నిమ్మజాతి

సిట్రుస్ యొక్క గమ్మోసిస్

Phytophthora spp.

శీలీంధ్రం

క్లుప్తంగా

  • నేల అంచు నుండి విస్తరించిన బెరడులో ముదురురంగు నీటిలో నానబెట్టినట్టు వున్న ప్రాంతం కనిపిస్తుంది.
  • పొడి వాతావరణంలో బెరడులోని పగుళ్ల నుండి నీటిలో కరిగే జిగురు స్రవిస్తుంది.
  • మట్టి క్రింద ఉన్న బెరడు నీటిలో నానబెట్టినట్టు ఉంటుంది.
  • ఈ ప్రాంతం ఎర్రటి-గోధుమ రంగు నుండి నలుపు రంగులో ఉంటుంది.
  • నిర్జీవ ప్రాంతాలు లోపలి కణజాలాలకు వ్యాపించి, బెరడును చుట్టుముట్టవచ్చు, ఇది కుప్పకూలిపోవడానికి దారితీయవచ్చు.

లో కూడా చూడవచ్చు


నిమ్మజాతి

లక్షణాలు

ఫుట్ రాట్ లేదా గమ్మోసిస్ యొక్క లక్షణాలు తరచూ నేల మట్టం సమీపంలో కనిపిస్తాయి. ముదురు నీటిలో నానబెట్టినట్టు వున్న ప్రాంతాలు బెరడులో ఏర్పడతాయి మరియు తడి పరిస్థితులలో వాటి నుండి చేదు వాసన రావచ్చు. బెరడులోని పొడవాటి పగుళ్ల నుండి నీటిలో కరిగే జిగురు స్రవిస్తుంది, ముఖ్యంగా పొడి వాతావరణంలో. గోధుమరంగు నిర్జీవ ప్రాంతాలు చెక్క అంతర్గత కణజాలాలకు విస్తరించవచ్చు. ఆకులు పోషకాహార లోపం కారణంగా పసుపు రంగులోకి మారుతాయి. తరువాత దశలలో చనిపోయిన బెరడు ఎండిపోతుంది, కుంచించుకుపోతుంది,చీలుతుంది మరియు అతుకులు రాలిపోవచ్చు, ఆలా కాండంపై తెరుచునట్టు వున్న కోతను మిగులుస్తుంది. శిలీంధ్రం బెరడును చుట్టుముట్టినట్లయితే చెట్లు కూలిపోయి చనిపోతాయి. ఇన్ఫెక్షన్ సోకిన పండ్లు మృదువైన గోధుమ కుళ్ళును వ్యాపింపచేసి ఒక గాఢమైన వాసనను ఉత్పత్తి చేస్తాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

4 నుండి 10 నిమిషాల పాటు వేడి నీటిలో(సుమారు 49 డిగ్రీలు) విత్తనాలను ఉంచడం వలన విత్తనాల ద్వారా సోకే తెగుళ్లు నిర్మూలించబడుతుంది. మైక్రో ఇర్రిగేషన్ పద్దతి ద్వారా క్లోరిన్ ను మొక్కలకు అందచేయడం ద్వారా ఈ తెగులును తగ్గించవచ్చు. కొన్ని ఫంగల్ లేదా బాక్టీరియల్ జాతులు (ట్రైకోడెర్మా spp మరియు బాసిల్లస్ spp.) ఫైటోఫ్థోరా ను సమర్ధవంతంగా నియంత్రిస్తాయి అని నిరూపించబడినది. ఈ తెగులు ప్రారంభ దశల్లో రాగి శీలింద్ర నాశినులను వాడడం వలన మంచి ఫలితం ఉంటుంది.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. మెటాలక్సిల్ మరియు ఫోసేటిల్-అల్యూమినియం కలిగిన ఫంగిసైడ్స్ తోటలో వాడడం వలన ఈ ఫంగస్ ను నియంత్రించవచ్చు. ఆకులపై ఫాసెటిల్-అల్యూమినియం ను పిచికారీ చేయడం వలన మరియు మెటాలక్సిల్ తో మట్టిని బాగా తడపడం వలన చాలా మంచి ఫలితాలు ఇవ్వబడ్డాయి. పంట కోతకు ముందు స్ప్రేలు మరియు కోత తర్వాత పండ్లకు డిప్ ట్రీట్మెంట్స్ రెండింటినీ మరియు/లేదా ముంచి ఉంచేటట్టు చుట్టపెట్టడం వలన సిఫార్సు చేయబడింది.

దీనికి కారణమేమిటి?

ఈ తెగులు లక్షణాలు ఫైటోఫ్థోరా యొక్క వివిధ జాతుల శిలీంధ్రాల ద్వారా కలుగుతాయి. ఇవి అనుకూలమైన పరిస్థితులలో (అధిక తేమ మరియు అధిక ఉష్ణోగ్రతలు) కొంచెం దూరం వరకు నీటిలో ఈద గల బీజాంశాలను పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేస్తాయి. ఈ బీజాంశాలు చెట్ల వేర్లకు వర్షం లేదా నీటిపారుదల ద్వారా రవాణా చేయగల సంక్రమణ కారకాలు. ఇవి మొలకెత్తి వేరు కొనలోకి ప్రవేశిస్తాయి. దీని ఫలితంగా మొత్తం వేరు బలహీనపడుతుంది. తరువాత ఇది మిగిలిన వేరుకు విస్తరిస్తుంది. ఈ బీజాంశాలు ఒక గాయం మీద లేదా కాండం మొదలుచుట్టూ వున్న బెరడు చీలికలోకి చిమ్మినప్పుడు ఫుట్ రాట్ లేదా గమ్మోసిస్ ఏర్పడతాయి. చెట్టు యొక్క గ్రహణశీలత దానిలో వున్న ఫైటోప్తోరా జాతులపై ఆధారపడి ఉంటుంది మరియు ప్రబలమైన పర్యావరణ పరిస్థితులు ద్వారా (నేల రకం, నీటి ఉనికి) బాగా ప్రభావితమవుతుంది.


నివారణా చర్యలు

  • ధృవీకరించబడిన మూలాల నుండి విత్తనాలు కొనండి.
  • తోట కోసం తెగులు నిరోధక లేదా తట్టుకునే రకాలను ఎంచుకోండి.
  • నర్సరీ ప్రాంతంలో మంచి నీటి పారుదల సౌకర్యం ఉండాలి.
  • పొలంలో ఉపయోగించడానికి ముందు పరికరాలను పనిముట్లను తప్పక శుభ్రపరచండి.
  • ఈ తెగులు వలన నష్టపోకుండా ఉండడానికి వంపు తిరిగిన మడులపైన చెట్లను నాటండి.
  • ముఖ్యంగా కాండం మొదలు సమీపంలో గాయపడకుండా చూడండి.
  • చనిపోయిన లేదా ఇన్ఫెక్షన్ సోకిన చెట్టు పదార్థాన్ని వెంటనే తొలగించండి.
  • ఈ తెగులు చిహ్నాలు కోసం తోటను క్రింద మొదటి పార్శ్వ వేర్ల వరకు క్రమం తప్పకుండా పరిశీలించండి.
  • కందకం యొక్క నీటిపారుదల నీరు చెట్ల కాండానికి తగలకుండా చూడండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి