ఇతరములు

డెడ్ ఆర్మ్

Eutypa lata

శీలీంధ్రం

క్లుప్తంగా

  • కాండం లోపలిభాగం కుళ్లిపోవడం దీని లక్షణం.
  • కాండాన్ని నిలువుగా కత్తిరించి చూస్తే గోడలు ఆకృతిలోఅంతర్గత కణజాలపు కేన్కర్ కనిపిస్తుంది.
  • ఆకులపైన రంగు కోల్పోయిన ( క్లోరోటిక్) మచ్చలు, నిర్జీవంగా వున్న ఆకు అంచులు మరియు ఆకు పైపొర బొడిపె వలే పైకి ఉబ్బడం వంటి లక్షణాలు ఏర్పడే అవకాశం ఉంది.

లో కూడా చూడవచ్చు

10 పంటలు
బాదం
ఆపిల్
అప్రికోట్
చెర్రీ
మరిన్ని

ఇతరములు

లక్షణాలు

కాండం లోపలిభాగం కుళ్లిపోవడం దీని లక్షణం. ఈ తెగులు విస్తరించే కొలదీ ఒకటి లేదా అంత కన్నా ఎక్కువగా కొమ్మలు చనిపోతాయి. అందువల్లనే ఈ తెగులును "డెడ్ ఆర్మ్" అనే పేరు. కాండాన్ని నిలువుగా కత్తిరించి చూస్తే గోడలు ఆకృతిలోఅంతర్గత కణజాలపు కేన్కర్ కనిపిస్తుంది. నిర్జీవమైన బెరడు ప్రాంతంలో బొగ్గులాగా ఫంగల్ ఎదుగుదల కనిపిస్తుంది. ఈ తెగులు ఆకులపైన కూడా కనిపిస్తుంది. ఆకులపైన రంగు కోల్పోయిన ( క్లోరోటిక్) మచ్చలు, నిర్జీవంగా వున్న ఆకు అంచులు మరియు ఆకు పైపొర బొడిపె వలే పైకి ఉబ్బడం వంటి లక్షణాలు ఏర్పడే అవకాశం ఉంది. కణుపులు చిన్నగా ఉండి చిగుర్ల ఎదుగుదల తగ్గుతుంది. చిగుర్లు రంగు కోల్పోతాయి. పుష్ప గుచ్చాలు ఏర్పడకపోవడం కానీ లేదా వృద్ధి చెందకుండా రాలిపోవడం కానీ జరుగుతుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

బాసిల్లస్ సబ్టిలిస్ లాంటి వాణిజ్యపరమైన ఫార్మ్యులేషన్లు కత్తిరించిన భాగంలో వాడవచ్చు. కొమ్మలను కత్తిరించిన ప్రాంతంలో కాపర్ ఆధారిత ఉత్పత్తులను వాడడం వలన ఫంగల్ ఇన్ఫెక్షన్లను తర్వాత రాకుండా నివారించవచ్చు.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. మైక్లోబుటానిల్, థియోఫనేట్- మిథైల్ మరియు టెట్రాకోనజోల్ మందులను యుటైపాడై బ్యాక్ వంటి కేన్కర్ తెగుళ్లను నియంత్రించడానికి ఉపయోగించవచ్చు. కొమ్మలను కత్తిరించిన వెంటనే ముందు జాగ్రత్త చర్యగా వీటిని ఉపయోగించవచ్చు. 5% బోరిక్ యాసిడ్ ని ఆక్రేలిక్ పెయింట్ లేదా ఎస్సెన్షియల్ ఆయిల్ తో కలిపి ఈ గాయాలపైన రాయడం వలన కూడా బాగా పనిచేస్తుంది.

దీనికి కారణమేమిటి?

ఈ తెగులు యుటైపా లటా అనే ఫంగస్ వలన సంక్రమిస్తుంది. ఇది సాధారణంగా పాత ద్రాక్ష తోటలు లేదా తోటలలో కనిపిస్తుంది. కలుషితమైన కాండం పైన జీవించే ఫంగస్ బీజాంశాల వలన ప్రాధమికంగా ఈ తెగులు సంక్రమిస్తుంది. వసంత ఋతువులో ఈ బీజాంశాలు వర్షపు జల్లులవలన వ్యాపించి ఇంకా తెరుచుకొని మొగ్గలపైకి చేరతాయి. తరువాత మొక్కలకు తగిలిన గాయాల ద్వారా లేదా ఆకులపైన వున్న రంద్రాల ద్వారా మొక్కలోకి ప్రవేశిస్తాయి. ఒకసారి లోపలికి ప్రవేశించిన తర్వాత ఇది చాలా మెల్లగా సంవత్సరాల తరబడి వ్యాపిస్తుంది. ఇది నాళాల కణజాలాన్ని దెబ్బ తీస్తుంది. తరువాత దశలో ఇది రెమ్మలను లేదా కొమ్మలను చుట్టుముట్టి చెట్టు పై భాగాలకు మరియు తీగలకు నీరు మరియు పోషకాలను అందకుండా చేస్తుంది. ఈ బీజాంశాల అంకురోత్పత్తికి 20°C నుండి 25°C ఉష్ణోగ్రత దోహదకరంగా ఉంటుంది. యుటైపా లటా యాపిల్, పీర్ మరియు చెర్రీ చెట్లకు కూడా సంక్రమిస్తుంది. మౌంటెన్ యాష్, కార్క్ ఓక్ లేదా బ్లాక్ తోర్న్ వంటి చెట్లు దీనికి అతిధేయులుగా ఉండి దీని ఇనాక్యులమ్ కు రిజర్వాయర్ వలే ఉంటాయి.


నివారణా చర్యలు

  • తోటను గమనిస్తూ ఈ తెగులు లక్షణాలు వున్న తీగలను తొలగించడానికి గుర్తులు పెట్టండి.
  • పొలంలోని పాత తీగలను తొలగించి నాశనం చేయండి.
  • తడి వాతావరణానికి ముందు మరియు తర్వాత చెట్లను కత్తిరించకండి.
  • కేన్కర్ కు క్రింద వున్న తెగులు సోకిన కొమ్మను నరికి కొత్త చిగుర్లు మళ్లీ వచ్చేటట్టు చూడండి.
  • ప్రూనింగ్ ను ఆలస్యం చేయడం లేదా అధికంగా ప్రూనింగ్ చేయడం వలన కూడా ఈ తెగులును సమర్ధవంతంగా నియంత్రించవచ్చు.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి