Togninia minima
శీలీంధ్రం
పంట సీజన్ సమయంలో ఎప్పుడైనా ఈ వ్యాధి సంభవించవచ్చు. ప్రధాన లక్షణం ఈనెల మధ్యన "చారలు" ఏర్పడడం. ప్రధాన ఈనెల చుట్టూ వున్న కణజాలం ఎండిపోవడం మరియు రంగు పాలిపోవడం ద్వారా ఇది వర్ణించబడుతుంది. సాధారణంగా ఎరుపు రకాల్లో ఇది ముదురు ఎరుపు మరియు తెలుపు రకాల్లో పసుపు రంగులో కనిపిస్తుంది. ఆకులు పూర్తిగా ఎండిపోయి ముందుగానే రాలిపోతాయి. బెర్రీలపై, తరచూ గోధుమ- ఊదా రంగు వలయం అంచుతో చిన్న, గుండ్రని, ముదురు మచ్చలు కనిపించవచ్చు. ఈ పండ్ల మచ్చలు పండ్లు ఏర్పడినప్పట్నుండి పండించడం వరకూ మధ్యలో ఎప్పుడైనా కనిపించవచ్చు. తీవ్రంగా ప్రభావితమైన మొక్కల్లో బెర్రీలు తరచుగా పగిలిపోయి ఎండిపోతాయి. ఈ తెగులు ప్రభావికి గురైన వెదురు, స్పర్స్, కార్డన్స్ లేదా కాండాలను అడ్డంగా కోసినప్పుడు ముదురు రంగుతో ఏర్పడిన కేంద్రీకృతమైన వలయాలు కనపడతాయి. "అపోప్లెక్సీ" అని పిలువబడే ఎస్కా యొక్క తీవ్రమైన రూపం మొత్తం ద్రాక్ష మొక్క ఆకస్మిక డై బ్యాక్ కు దారితీస్తుంది.
నిద్రావస్థలో వున్న ముక్కలను 30 నిమిషాల పాటు వేడి నీటిలో 50°C వద్ద నానబెట్టండి. ఈ చికిత్స ఎల్లప్పుడూ ప్రభావవంతంగా ఉండదు. అందువలన ఇతర పద్ధతులతో కలిపి దీనిని ఉపయోగించాలి. ఈ తెగులు కత్తిరింపు గాయాలకు సంక్రమించకుండా నిరోధించడానికి కొన్ని జాతుల ట్రైకోడెర్మాను కూడా ఉపయోగిస్తున్నారు. అంటు కట్టడానికి ఉపయోగించే మొక్క పదార్ధం యొక్క చివరలు మరియు అంటుకట్టు యూనియన్ల సంక్రమణను నివారించడానికి ట్రైకోడెర్మా యొక్క కొన్ని జాతులు ఉపయోగించబడ్డాయి. కత్తిరింపు చేసిన 24 గంటలలోపు మరియు 2 వారాల తరువాత మళ్ళీ ఈ చికిత్స చేయవలసి ఉంటుంది.
అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. ఈ వ్యాధిని నియంత్రించడానికి రసాయన వ్యూహాలు చాలా కష్టం, ఎందుకంటే గాయాలకు రక్షణ కల్పించే సాంప్రదాయ రక్షకులు, శిలీంధ్రాలను ప్రభావితం చేయడానికి, నిద్రాణ స్థితిలో వున్న మొక్కల కత్తిరింపు లోపలి వరకు ప్రవేశించలేవు. కాండానికి సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు నివారణ పద్ధతులు అత్యంత ప్రభావవంతంగా ఉంటాయి. ఉదాహరణకు, అంటుకట్టుటకు ముందు, మొక్కల పెరుగుదల నియంత్రకాలు లేదా శిలీంద్ర నాశినులు కలిపిన ప్రత్యేకమైన మైనంలో ద్రాక్షతీగలను ముంచవచ్చు. ఇది అంటుకట్టిన ప్రాంతంలో కల్లస్ వృద్ధిని ప్రోత్సహిస్తుంది మరియు శీలింద్ర కలుషితాన్ని నిరోధిస్తుంది.
ఈ లక్షణాలు ప్రధానంగా టోగ్నినియా మినిమా అనే ఫంగస్ వల్ల సంభవిస్తాయి, కాని ఇతర శిలీంధ్రాల వలన కూడా ఈ తెగులు సంక్రమించవచ్చు (ఉదాహరణకు ఫేమోనియెల్లా క్లామిడోస్పోరా). వాస్తవానికి, సంక్రమణ చిన్న తీగలలో సంభవిస్తుంది, అయితే 5-7 సంవత్సరాల తరువాత ద్రాక్షతోటలలో మొదట ఈ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. తీగలలోని చెక్క భాగాలలో నిక్షిప్తం చేయబడిన నిర్మాణాలలో శిలీంధ్రాలు శీతాకాలంలో మనుగడ సాగిస్తాయి. శీతాకాలం నుండి వసంత కాలం వరకు వర్షం కురిసే సమయంలో బీజాంశాలు ఉత్పత్తి చేయబడి విడుదల చేయబడతాయి అలాగే మొక్కల నిద్రావస్థలో కత్తిరింపు చేసినప్పుడు అయిన గాయాలకు సంక్రమిస్తాయి. కత్తిరింపు తర్వాత చాలా వారాల పాటు గాయాలు సంక్రమణకు గురయ్యే అవకాశం వుంది. గాయానికి సంక్రమించిన తర్వాత ఇది శాశ్వతంగా అదే ప్రాంతంలో వుండే కలప సంక్రమణను ఏర్పరుస్తుంది. దీనిని శిలీంద్ర నాశినులను వుపయోగించి నిర్మూలించడం కుదరదు.