Phytophthora spp.
శీలీంధ్రం
ఈ తెగులు లక్షణాలు చాలా రకాల వేరు వ్యాధుల లక్షణాలను పోలి ఉంటాయి. చిన్న చిన్న మరియు కొద్దిగా రంగు కోల్పోయిన ఆకులు, పండ్లు సరిగా తయారవ్వకపోవడం మరియు అంతర్గత కణజాలం కుళ్ళిపోవడం ఈ క్రౌన్ మరియు వేరు తెగులు యొక్క ప్రధాన సంకేతాలు. తెగులు సోకిన తీగలు లేదా చెట్లు కుంగిపోవచ్చు మరియు చిన్న ఆకులు ముందుగానే రాలిపోవచ్చు. బెరడు కుళ్లిపోయిన లక్షణాలను బహిర్గతం చేయవచ్చు మరియు కొన్ని సార్లు జిగురు చుక్కలు కనిపిస్తాయి. కాండం మొదలును అడ్డంగా కోసినట్లయితే చెట్టు పైనుండి వేర్ల వరకూ ఎర్రటి గోధుమ రంగు నిర్జీవమైన క్యాంకర్లు కనపడతాయి. ఈ క్యాంకర్లు చివరికి చెట్టు కాండం మొదలుకు పట్టీ లాగ చుట్టుముడతాయి. దీనివలన నీరు మరియు పోషకాలు, పై భాగాలకు రవాణా కావడంలో అవరోధం ఏర్పడుతుంది. చివరికి చిగుర్లనుండి ప్రారంభమై కొమ్మలు చనిపోతాయి. తీగలు లేదా చెట్లు క్రమక్రమంగా చనిపోతాయి మరియు సులభంగా మట్టిలో నుండి బయటకు తీయవచ్చు.
యాంటీ ఫంగల్ జీవ చికిత్సలు చేయవచ్చు, ఉదాహరణకు బోర్డియక్స్ మిశ్రమంతో గాయాలు మరియు కత్తిరింపుకు గురైన కోతలపైన పూయడం. అదే సమ్మేళనంతో చేసే నివారణ చికిత్స కూడా దాడులను తగ్గిస్తుంది. చెట్లు విస్తృతంగా ప్రభావితమైనప్పుడు, ఈ తెగులును నిర్మూలించడం సాధ్యపడదు మరియు నివారణ చర్యలు మాత్రమే దాని తీవ్రతను తగ్గించడంలో సహాయపడతాయి.
అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. నీటిపారుదల ద్వారా శిలీంద్ర నాశినులను ఉపయోగించడం చెట్లు మరియు తీగలకు చికిత్స చేయడానికి ఒక సమర్థవంతమైన మార్గం. ఈ తెగులు లక్షణాలు కనపడిన వెంటనే ఫోసెటైల్ అల్యూమినియం, మెటలాక్సిల్ లేదా మిథైల్ థియోఫనేట్-మిథైల్ ఆధారిత శిలీంద్ర నాశినులతో చెట్ల మొదలు వద్ద బాగా నీరు పెట్టండి. తెగులు వ్యాప్తి చెందకుండా ఉండటానికి, వ్యవసాయ ఉపకరణాలు ఉపయోగించిన తర్వాత బ్లీచ్‌తో శుభ్రం చేయండి.
ఫైటోఫ్థోరా జాతికి చెందిన అనేక జాతుల ఫంగస్ వల్ల ఈ లక్షణాలు సంభవిస్తాయి. ఒకసారి పొలంలోకి ప్రవేశించిన తర్వాత చాలా సంవత్సరాల వరకూ ఇవి మట్టిలో జీవించగలవు మరియు వీటిని నిర్మూలించడం అసాధ్యం. ఈ శిలీంధ్రాలు అధిక నేల తేమ స్థాయిలపైన మరియు వాటి వృద్ధికి తేమ, వేడి వాతావరణంపై ఆధారపడతాయి. ఈ తెగులు సోకిన తీగలు లేదా చెట్లు నీటి పారుదల సరిగా లేని ప్రాంతాలు, తరుచూ వరదలు లేదా అధిక నీటిపారుదలతో సంబంధం కలిగి ఉండి తరచుగా ఒకొక్కటిగా లేదా పొలంలో చిన్న సమూహాలుగా కనిపిస్తాయి. బిందు సేద్యపు ద్రాక్షతోటలు లేదా పండ్ల తోటలలో, నేరుగా వాల్వ్ కింద ఉన్న కాండం పైన నీరు నేరుగా పడడం వలన అప్పుడప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తాయి. తెగులు సోకిన మొక్క పదార్ధాలను అంటుకట్టే సమయంలో రవాణా చేసినప్పుడు కూడా ఈ తెగులు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది.