Phomopsis viticola
శీలీంధ్రం
శీతాకాలంలో, నిద్రావస్థలో వున్న గెడలు, నల్లని మచ్చలతో వెలిసిపోయినట్లు వున్న తెల్లని ప్రాంతాలు కలిగివుంటాయి. పెద్ద పసుపు రంగు వలయంతో అనేక చిన్న చిన్న, ముదురు గోధుమ రంగు చుక్కలు కింద ఆకులపైన కనిపిస్తాయి. ఈ మచ్చల మధ్య ప్రాంతం ఎండిపోయి రాలిపోయి మచ్చలు షాట్-హోల్ రూపాన్ని గాయానికి అందిస్తుంది. తీవ్రంగా తెగులు సోకిన ఆకులు వంకర్లు తిరిగి పెళుసుగా మారి ముందుగానే రాలిపోతాయి. చిగుర్లు, ఆకు కాడలు మరియు ఆకు రెమ్మలపై గోధుమ రంగు నుండి నలుపు రంగు పొడవాటి మచ్చలు ఏర్పడతాయి లేదా చారలు ఏర్పడతాయి. ఇవి తరచూ కలిసిపోయి ముదురు పొక్కులుగా మారి కణజాలాలను చుట్టుముట్టవచ్చు లేదా చీల్చవచ్చు. దీని ఫలితంగా చిగుర్లు వైకల్యం చెందడం లేదా చనిపోవడం జరుగుతుంది. తరువాత సీజన్లో, తొడిమ మరియు ద్రాక్ష పండ్లు కూడా ఈ లక్షణాలను చూపుతాయి. పైన నల్లని చుక్కలతో, పండ్లు గోధుమ రంగుతో, తోలు (మమ్మీఫికేషన్) గా మారుతాయి. తెగులు సోకిన తొడిమలు ఎండిపోతాయి. దీని వలన ద్రాక్ష పండ్లు లేదా మొత్తం ద్రాక్ష గుత్తులు ముందుగానే రాలిపోతాయి.
క్షమించండి, ఫోమోప్సిస్ విటికోలాకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ చికిత్స గురించి మాకు తెలియదు. ఈ వ్యాధితో పోరాడటానికి సహాయపడేది ఏదైనా మీకు తెలిస్తే దయచేసి మమల్ని సంప్రదించండి. మీ నుండి వినడానికి ఎదురు చూస్తున్నాము.
అందుబాటులో ఉంటే, వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. కొత్త కణజాలాలు కలుషితం అయిన తర్వాత అందుబాటులో ఉన్న రసాయనాలు ఈ తెగులును నిర్మూలించవు, కానీ దాని ప్రభావాలను పరిమితం చేస్తాయి. ఈ మందులు వాడడానికి కాలానుగుణ సమయాన్ని అనుసరించడం ముఖ్యం. సిఫార్స్ చేయబడిన మందుల్లో ఫ్లూజినామ్, మాంకోజెబ్, డిథియానాన్, జిరామ్ మరియు కప్టాన్ ఉన్నాయి. వర్షాలు కొనసాగినట్లైతే కొత్తగా వృద్ధి చెందుతున్న మొక్కలను కాపాడటానికి అదనంగా ఈ మందులు వాడవలసిన అవసరం ఉంటుంది.
తెగులు సోకిన ద్రాక్ష తోట (మొగ్గలు, బెరడు, మమ్మీ గా మారిన ద్రాక్ష పండ్లు మరియు గెడలు) యొక్క కణజాలాలలో ఫంగస్ చాలా సంవత్సరాలు జీవించి ఉండగలదు. వసంత ఋతువులో తడి, తేమతో కూడిన వాతావరణ పరిస్థితులలో బీజాంశాలను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. తరువాత నీరు మరియు వర్షపు తుంపర్ల ద్వారా ఈ బీజాంశాలు అదే మొక్కలో కొత్తగా వృద్ధి చెందుతున్న కణజాలాలకు వ్యాప్తి చేస్తుంది. 23°C ఉష్ణోగ్రత వద్ద కనీసం 10 గంటల పాటు చెమ్మగిల్లడం కొనసాగితే బీజాంశాలు విడుదలవుతాయి. 1 నుండి 30°C మధ్య ఉష్ణోగ్రత వద్ద ఎదిగే మరియు సంక్రమించే సామర్థ్యాన్ని ఈ ఫంగస్ కలిగి ఉంటుంది. ముఖ్యంగా పూలు వికసించే, పండ్లు ఏర్పడే సమయంలో, సుదీర్ఘమైన వర్షం, చల్లని వాతావరణం ఈ తెగులును ప్రోత్సహిస్తుంది. వ్యాధికారక సూక్ష జీవులు ఒక తీగ నుండి మరొక తీగకు కాకుండా ఒకే తీగ లోపల వ్యాపిస్తాయి. తెగులు సోకిన మొక్కల పదార్థాలు లేదా నర్సరీ స్టాక్ రవాణా ద్వారా ఈ తెగులు దూర ప్రాంతాలకు విస్తరిస్తుంది.