నిమ్మజాతి

మెలనోస్

Diaporthe citri

శీలీంధ్రం

క్లుప్తంగా

  • పండ్ల మీద చమురు గ్రంధుల చుట్టూ బాగా చిన్న ఎరుపు-గోధుమ రంగు నుండి ముదురు గోధుమ రంగు మచ్చలు.
  • దెబ్బతిన్న కణజాలం మరియు పగుళ్ళు ఏర్పడతాయి మరియు పండ్లు ముందుగానే రాలిపోవచ్చు.
  • ఆకులపై ఎరుపు-గోధుమ జిగురుతో ముంచిన మరియు కొద్దిగా ఉబ్బిన పసుపు వలయం గల చిన్న గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి.

లో కూడా చూడవచ్చు


నిమ్మజాతి

లక్షణాలు

మెలనోస్ లక్షణాలు పరిపక్వత యొక్క చివరి దశలలో పండ్ల మీద (0.2 - 1.5 మిమీ పరిమాణం గల) ఎర్రటి-గోధుమ రంగు నుండి ముదురు-గోధుమ రంగు మచ్చలుగా కనబడతాయి. చర్మం మీద ఉన్న నూనె గ్రంధుల చుట్టూ మచ్చలు ఏర్పడతాయి. సంక్రమణ జరిగేసమయంలో దెబ్బతిన్న కణజాలం మరియు పగుళ్ళు ఏర్పడతాయి. పండ్లు పెరుగుదల ఆగిపోవచ్చు మరియు ముందుగానే రాలిపోవచ్చు. ఇతర తెగుళ్ల వలన కలిగే ఇలాంటి మచ్చలకు విరుద్దంగా, ఈ మచ్చలను తాకినప్పుడు మెలనోస్ మచ్చలు సాండ్ పేపర్ వంటి ఆకృతిని కలిగి ఉంటాయి. పూర్తిగా పండిన పండ్లలో ఈ క్రిములు పండు కుళ్లిపోయేటట్టు చేస్తాయి. ఈ తెగులు సాధారణంగా కొమ్మల నుండి వృద్ధి చెంది పండ్లు ముందుగానే రాలిపోవడానికి కూడా కారణమౌతుంది. మొదట చిన్న గోధుమ రంగు మచ్చలుగా కనిపిస్తాయి.ఇవి తరువాత ఎర్రటి-గోధుమరంగు జిగురులో నానిన ఉబ్బిన బొడిపెలుగా వృద్ధి చెందుతాయి. వీటి చుట్టూ పసుపురంగు వలయం ఉంటుంది. కొన్నిరోజులకు చిన్న, గట్టి కార్క్ స్ఫోటములు ఏర్పడతాయి. నిల్వ పరిస్థితులలో స్టెమ్ ఎండ్ రాట్ తెగులు మెలనోస్ లక్షణాలు పరిపక్వత యొక్క చివరి దశలలో పండ్ల మీద (0.2 - 1.5 మిమీ పరిమాణం గల) ఎర్రటి-గోధుమ రంగు నుండి ముదురు-గోధుమ రంగు మచ్చలుగా కనబడతాయి. చర్మం మీద ఉన్న నూనె గ్రంధుల చుట్టూ మచ్చలు ఏర్పడతాయి. సంక్రమణ జరిగేసమయంలో దెబ్బతిన్న కణజాలం మరియు పగుళ్ళు ఏర్పడతాయి. పండ్లు పెరుగుదల ఆగిపోవచ్చు మరియు ముందుగానే రాలిపోవచ్చు. ఇతర తెగుళ్ల వలన కలిగే ఇలాంటి మచ్చలకు విరుద్దంగా, ఈ మచ్చలను తాకినప్పుడు మెలనోస్ మచ్చలు సాండ్ పేపర్ వంటి ఆకృతిని కలిగి ఉంటాయి. పూర్తిగా పండిన పండ్లలో ఈ క్రిములు పండు కుళ్లిపోయేటట్టు చేస్తాయి. ఈ తెగులు సాధారణంగా కొమ్మల నుండి వృద్ధి చెంది పండ్లు ముందుగానే రాలిపోవడానికి కూడా కారణమౌతుంది. మొదట చిన్న గోధుమ రంగు మచ్చలుగా కనిపిస్తాయి.ఇవి తరువాత ఎర్రటి-గోధుమరంగు జిగురులో నానిన ఉబ్బిన బొడిపెలుగా వృద్ధి చెందుతాయి. వీటి చుట్టూ పసుపురంగు వలయం ఉంటుంది. కొన్నిరోజులకు చిన్న, గట్టి కార్క్ స్ఫోటములు ఏర్పడతాయి. నిల్వ పరిస్థితులలో స్టెమ్ ఎండ్ రాట్ తెగులు సోకే అవకాశం వుంది.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

డి. సిట్రీ ను నివారించడానికి సేంద్రీయ రాగి సమ్మేళనాలను కలిగి ఉన్న పిచికారీలను ఉపయోగించండి. మొదటి వాడకం రేకులు రాలిపోయేటప్పుడు జరగాలి, ఆ తరువాత 6-8 వారాల తరువాత రెండవసారి మరల పిచికారీ చేయాలి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ జీవపరమైన మరియు నివారణ చర్యలతో కూడిన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. వసంత కాలంలో మొక్కల పెరుగుదల సమయంలో పైరక్లోస్ట్రోబిన్ యొక్క వాడకం పండ్ల మీద మెలనోజ్ అభివృద్ధికి వ్యతిరేకంగా ప్రభావవంతమైనదని నిరూపించబడింది. మాంకోజెబ్ మరియు ఫెన్బోకనజోల్ ఆధారిత ఉత్పత్తులు కూడా సిఫార్సు చేయబడ్డాయి. స్ట్రోబిలురిన్ శిలీంధ్ర నాశినిలు కూడా సంతృప్తికరమైన ఫలితాలు ఇచ్చాయి అందువలన వీటిని కూడా ఉపయోగించవచ్చు.

దీనికి కారణమేమిటి?

మెలనోస్ అనేది చనిపోయిన కొమ్మలపై దాని జీవిత చక్రాన్ని పూర్తిచేసి కుళ్లిపోయే జీవి. ఈ తెగులు తీవ్రత చనిపోయిన కలప మీద శిలీంధ్ర పెరుగుదల మొత్తం మరియు వర్షపాతం లేదా ఓవర్ హెడ్ స్ప్రింక్లర్ నీటిపారుదల తరువాత నిరంతర తడిపే వ్యవధులను బట్టి నిర్ణయించబడుతుంది. దాదాపు 18-24 గంటల పాటు తడిచి ఉండడం మరియు 20-24°C మధ్య ఉష్ణోగ్రతలు ఈ తెగులు సంక్రమించడానికి అవసరమవుతాయి. చెట్ల మీద, నేల మీద లేదా పొదలోని మిగిలిపోయిన చిన్న చెట్లలో చనిపోయిన కలప గణనీయమైన మొత్తంలో ఉన్నప్పుడు, బీజాంశములు సమస్యలను కలిగిస్తాయి.


నివారణా చర్యలు

  • తోటలో చనిపోయిన చెట్లను క్రమం తప్పకుండా తొలగించండి.
  • చెట్లలో దెబ్బతిన్న లేదా చనిపోయిన భాగాలను సంవత్సరానికి 1-2 సార్లు చొప్పున కత్తిరించండి.
  • రోగ కారక క్రిముల దాడిని చెట్లు తట్టుకోవడానికి వీలుగా ప్రతిఘటనను మెరుగుపరచడానికి చెట్లకు సమతుల్య ఫలదీకరణను నిర్ధారించండి.
  • తెగులు లక్షణాలకు తోటను క్రమం తప్పకుండా గమనిస్తూ వుండండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి