నిమ్మజాతి

నిమ్మజాతి మొక్కలలో పొక్కు తెగులు

Elsinoe fawcettii

శీలీంధ్రం

క్లుప్తంగా

  • ఆకులకు రెండు వైపులా లేత పసుపు లేదా ప్రకాశవంతంగా వున్న ముదురు రంగు పొక్కులు ఏర్పడుతాయి.
  • ఈ పొక్కులు శంఖాకారంలో ఉండి పైన మెత్తగా తరువాత గోధుమ రంగులోనికి మారి క్రమ రహితంగా వుంటాయి.
  • దెబ్బతిన్న ఆకులు రూపం మారి ముడతలతో లేక చుట్టలు చుట్టుకుపోయి చిరిగి పోయిన కొనలతో వుంటాయి.
  • పసుపు గోధుమరంగు లేదా బూడిదరంగు బొడిపెలు లాంటి దట్టంగా వుండే పొక్కులు కనపడతాయి.

లో కూడా చూడవచ్చు


నిమ్మజాతి

లక్షణాలు

చెట్ల రకాలు మరియు పర్యావరణ పరిస్థితుల మీద ఆధారపడి లక్షణాలు కొద్దిగా మారుతూ ఉంటాయి. సాధారణంగా, మొదట అతి చిన్న నీటితో తడిచినటువంటి మచ్చలు లేత ఆకులపై కనిపిస్తాయి. ఇవి తరువాత ఆకుల రెండు వైపులా లేత పసుపు లేదా ముదురు రంగు పొక్కులుగా అభివృద్ధి చెందుతాయి. తెగులు విస్తరిస్తున్నకొలదీ ఈ పొక్కులు క్రమరహిత, శంఖం మాదిరిగా రూపాంతరం చెంది గోధుమ, మెత్తని పైభాగం కలిగి ఆకు మొత్తం విస్తరిస్తాయి. పాత గాయాలపైన పొక్కులు ఏర్పడి గట్టి పగుళ్ళు కలిగిన రూపాన్ని కలిగి ఉంటాయి. దెబ్బతిన్న ఆకులు చీలిపోయిన అంచులతో వంకరపోయి ఉంటాయి మరియు ముడతలు పడుతాయి లేదా చిందరవందరగా అవుతాయి. లేత కొమ్మలు, మెత్తటి సున్నితమైన రెమ్మలు మరియు కాండంపైన కూడా ఇవే లక్షణాలు కనిపిస్తాయి. ఆగిపోయిన మొక్కల ఎదుగుదల తగ్గడం మరియు గుబురుగా పెరగడం ఈ తెగులు యొక్క రెండు సాధారణ లక్షణాలు. తెగులు తీవ్రంగా వున్నప్పుడు ఆకులు రాలిపోతాయి. పండ్లపైన ఈ బుడిపెలు కొద్దిగా ఉబ్బి మరియు గులాబీ రంగు నుండి లేత గోధుమరంగులో ఉంటాయి. ఇవి పరిపక్వం చెందుతున్నప్పుడు దట్టమైన మొటిమల లాంటి పొక్కులుగా వృద్ధి చెంది పసుపు గోధుమ లేదా బూడిద రంగులోకి మారతాయి.

సిఫార్సులు

సేంద్రీయ నియంత్రణ

ఈ శిలీంధ్రాలకు వ్యతిరేకంగా ఏ విధమైన జీవసంబంధమైన చికిత్స అందుబాటులో లేదు. కొత్త సంక్రమణలు మరియు శిలీంద్రాల వ్యాప్తిని నివారించడానికి రాగి ఆధారిత ఆమోదిత సేంద్రీయ శిలీంద్ర నాశకాలను ఉపయోగించ వచ్చును. వీటిని సరిగా ఉపయోగించకపోతే రాగి విషపూరితం కావచ్చు అందువల్ల వీటిని వాడుతున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.

రసాయన నియంత్రణ

వీలైనంతవరకు ఎల్లపుడూ నివారణ చర్యలతో కూడిన జీవపరమైన సమీకృత సమగ్ర సస్యరక్షణ విధానాన్నిపరిగణలోకి తీసుకోండి. థీరం, డైఫెనోకోనజోల్ మరియు క్లోరోతలోనిల్ ఆధారిత రక్షిత శిలీంధ్రాలతో ఈ తెగులు విస్తృతంగా సంక్రమించకుండా నివారించవచ్చును. బెనోమిల్ లేదా కార్బెండజిం ఆధారిత రక్షిత శిలీంద్రాలు కూడా ప్రయోగించవచ్చు. బెనోమిల్ ను తట్టుకోగల తెగులు కారక సూక్ష్మ క్రిముల జాతులు కనుగొనబడినవి.

దీనికి కారణమేమిటి?

ఈ లక్షణాలు ఫంగై ఎల్సినోయి ఫాసేట్టి మరియు E. ఆస్ట్రాలిస్ వల్ల కలుగుతాయి. ఇది వివిధ రకాలైన నిమ్మజాతి చెట్లలో ఈ లక్షణాలను కలిగిస్తుంది. నిమ్మకాయలు, ద్రాక్షపండ్లు, కమలా ఫలాలు ఈ రెండు ఫంగస్ లకు గురవుతాయి. ఎల్సినోయీ ఫావ్సెట్టి ప్రధానంగా పుల్లని నారింజలో మరియు తీపి నారింజలో కొన్ని రకాలకు సోకుతుంది. దీనికి విరుద్ధంగా, E. ఆస్ట్రాలిస్ తీపి నారింజ మరియు నిమ్మజాతి పొక్కులకు కారణమవుతుంది కానీ ఇది అతిధులుగా పులుపు నారింజ పండ్లను కలిగివుండదు. ఆకులు మరియు పండ్ల చెట్లపైన గోధుమ గులాబీ రంగులో నీటి బిందువులు, మంచు, గాలి లేదా ఓవర్ హెడ్ నీటిపారుదల ద్వారా విస్తృతంగా వ్యాప్తి చెందుతుంది. ఈ రెండు జాతులలో ఇ. ఫాసెట్టీ బాగా విస్తృతంగా మొక్కలకు సంక్రమిస్తుంది. కానీ ఇ. ఆస్ట్రాలిస్ ఆర్థికంగా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది బాగా అధికంగా పెంచే నిమ్మ జాతి మొక్కలపై దాడి చేస్తుంది.


నివారణా చర్యలు

  • కొన్ని దేశాల్లో వున్న నిర్దిష్ట క్వారంటైన్ నిబంధనల గురించి తెలుసుకోండి.
  • ధ్రువీకరించిన మూలాలనుండే మొక్కల పదార్థాలు కొనుగోలు చేయండి.
  • అందుబాటులో ఉంటే నిరోధక రకాలను ఎంచుకోండి.
  • అవోకడో లేదా బొప్పాయి లాంటి నిమ్మజాతి కాని చెట్లను అంతర పంటగా నాటండి.
  • మొక్కల మరియు పరిసరాలలో వున్న కలుపును తొలగించండి.
  • అనుమానిత తెగులు సోకిన చెట్లను ఇతర పొలాలకు రవాణా చేయవద్దు.
  • ఓవర్ హెడ్ నీటి పారుదలతో నీటిని పెట్టవద్దు.
  • పాత కొమ్మలు, రెమ్మలు మరియు పండ్లను తీసివేసి తోటను శుభ్రంగా ఉంచండి.
  • తోటలో గాలి ప్రసరణ పెంచడానికి చెడిపోయిన భాగాలను కత్తిరించండి.

ప్లాంటిక్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి