్రం వల్ల లక్షణాలు సంభవిస్తాయి. ఇది జీవించి ఉన్న ఆకులపై ప్రకాశవంతమైన రంగురంగుల శిలీంధ్ర నిర్మాణాలను ఏర్పరుస్తుంది మరియు కుళ్ళిన పదార్ధాలను తిని బ్రతికే జీవి (సప్రోఫైట్) లాగ చెట్టు శిధిల అవశేషాలపై శీతాకాలంలో మనుగడ సాగిస్తుంది. ఈ రాలిన ఆకులపై ఫంగస్ పునరుత్పత్తి నిర్మాణాలను ఏర్పరుస్తుంది, ఇది పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు తర్వాత వచ్చే వసంతకాలంలో బీజాంశాలను విడుదల చేస్తాయి. పుష్పించే సమయంతో బీజాంశం విడుదల ప్రారంభమవుతుంది మరియు పూరేకులు రాలినప్పుడు పతాకస్థాయికి చేరుతుంది. ఈ ఫంగస్ కిరణజన్య సంయోగక్రియ రేటు మరియు చెట్ల ఉత్పాదకతను ప్రభావితం చేస్తుంది.